రామయ్య రెడీ అవుతున్నాడు
రామయ్య రెడీ అవుతున్నాడు
Published Sat, Aug 10 2013 12:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
ఎన్టీఆర్... భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరో. హరీష్‌శంకర్.... తన సృజనతో మాస్‌ని మెస్మరైజ్ చేయగల దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే.... అభిమానులకు పండుగ కాక మరేంటి! వీరి కలయికలో రూపొందుతోన్న ‘రామయ్యా... వస్తావయ్యా’ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత ‘దిల్’రాజు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే దాదాపు తొంభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందీ సినిమా. వచ్చేవారం నుంచి మొదలయ్యే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమాలోని ఎన్టీఆర్ పాత్రను దర్శకుడు చాలా శక్తిమంతంగా తీర్చిద్దుతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. మాస్ ప్రజానీకంతో పాటు, యువతరం ప్రేక్షకులు కూడా మెచ్చేలా ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగులు ప్రతి నోటా మారుమోగుతున్నాయి.
ముఖ్యంగా... ‘బుడ్డోడు బుడ్డోడు అంటే...’ డైలాగ్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోందని సమాచారం. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి నిర్మాత ‘దిల్’రాజు సన్నా హాలు చేస్తున్నారు. ఇదిలావుంటే... సంతోష్ శ్రీనివాస్ ‘రభస’ చిత్రంలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
సుకుమార్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. మరో వార్త ఏంటంటే... ‘మిర్చి’ఫేం కొరటాల శివ ఇటీవలే ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్పారట. ఎన్టీఆర్‌కి కూడా ఈ కథ బాగా నచ్చడంతో... బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కొరటాలను ఎన్టీఆర్ పురమాయించి నట్లు ఫిలింనగర్ సమాచారం.
Advertisement
Advertisement