ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్‌లను అందుబాటులో ఉంచామన్నారు.
న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్‌డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన!
Comments
Please login to add a commentAdd a comment