రొమాంటిక్ బ్యాండ్ బాజా | Band Baaja' is an upcoming telugu movie | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ బ్యాండ్ బాజా

Published Sat, Aug 24 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

రొమాంటిక్ బ్యాండ్ బాజా

రొమాంటిక్ బ్యాండ్ బాజా

‘‘నయీమ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఆయన నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించి, ఈ బేనర్‌లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ‘దిల్’ రాజు. తనీష్, రూపల్ జంటగా నాగమల్ల శంకర్ సమర్పణలో షేక్ నయీమ్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాండ్ బాజా’. నాగేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కురాకుల పాటలు స్వరపరిచారు.
 
 హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో పాల్గొన్న ‘దిల్’ రాజు సీడీని ఆవిష్కరించి తనీష్, రమేష్ పుప్పాలకి ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. గ్రామీణ, నగర నేపథ్యంలో సాగుతుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు.
 
 స్క్రీన్‌ప్లే, సాంగ్స్, డైలాగ్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయని తనీష్ తెలిపారు. మంచి పాటలకు స్కోప్ ఉన్న కథ అని విజయ్ చెప్పారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని నయీమ్ అన్నారు. ఇంకా ఈ వేడుకలో చదలవాడ శ్రీనివాసరావు, రామసత్యనారాయణ, సాయి వెంకట్, పాండు రంగారావు, రూపల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement