రాజస్తాన్ కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ విభేదాలు తెరపైకి వచ్చాయి. ఓ రేంజ్‌లో సచిన్ పైలట్.. సీఎంపై విమర్శల దాడి చేశారు. గెహ్లాట్ నాయకురాలు వసుంధర రాజేనని.. సోనియా గాంధీ కాదేమో! అని సెటైరికల్ కామెంట్ చేశారు.
సచిన్ పైలట్ 2020లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలసి గెహ్లాట్ సర్కార్‌పై తిరుగుబాటుకి యత్నించారు. ఐతే ఆ సయమంలో తనని బీజేపీ నాయకురాలు వసుంధర రాజే తనని ఆదుకున్నారని ప్రభుత్వం పడిపోకుండా సాయం చేశారని ధోల్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ ఆయనకు చురకలు అంటిస్తూ కామెంట్ చేశారు.
ఆయన దృష్టి (గెహ్లాట్)లో వసుందర రాజే తనకు చీఫ్ అని సెటైర్ వేశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న మాదిరి సచిన్ పైలట్ అటు గెహ్లాట్‌ను, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చారు. అంతేగాదు తాను పదేపదే అవినీతి గురించి అభ్యర్థనలు చేసినా.. ఆయన ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మెతకగా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు అర్థమైందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బీజేపీకి, సీఎం మధ్య అవగాహన ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారని తెలిసిందన్నారు. గత రెండున్నరేళ్లుగా గెహ్లాట్ తనపై ఎన్నోసార్లు మాటల దాడి చేసినా, దూషించినా, పార్టీని దెబ్బతీయకూడదనే మౌనంగా ఊరుకున్నాని చెప్పారు. నా యాత్ర సీఎం గెహ్లాట్‌ని లక్ష్యంగా చేసుకుని చేయడం లేదని కూడా పైలట్ స్పష్టం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, అవినీతికి మాత్రమే తాను వ్యతిరేకినని ఆయన నొక్కి చెప్పారు.
రాజస్తాన్‌లో కూడా ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరుకుంటున్నారంటూ తాను గతంలో గెహ్లాట్‌పై చేసిన తిరుగుబాటుని సమర్థించుకునే యత్నం చేశారు పైలట్.అయితే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని వీడే యోచనలో పైలెట్ ఉన్నారని, ఈ క్రమంలోనే ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, 2018లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలుపొందడంతో ముఖ్యమంత్రి మంతి పదవిపై గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం రాజుకుంది.
ఈ విషయమై 2020లో కొందరు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడమే గాక ఢిల్లీలో రోజుల తరబడి నిరసన చేశాడు పైలట్. ఐతే కాంగ్రెస్ అధినాయకత్వం అతని సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో సచిన్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ సమస్య మింగుడుపడని అంశంగా మారింది.
(చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..)
Comments
Please login to add a commentAdd a comment