Fiber
-
ఫైబర్ టెక్‌లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్‌సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు. -
డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!
డైట్ల ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారపదార్థాలను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఫైబర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే..శరీరానికి ఉపయోగపడే గట్ బ్యాక్టీరియా అందిస్తుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుందని పరిశోధన పేర్కొంది. అంతేగాదు ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎలా రక్తపోటుని తగ్గిస్తాయో సవివరంగా పేర్కోంది. ఏం చెబుతోందంటే.. మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మహిళలు, పురుషులు బీపీని తగ్గించడానికి తినాల్సిన డైటరీ ఫైబర్(ఎక్కువ ఫైబర్ ఉన్నవి) కొద్ది మొత్తంలో అందించారు. ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్న వారిలో రక్తపోటు తగ్గడమే గాక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. మందులతో సంబంధంల లేకుండా బీపీ గణనీయంగా తగ్గడం గుర్తించామనని అన్నారు పరిశోధకులు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బీపీ ఎక్కువ ఉన్న మహిళలు ఉదాహరణకు 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రోజుకి సుమారు 28% పైబర్ తీసుకోవాలని సూచించింది. అదే పురుషులకైతే రోజుకి 38 గ్రాముల వరకు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రతి అదనపు 5 గ్రా సిస్టోలిక్ బీపీ 2.8 mmHgకి, డయాస్టోలిక్ బీపీ 2.1 mmHgకి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ పైబర్ కంటెంట్ ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన గట్ మైక్రోబయోమ్‌ని అందించి తద్వారా బీపీకి దోహదపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ రెగ్యులేటరీ యాసిడీలను ఉత్పత్తి చేసేలా అనుమతిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనం హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ కోసం డైటరీ ఫైబర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం గురించి హైలెట్ చేసిందని పరిశోధకుడు మార్క్స్ చెప్పారు. తాము రోగులకు ట్రీట్మెంట్లో భాగంగా అధిక ఫైబర్ ఉన్న పదార్థాలను ఇచ్చాక రక్తపోటు తగ్గి హృదయ నాళాలను మెరుగ్గా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యుల ఆహారంలో పుష్కలంగా పీచు పదార్థాలు ఉండవని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) పేర్కొంది. అలాగే పెద్దలు సగటు ఆహారంలో కనీసం 15 గ్రాముల చొప్పున ఫైబర్ తీసుకోవాలని పేర్కొంది. ఇక్కడ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి సాధారణ నియమంగా, ప్రతి భోజనంలో కనీసం ఒక తృణధాన్యాలు (ఉదా., బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, క్వినోవా, బుల్గుర్) చేర్చండి హోల్‌గ్రెయిన్ బ్రెడ్‌ను ఎంచుకోండి (ఒక స్లైస్‌లో అత్యధిక మొత్తంలో పీచు ఉంటుంది) తెల్ల బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్‌తో ఉడికించాలి సలాడ్లకు బీన్స్ జోడించండి - దీనిలో ప్రతి ½ కప్పు సర్వింగ్‌లో 7 నుంచి 8 గ్రా ఫైబర్ ఉంటుంది వారానికి రెండు లేదా మూడు సార్లు, సూప్‌లు, కూరలు వంటి వాటిలో మాంసానికి బదులుగా చిక్కుళ్ళు (ఉదా., పప్పులు, బఠానీలు, బీన్స్, చిక్పీస్, వేరుశెనగలు) వేయండి. రోజుకు కనీసం ఐదు పండ్లు లేదా కూరగాయలను తినే యత్నం చేయండి తృణధాన్యాలకు పండ్లను జోడించడం మరింత మంచిది. పండ్ల రసాల కంటే పండు పలంగా తినడానికే ప్రయత్నించండి. ఇలా చేస్తే శరీరానికి అవసరమయ్య ఫైబర్ అంది రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది లేదా మందుల అవసరం లేకుండానే రక్తపోటు తగ్గిపోవడం జరుగుతుంది. (చదవండి: పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..) -
లోటస్ సీడ్స్ : అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!
లోటస్ లేదా తామర అనేది నెలంబో జాతికి చెందిన మొక్క. దీని గింజలను లోటస్ సీడ్స్, తామర గింజలు, మఖానా (ఫాక్స్‌నట్స్) అంటారు. సుమారు 7000 సంవత్సరాలుగా దీన్ని పూజల్లోనే ఔషధంగా కూడా ఉపయోగ పడుతోంది. ఒక విధంగా బాదం, జీడిపప్పు , ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. ఒకటి తెల్ల, రెండు గోధుమ రంగులో ఉన్న లోటస్ విత్తనాలు భారతదేశం, జపాన్ , చైనాలలో విస్తృతంగా సాగవుతున్నాయి.లోటస్ ఫుడ్‌ను ఆహారంగా చైనా ఆమోదించింది. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. తామర గింజల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం ♦ నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు సాంప్రదాయకంగా తామర గింజలను ఉపయోగిస్తారు. ♦ లోటస్ గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిట్యూమర్ ఎఫెక్ట్‌లతో సహా వివిధ ఔషధ కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ♦ విరేచనాలు ,విరేచనాలు వంటి జీర్ణశయాంతర రుగ్మతలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ సంతానోత్పత్తి , లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ♦ ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. ♦ తేలికగా బరువు తగ్గాలనుకునే వారు లోటస్ సీడ్స్‌ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ♦ తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ♦ విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,ఐరన్ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ♦ 100 గ్రాముల మఖానాలో, 9.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ♦ లోటస్ సీడ్స్ లేదా ఫాక్స్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది యాంటి ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. ♦ తామర గింజల్లో కెంప్ఫెరోల్ అనే సహజ సమ్మేళనం ఆర్థరైటిస్ రుమాటిజం రోగుల్లో వాపులను నివారిస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ఇది మంచిది. ♦ గ్లూటెన్ రహిత పదార్తాలకు ప్రత్యామ్నాయంగా మఖానాను తినవచ్చు. -
వినోదం కోసం..ఫైబర్‌కు సై!
న్యూఢిల్లీ: దేశీయంగా టీవీ వీక్షకులు వినోదం కోసం క్రమంగా డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) సర్వీసుల నుంచి ఫైబర్ కనెక్షన్ల వైపు మళ్లుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ వేగవంతంగా ఉండటం, అనేకానేక ఓటీటీ యాప్‌లు అందుబాటులోకి రావడం, నెట్వర్క్ స్థిరంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. దీంతో లక్షల మంది కస్టమర్లు డీటీహెచ్‌ను వదిలేసి ఫైబర్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత త్రైమాసికంలో డీటీహెచ్ కస్టమర్ల సంఖ్య ఏకంగా 13.20 లక్షలు తగ్గడం ఇందుకు నిదర్శనం. ఫైబర్ కనెక్షన్లకు ఆదరణ పెరుగుతుండటమనేది వినోదం విషయంలో ప్రజల అలవాట్లు మారుతుండటాన్ని సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు, సాంకేతిక లోపాల కారణంగా పదే పదే అంతరాయాలు వస్తుంటాయని డీటీహెచ్ సర్విసులపై విమర్శలు ఉన్నాయి. అదే ఫైబర్ కనెక్షన్లయితే పటిష్టమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ఉంటాయని ధీమా ఉంటోంది. గ్యారంటీగా నిరంతరాయ సర్వీసుతో పాటు పనితీరు కూడా అత్యుత్తమంగా ఉండటంతో ఇవి మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. యువత దన్ను.. జియో సినిమా, జియోటీవీ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ప్రజల ధోరణులు మారడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫైబర్ కనెక్షన్ల ద్వారా అందుబాటులో ఉండే ఈ ప్లాట్‌ఫామ్‌లు.. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లైవ్ స్పోర్ట్స్, లేటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు లాంటి బోలెడంత కంటెంట్‌ను హై డెఫినిషన్ నాణ్యతతో అందిస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా నిరంతరాయంగా వినోద సర్విసులు అందుబాటులో ఉండటమనేది ఆకర్షణీయంగా ఉండటంతో యువత ఎక్కువగా ఫైబర్ కనెక్షన్ల వైపు మొగ్గు చూపుతోంది. గణాంకాల ప్రకారం ఇప్పటికే 2.23 కోట్ల మంది యూజర్లు ఫైబర్వైపు మారారు. సాంప్రదాయ డీటీహెచ్ సేవలతో పోలిస్తే ఇంటర్నెట్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని విశ్లేషకులు తెలిపారు. అదే సమయంలో డీటీహెచ్ సర్విసులకు డిమాండ్ తగ్గుతుండటాన్ని కూడా సూచిస్తోందని పేర్కొన్నారు. -
దేశంలో మొదటి స్పేస్‌ఫైబర్ ఇంటర్నెట్ను ప్రారంభించిన జియో
న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023’ ప్రారంభం సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ స్పేస్ఫైబర్ను ఆవిష్కరించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి శాటిలైట్ గిగాఫైబర్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా ఇంటర్నెట్ అందే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. లక్షలాది కుటుంబాలు, వ్యాపారాలు మొదటిసారిగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అనుభవించే అవకాశాన్ని జియో కల్పించిందన్నారు. జియో స్పేస్ఫైబర్తో ఇంకా కొన్ని ఇంటర్నెట్ అందని ప్రాంతాలకు సేవలందించే వెసులుబాటు ఉంటుదన్నారు. జియోస్పేస్‌ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా గిగాబిట్ యాక్సెస్‌తో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చని ఆయన చెప్పారు. రిలయన్స్ జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ వంటి సర్వీసుల సరసన జియోస్పేస్‌ఫైబర్‌ను చేర్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. తాజా శాటిలైట్ నెట్‌వర్క్‌తో జియో ట్రూ5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని కంపెనీ తెలిపింది. ప్రపంచంలో శాటిలైట్ టెక్నాలజీ(మీడియం ఎర్త్ ఆర్బిట్-ఎంఈఓ) కోసం జియో ఎస్ఈఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్, స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది. జియోస్పేస్‌ఫైబర్ ఇప్పటికే గుజరాత్ గిర్, ఛత్తీస్‌గఢ్ కోర్బా, ఒడిశా నవరంగాపూర్, అసోం ఓఎన్జీసీ జోర్హట్ వంటి మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తుంది. -
Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది..లాంచింగ్ ధర, ఆఫర్లు
Jio AirFiber ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ఎయిర్‌ఫైబర్ ను లాంచ్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించినట్టుగానే నేడు (సెప్టెంబరు 19) ఈ సేవలను ఆవిష్కరించింది. ముందుగా దేశంలోని 8 నగరాల్లో ఈ సేవలను జియో ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రారంభ నెలవారీ ప్లాన్ రూ.599గాను, హై ఎండ్ ప్లాన్‌ను రూ.3,999 గాను జియో ప్రకటించింది. జియో ప్రకటించిన దాని ప్రకారం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణేలలో Jio AirFiber సేవలు అందుబాటులో ఉంటాయి. (గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్) Jio AirFiber విశేషాలు Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను , 16 ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లకు యాక్సెస్‌ను లభిస్తుంది. టీవీ లేదా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను ప్రపంచ-స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవానికి అప్‌గ్రేడ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా అందించబడుతుంది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ల ప్రారంభ ధర రూ. 599. ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా Wi-Fi రూటర్, 4K స్మార్ట్ సెట్-టాప్ బాక్స్ . వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్‌ను అందిస్తోంది. ఇంకా పేరెంటల్ కంట్రోల్, Wi-Fi 6కి మద్దతు ,ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. (యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ ) Jio AirFiber ప్లాన్స్ ♦ పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఆరు ప్లాన్లున్నాయి. రెగ్యులర్ ప్లాన్ ధర రూ. 599, ఇది 30Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ♦ రూ. 899. రూ. 1,199 ప్లాన్లు 100Mbps వద్ద అపరిమిత డేటా ♦ AirFiber Max కింద, ప్రాథమిక ప్లాన్ ధర రూ. 1,499గా నిర్ణయించింది. ఇది 300Mbps డేటాను అందిస్తుంది. ♦ రూ. 2,499 ప్లాన్ 500Mbps వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు. ♦ అత్యంత ఖరీదైన జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ రూ. 3,999. ఇది 1Gbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ♦ అన్ని ప్లాన్లు ఆరు లేదా 12 నెలల వ్యవధితో వస్తాయి , ఈప్లాన్ అన్నింటికి జీఎస్టీ అదనం ♦ ఇన్స్టాలేషన్ ఛార్జీలు రూ.1,000 ♦12 నెలల ప్లాన్‌పై ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేవు ♦ ఇన్స్టాలేషన్ 1 అక్టోబర్, 2023 నుండి ప్రారంభం ఈ కొత్త ప్లాన్లు జియో అధికారిక వెబ్సైట్, లేదా సమీపంలోని Jio స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాట్సాప్‌లో 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా వినియోగదారులు ఈ కనెక్షన్‌ని పొందవచ్చు. -
పీచే కదా అని తీసిపడేయకండి!
మొక్కజొన్న కంకులను తీసుకొని దానికి ఉండే దారాల్లాంటి పీచు (కార్న్ సిల్క్)ను మాత్రం తీసి పారేస్తుంటాం. అయితే, ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పీచును ప్రపంచవ్యాప్తంగా వివిధ రపాల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని సేకరించి, ఎండబెట్టి అమ్ముకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్న సాగులో ప్రపంచంలో భారత్ 6వ స్థానంలో ఉంది. 2021–22 రబీ గణాంకాల ప్రకారం ఏపీలో 4.82 లక్షల ఎకరాల్లో, తెలంగాణలో 4.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. మొక్కజొన్న కండెలు కోసేటప్పుడే పీచును కండె నుంచి తీసి జాగ్రత్త చేసుకోవాలి. సేకరించిన పీచును 0.1% ఉప్పు ద్రావణంతో కడిగి శుభ్రం చేసి ఎండబెట్టాలి. తేమ శాతం 7–10% మధ్యలో ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పీచును అనేక ఆహారోత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. ఒక మొక్కజొన్న పొత్తు నుంచి జాగ్రత్తగా సేకరించి ఎండబెడితే సగటున ఒక గ్రాము పీచు వస్తుందని అంచనా. ఏక పంటగా సాగు చేస్తే ఎకరానికి 32 వేల మొక్కలు వేస్తారు. అంటే, ఎకరానికి 32 కిలోల ఎండు పీచును సేకరించవచ్చన్న మాట. షుగర్, కిడ్నీ, ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం మొక్కజొన్న పీచులో అధిక పోషక విలువలతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు,కాల్షియం, పొటాషియం, వంగనీసు, సిటోస్టెరాల్, స్టిగ్మాస్టెరాల్, అల్కలాయిడ్లు, సపోనిన్లు, టాన్నిన్లు, ఫ్లావనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. దేహంలో నుంచి అధిక నీటిని బయటకు పంపుతుంది. మూత్రవిసర్జనను సులభతరం చేయటం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. మూత్రవిసర్జనలో నొప్పి, మూత్రనాళంలో/ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇన్సులిన్ సహజ ఉత్పత్తిని పెంపొందించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్టరాల్ సమస్యలను నివారిస్తుంది. గౌట్ నొప్పిని తగ్గిస్తుంది. కొవ్వును నియంత్రించి అధిక బరువును నివారించడానికి కూడా మొక్కజొన్న పీచు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఆహారోత్పత్తులెన్నో.. బ్రెడ్, బిస్కట్ల తయారీలో మొక్కజొన్న పీచు పొడిని కొద్ది మేరకు కలుపుతున్నారు. దీన్ని కలిపినందు వల్ల వాటి రంగు, వాసన ఏమీ మారవు. పోషక విలువలు పెరుగుతాయి. బియ్యపు పిండి, పచ్చి బొప్పాయి, నువ్వుల పిండితో మొక్కజొన్న పీచు పొడిని గరిష్టంగా 10% కలుపుతూ ఆరోగ్యదాయకమైన లడ్డూలు తయారు చేయొచ్చు. చపాతీ, పరోటా, రైతా, పప్పు వంటి వంటకాల్లో మొక్కజొన్న పీచు పొడిని కలుపుకుంటే మం పోషక విలువలు లభిస్తాయి. టాబ్లెట్లను కూడా మొక్కజొన్న పీచుతో తయారు చేయవచ్చు. బరువు తగ్గడానికి, చర్మ సౌందర్యం కోసం ఈ టాబ్లెట్లను వాడుతున్నారు. ఒక్కో మాత్రను ర.20 వరక ధర పలుకుతోందట. మొక్కజొన్న పీచు ప్రాసెసింగ్, నిల్వకు అధిక ఖర్చుతో కూడిన నిర్మాణాలు అవసరం లేదు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, గ్రామీణ నిరుద్యోగులకు మొక్కజొన్న పీచు సేకరణ ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. మొక్కజొన్న రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి/సేంద్రియ రైతులకు మరింత ఉపయోగకరమని చెప్పొచ్చు. మొక్కజొన్న పీచుతో టీ ఇలా.. ఎండబెట్టిన మొక్కజొన్న పీచుతో టీ(కషాయం) కాచుకొని తాగటం ఒక మేలైన పద్ధతి. 2 కప్పుల నీటిలో 2 చెంచాల ఎండిన పీచును కలిపి, తక్కువ మంటపై 10 నిమిషాలు మరిగించి వడకడితే.. చక్కటి టీ రెడీ అవుతుంది. బెల్లం, పంచదార, తేనె తగుమాత్రంగా కలిపి రోజుకు 3 కప్పుల వరకు తాగొచ్చు. వట్టి మొక్కజొన్న పీచు టీకి కొంచెం మట్టి వాసన ఉంటుంది. అందుకని ఇతర పదార్థాలతో కలిపి టీపొడిని తయారు చేసుకొని వాడొచ్చు. ఎండిన మొక్కజొన్న పీచు, ఎండు నిమ్మ బద్దలను వేర్వేరుగా పిండి చేసి కలిపి టీ కాచుకోవచ్చు. (చదవండి: 'కిచెన్ క్వీన్స్'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!) -
ఫుల్లుగా తిన్నారా...ఆందోళన వద్దు
కొందరికి జిహ్వచాపల్యం ఎక్కువ. ఏవైనా విందులు, వినోదాలు ఉంటే చాలు ఫుల్లుగా లాగించేస్తుంటారు. అయితే అలా అప్పుడప్పుడు అతిగా తినడం వల్ల శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు కానీ, తరచు అతిగా తింటూ ఉంటే మాత్రం, అది మీరు బరువు పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి దారితీస్తుంది, ఫలితంగా జీర్ణక్రియ సమస్యలు మొదలుకొని రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోవడం, గుండె సంబంధ సమస్యలతో బాధపడవలసి వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఎక్కువగా తినేసి కడుపులో అసౌకర్యంగా భావించినపుడు ఈ చిట్కాలు పాటించండి చాలు... తక్షణ ఉపశమనం లభిస్తుంది. అమ్మమ్మల కాలం నుంచి నేటి వరకు అన్ని రకాల కడుపు సమస్యలకు ఏకైక పరిష్కారం ఏదైనా ఉంటే, అది వాము అని చెప్పవచ్చు. వాము నమలడం వల్ల కడుపులో అసౌకర్యం లేదా నొప్పి, గ్యాస్, వాంతులు, అజీర్ణం , ఆమ్లత్వం వంటి ఇతర సమస్యలను పరిష్కరించవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అలాగే మంచి విరేచన కారి కావడం వల్ల అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నవారు.. కొద్దిగా వాము, నల్ల ఉప్పు, అల్లం కలిపి చూర్ణం చేసి, భోజనం తర్వాత చప్పరించి గోరువెచ్చటి నీళ్లు తాగితే సరి! పుదీనా టీజీర్ణ సంబంధ సమస్యలను దూరం చేయడంలో పుదీనా టీ బాగా సహాయపడుతుంది, మిరియాలు, పుదీనా కలగలిసిన టీ మీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది కడుపు కండరాలను సడలించే అనేక యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను అందిస్తుంది. అంతేకాకుండా అతిగా తినడం వల్ల కలిగే మలబద్ధకం, విరేచనాలు ఇతర కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. పెరుగు తినండి మీరు కడుపులో పట్టనంతగా నిండుగా తిన్ననప్పటికీ, ఆపైన కొంచెం పెరుగు తినడం ద్వారా మేలు కలుగుతుంది. పెరుగు అనేది ్ర΄ోబయోటిక్స్ కు మూలం కాబట్టి, ఎప్పుడైనా ఆహారం పెద్ద మొత్తంలో తిన్న తర్వాత పెరుగు తప్పకుండా తీసుకోండి. ఇది కడుపు ఉబ్బరం సహా ఇతర కడుపు బాధలను తగ్గించగలదు. తాజా సాదా పెరుగు ఎంచుకోండి. చల్లని పాలు తాగాలి చల్లటి పాలు తాగడం అసిడిటీని ఎదుర్కోవడానికి సులభమైన ఇంటి నివారణలలో ఒకటి. ΄ాలలోని కాల్షియం, కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లాల అదనపు స్రావాన్ని నియంత్రిస్తుంది, తద్వారా కడుపులోని ఆమ్లాలను శోషిస్తుంది. చల్లని ΄ాలు అసిడిటీకి సరైన విరుగుడు, ఇది కడుపులో మంట నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. తిన్న వెంటనే నిద్ర వద్దు బాగా తిన్న తర్వాత నేరుగా వెళ్లి హాయిగా నిద్ర΄ోతారు కొందరు. అయితే ఇది అసలు మంచిది కాదు. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ జరిగి, జీర్ణక్రియ ఆటంకాలకు కారణమవుతుంది. దాంతోబాటు మనం తిన్న ఆహారం మూలంగా వచ్చి చేరే కేలరీలు కరిగే అవకాశం ఉండక బరువు పెరుగటానికి దారితీస్తుంది. అరకిలోమీటరైనా నడవండి నడక మీ జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు, మీ రక్తంలో చక్కెర స్థాయులను సమం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకునే బదులు, కాస్త నడవండి, తేలికగా అనిపిస్తుంది. కేవలం 15 నిమిషాలు చిన్న నడకకు వెళ్లి వచ్చినా చాలు మంచి అనుభూతి చెందుతారు. అయితే పరుగు, జాగింగ్ లేదా వ్యాయామాలు వద్దు. తక్కువలో తక్కువగా రెండు వందలనుంచి ఐదువందల అడుగుల దూరం నడిస్తే చాలు. . కాబట్టి, అతిగా తిన్నప్పుడు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పై చిట్కాలను ప్రయత్నించండి. (చదవండి: ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు) -
Health: మలబద్ధకం నివారణ... మరికొన్ని ప్రయోజనాలు!! ఇవి తరచుగా తింటే..
Health Tips In Telugu- Constipation (Malabaddakam): మలబద్ధకం అన్నది ఉదయాన్నే చాలామందిని బాధపెడుతుంది. సాఫీగా విరేచనం జరగకపోతే పొద్దున్నే లేచింది మొదలు రోజంతా ఇబ్బందికరంగానే గడుస్తుంది. అయితే మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని, కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటుంటే మల బద్ధకం సమస్య చాలా సులువుగానే దూరమవుతుంది. అయితే ఈ మార్గాలతో కేవలం మలబద్ధకం నివారణ మాత్రమే కాకుండా అనేక అదనపు ప్రయోజనాలూ ఒనగూరతాయి. జీర్ణాశయం మార్గం శుభ్రంగా పీచు మోతాదు ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య దరిచేరదన్న విషయం తెలిసిందే. ఆ ఆహారాలు కేవలం మలబద్ధకాన్ని నివారించడం మాత్రమే కాదు... పూర్తి జీర్ణాశయం మార్గాన్నీ శుభ్రంగా ఉంచుతాయి. ఇందుకోసం భోజనంలో ఎక్కువమొత్తంలో ఆకుకూరలు, కాయగూరలు, ఫైబర్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు తీసుకోవాలి. చక్కెర మోతాదులు నియంత్రణలో వీటితో పాటు పీచు మోతాదులు పుష్కలంగా ఉండే పుచ్చకాయలు, బొప్పాయి, నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. వీటితో మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే... అవి తేలిగ్గా విరేచనమయ్యేలా చేయడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్‌నూ, చక్కెర మోతాదుల్ని నియంత్రణలో ఉంచడానికీ తోడ్పడతాయి. సలాడ్స్ రూపంలో.. చిక్కుడు కాయల వంటి కూరల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చిక్కుళ్లు కండరాల రిపేర్లకూ, శక్తికీ, ఆరోగ్యకరమైన కండరాలకూ దోహదపడతాయి. అలాగే వాటిలోని పీచుపదార్థాలూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. క్యారట్, బీట్రూట్ వంటి వాటిల్లోనూ ఫైబర్ ఎక్కువే. వీటిని కూరలుగా తీసుకోవచ్చు. అయితే కొంతమందికి అవి కూరలుగా అంతగా నచ్చకపోవచ్చు. అలాంటివారు సలాడ్స్ రూపంలో లేదా సూప్‌గానూ తీసుకోవచ్చు. చర్మ నిగారింపునకై పీచుపదార్థాలుండే ఆహారాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణ వ్యవస్థ మార్గమూ శుభ్రపడుతుంది. దేహం హైడ్రేటెడ్‌గానూ ఉంటుంది. ఫలితంగా మలబద్ధక నివారణే కాదు చర్మానికి మంచి నిగారింపుతో కూడిన మెరుపును ఇవ్వడంతో పాటు మరెన్నో జబ్బుల నివారణకూ ఈ అంశం తోడ్పడుతుంది మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇక్కడ పేర్కొన్న మార్గాలు కేవలం మలబద్ధకం నివారణ కోసం మాత్రమే కాకుండా... దాదాపు ప్రతి ఒక్కటి మన వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, జీర్ణవ్యవస్థలోని పిండి పదార్థాలను (కార్బోహైడ్రేట్స్‌ను) రక్తంలోకి ఆలస్యంగా వెలువడేలా చేయడం ద్వారా మధుమేహాన్ని నివారించడం, మరెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం వంటి పనులూ చేస్తాయి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. చదవండి: రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. -
ప్రారంభమైన జియో ఫైబర్ సేవలు
-
రోగాల పీచమణిచే పీచు పదార్థాలు
పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. పీచు పదార్థాలు మరో మేలు కూడా చేస్తాయని ఒక తాజా పరిశోధనలో బయటపడింది. జీర్ణ వ్యవస్థకు మేలు చేయడమే కాకుండా అవి రోగ నిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీచు పదార్థాలు తెల్ల రక్తకణాల సంఖ్యను వృద్ధి చేస్తాయని, అందువల్ల ఆహారంలో పీచుపదార్థాలను పుష్కలంగా తీసుకునే వారు సాధారణమైన జలుబు మొదలుకొని రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోగలుగుతారని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీచు పదార్థాలను బాగా తీసుకునే వారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా బాగుంటుందని ఉబ్బసం సహా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను వారు సమర్థంగా తట్టుకుని, త్వరగా తేరుకోగలరని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. పొట్టు తీయని ధాన్యాలు, గింజ ధాన్యాలు, అవిసెగింజలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయని, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే వీటిని రోజూ తప్పనిసరిగా తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. -
నీచు బదులు పీచు మేలు...
