డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో తనీష్‌ ‘మరో ప్రస్థానం’ | Tanish Maroprastanam Movie Will Release On September Last Week | Sakshi
Sakshi News home page

Maroprastanam: తనీష్‌ ‘మరో ప్రస్తానం’ స్పెషల్‌ ఇదే

Published Sat, Sep 11 2021 4:33 PM | Last Updated on Sat, Sep 11 2021 4:33 PM

Tanish Maroprastanam Movie Will Release On September Last Week - Sakshi

యంగ్‌ హీరో తనీష్‌ నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’.జాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముస్కాన్ సేథీ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. 

‘మరో ప్రస్థానం’విషయానికొస్తే.. ఇదొక ఎమోషనల్‌ కిల్లర్‌ జర్నీ మూవీ. రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే, సరిగ్గా అదే టైమ్‌కు సినిమా పూర్తి అవుతుంది. కథ, కథనం సరికొత్తగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న తమ సినిమా తప్పకుండా సక్సెస్‌ అవుతుందని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement