కొందరికి జిహ్వచాపల్యం ఎక్కువ. ఏవైనా విందులు, వినోదాలు ఉంటే చాలు ఫుల్లుగా లాగించేస్తుంటారు. అయితే అలా అప్పుడప్పుడు అతిగా తినడం వల్ల శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు కానీ, తరచు అతిగా తింటూ ఉంటే మాత్రం, అది మీరు బరువు పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి దారితీస్తుంది, ఫలితంగా జీర్ణక్రియ సమస్యలు మొదలుకొని రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోవడం, గుండె సంబంధ సమస్యలతో బాధపడవలసి వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఎక్కువగా తినేసి కడుపులో అసౌకర్యంగా భావించినపుడు ఈ చిట్కాలు పాటించండి చాలు... తక్షణ ఉపశమనం లభిస్తుంది.
అమ్మమ్మల కాలం నుంచి నేటి వరకు అన్ని రకాల కడుపు సమస్యలకు ఏకైక పరిష్కారం ఏదైనా ఉంటే, అది వాము అని చెప్పవచ్చు. వాము నమలడం వల్ల కడుపులో అసౌకర్యం లేదా నొప్పి, గ్యాస్, వాంతులు, అజీర్ణం , ఆమ్లత్వం వంటి ఇతర సమస్యలను పరిష్కరించవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అలాగే మంచి విరేచన కారి కావడం వల్ల అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నవారు.. కొద్దిగా వాము, నల్ల ఉప్పు, అల్లం కలిపి చూర్ణం చేసి, భోజనం తర్వాత చప్పరించి గోరువెచ్చటి నీళ్లు తాగితే సరి!
పుదీనా టీజీర్ణ సంబంధ సమస్యలను దూరం చేయడంలో పుదీనా టీ బాగా సహాయపడుతుంది, మిరియాలు, పుదీనా కలగలిసిన టీ మీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది కడుపు కండరాలను సడలించే అనేక యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా అతిగా తినడం వల్ల కలిగే మలబద్ధకం, విరేచనాలు ఇతర కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది.
పెరుగు తినండి
మీరు కడుపులో పట్టనంతగా నిండుగా తిన్ననప్పటికీ, ఆపైన కొంచెం పెరుగు తినడం ద్వారా మేలు కలుగుతుంది. పెరుగు అనేది ్ర΄ోబయోటిక్స్ కు మూలం కాబట్టి, ఎప్పుడైనా ఆహారం పెద్ద మొత్తంలో తిన్న తర్వాత పెరుగు తప్పకుండా తీసుకోండి. ఇది కడుపు ఉబ్బరం సహా ఇతర కడుపు బాధలను తగ్గించగలదు. తాజా సాదా పెరుగు ఎంచుకోండి.
చల్లని పాలు తాగాలి
చల్లటి పాలు తాగడం అసిడిటీని ఎదుర్కోవడానికి సులభమైన ఇంటి నివారణలలో ఒకటి. ΄ాలలోని కాల్షియం, కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లాల అదనపు స్రావాన్ని నియంత్రిస్తుంది, తద్వారా కడుపులోని ఆమ్లాలను శోషిస్తుంది. చల్లని ΄ాలు అసిడిటీకి సరైన విరుగుడు, ఇది కడుపులో మంట నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
తిన్న వెంటనే నిద్ర వద్దు
బాగా తిన్న తర్వాత నేరుగా వెళ్లి హాయిగా నిద్ర΄ోతారు కొందరు. అయితే ఇది అసలు మంచిది కాదు. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ జరిగి, జీర్ణక్రియ ఆటంకాలకు కారణమవుతుంది. దాంతోబాటు మనం తిన్న ఆహారం మూలంగా వచ్చి చేరే కేలరీలు కరిగే అవకాశం ఉండక బరువు పెరుగటానికి దారితీస్తుంది.
అరకిలోమీటరైనా నడవండి
నడక మీ జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు, మీ రక్తంలో చక్కెర స్థాయులను సమం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకునే బదులు, కాస్త నడవండి, తేలికగా అనిపిస్తుంది. కేవలం 15 నిమిషాలు చిన్న నడకకు వెళ్లి వచ్చినా చాలు మంచి అనుభూతి చెందుతారు. అయితే పరుగు, జాగింగ్ లేదా వ్యాయామాలు వద్దు. తక్కువలో తక్కువగా రెండు వందలనుంచి ఐదువందల అడుగుల దూరం నడిస్తే చాలు. .
కాబట్టి, అతిగా తిన్నప్పుడు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పై చిట్కాలను ప్రయత్నించండి.
Comments
Please login to add a commentAdd a comment