ఫైబర్ బెటర్ మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? కేవలం ఆహారంలో ఒక చిన్న మార్పు మీ పూర్తి ఆరోగ్యాన్నే మార్చేస్తుంది. మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో 30 గ్రాముల పీచు ఉండేలా చూసుకుంటే చాలు. మీ బరువు పెరగరు సరికదా... పెరిగిన బరువూ తగ్గే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ)సంస్థ టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉన్న దాదాపు 240 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. ఇందులో ఆల్కహాల్, ఉప్పు, చక్కెరలను చాలా పరిమితంగా తీసుకుంటూ పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలతో వండిన వంటలతో పాటు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మధ్య సమతౌల్యం పాటిస్తే ఏడాదిలోనే 2.72 కిలోలు (ఆరు పౌండ్ల) బరువు తగ్గుతారు. అందుకే నీచు బదులు పీచు తినడమే మేలంటున్నారు ఏహెచ్ఏ సంస్థ వారు. -
అద్దాలతో అందం
హైదరాబాద్: నగరంలో ఆకాశాన్నంటే అద్దాల మేడల నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. మార్కెట్లో వస్తున్న మార్పులు, అవసరాల ఆధారంగా వీటి జోరు పెరుగుతోంది. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం కాలుష్యం కారణంగా వెలవెలబోతే ప్రయోజనం ఉండదు. కాలుష్యంతో భవనాల గోడలే కాదు, అందులో ఉండే వారి ఆరోగ్యం కూడా పాడవుతోంది. అందుకే భవనాలకు రక్షణ కవచం (ఫ్రంట్ ఎలివేటర్) అవసరమంటున్నారు నిపుణులు. మేలిమి ముసుగును తలపించే రీతిలో అద్దాలతో నిర్మించిన ఫ్రంట్ ఎలివేటర్స్, ఫైబర్, ప్లాస్టిక్‌ను ఉపయోగించి నిర్మించిన ఫ్రంట్ ఎలివేషన్ భవనానికి కొత్త అందానిస్తాయి. నగరంలో రోడ్డుకిరువైపులా కొలువుదీరిన భవనాలన్నీ ఇలా ముస్తాబవుతున్నవే. అపార్ట్మెంట్ల నుంచి కార్పొరేట్ కార్యాలయాల వరకు ఫ్రంట్ ఎలివేషన్‌తో ముస్తాబై శోభాయమానంగా నిలుస్తున్నాయి. ఎలివేషన్‌తో: రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలకు కాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భవనాల లోపలి గోడలు, వస్తువులు, ఫైళ్లపై దుమ్ము పేరుకుపోతుంది. పుస్తకాలు, ఫైళ్లు నల్లగా రంగు మారతాయి. దీని నుంచి బయటపడాలంటే భవనానికి రోడ్డువైపు ఫ్రంట్ ఎలివేషన్ చేయించాలి. వెంటిలేషన్ కోసం భవనం వెనుక వైపు కిటికీలను, విండోలను ఓపెన్ చేయాలి. వెనుక, ఇరుపక్కల ప్రంట్ ఎలివేషన్ చేయించినా వెంటిలేషన్ కోసం ఓపెన్ చేసేందుకు వీలుగా నిర్మించుకుంటే మంచిది. అద్దాలే బెటర్: వెంటిలేషన్‌కు ఫైబర్, ప్లాస్టిక్ కన్నా అద్దాలు ఉపయోగిస్తే మంచిది. ఎందుకంటే పగలు వెలుతురు ప్రసరించడం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. అద్దాలు పగలకుండా నెట్ (వల) అమర్చుకోవచ్చు. కొన్ని భవనాలకు చుట్టూ గోడలు నిర్మించకుండా ఎలివేషన్ చేయిస్తున్నారు. ఇందువల్ల ఖర్చు తగ్గుతుంది. భవనం ఫిల్లర్స్‌పై బరుకు కూడా తగ్గుతుంది. ఎలివేషన్ కారిడార్‌లో వర్షం పడకుండా నిరోధిస్తుంది. గాలి వానల సమయంలో ఏ ఇబ్బంది ఉండదు.