స్పెయిన్‌లో రామయ్య డ్యూయెట్స్ | Jr NTR Ramayya Vasthavayya shoots in Spain | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లో రామయ్య డ్యూయెట్స్

Published Mon, Aug 19 2013 11:58 PM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

స్పెయిన్‌లో రామయ్య డ్యూయెట్స్

స్పెయిన్‌లో రామయ్య డ్యూయెట్స్

కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ సినిమాలు చేయడం...  ఏజీ ఇమేజీ పెరిగాక అప్పుడు మాస్ సినిమాలు చేయడం హీరోలకు పరిపాటి. కానీ ఎన్టీఆర్ అందుకు భిన్నం. కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి, బాలకృష్ణ చేసినంత మాస్ సినిమాలు చేసేశారాయన. ఇప్పుడేమో... రొమాంటిక్ యాంగిల్లో కనిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. స్లిమ్ అయ్యాక ఆయనలో వచ్చిన మార్పు ఇది. ‘బృందావనం’, త్వరలో రాబోతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ ఆ కోవకు చెందిన సినిమాలే. 
 
 ఈ నెల 26న పాటల చిత్రీకరణకు ఈ చిత్రం యూనిట్ స్పెయిన్ వెళుతోంది. అక్కడ ఎన్టీఆర్-శ్రుతిహాసన్‌తో ఓ పాట, ఎన్టీఆర్-సమంతతో ఓ పాట చిత్రీకరించనున్నారు. ఈ రెండూ మంచి రొమాంటిక్ డ్యూయేట్లే కావడం విశేషం. యువతను ఉర్రూతలూగించేలా ఈ పాటలు ఉంటాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా లావిష్‌గా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, గతంలో ఎన్టీఆర్‌తో ఆయన నిర్మించిన ‘బృందావనం’ సినిమాను మించేలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కూడా. 
 
 ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకునిగా కనిపిస్తాడు. ఓ వైపు రొమాంటిగ్గా, మరోవైపు శక్తిమంతంగా ఆయన పాత్ర సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభినయిస్తున్న తీరును అభినందిస్తూ... దర్శకుడు హరీష్‌శంకర్ ట్విట్టర్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ‘‘నాట్యమైనా, నటనైనా, సంభాషణలు పలికే తీరైనా... ఏదైనా.. ఎన్టీఆర్‌కి కరతలామలకం. 
 
 నిజానికి కెమెరా ముందు అతను పెట్టే ఎఫర్ తక్కువ. కానీ తెరపై మాత్రం అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దటీజ్ ఎన్టీఆర్’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీన్ని బట్టి... ఇందులో ఎన్టీఆర్ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే నెల 10కల్లా ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ వర్గాల భోగట్టా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement