అమ్ములుగా శ్రుతిహాసన్
అమ్ములుగా శ్రుతిహాసన్
Published Tue, Sep 24 2013 2:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
కొన్ని పాత్రలు నటీనటుల జీవి తాన్నే మార్చేస్తాయి. ‘గబ్బర్‌సింగ్’లో శ్రుతిహాసన్ పోషించిన భాగ్యలక్ష్మి పాత్ర లాగా. ఆ పాత్ర శ్రుతికి నిజంగానే భాగ్యాన్ని తెచ్చిపెట్టింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది ఈ ముద్దుగుమ్మకు. విరివిగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా అవతరించారు శ్రుతి.
ఇదిలావుంటే... ఎన్టీఆర్‌కి జోడీగా ఆమె నటించిన ‘రామయ్యా వస్తావయ్య’ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చాలా ఉద్వేగంతో ఉన్నారు శ్రుతి. కారణం ఆ సినిమాలో తను పోషించిన ‘అమ్ములు’ పాత్ర. జీవితాలను మలుపుతిప్పే పాత్రలు అరుదుగా మాత్రమే వస్తుంటాయి.
నాకు వెంటవెంటనే వస్తున్నాయి. అంటూ ఇటీవల మీడియా ముందు ఆనందాన్ని వ్యక్తం చేశారు శ్రుతి. ‘‘‘గబ్బర్‌సింగ్’లోని భాగ్యలక్ష్మి పాత్రతో నేను తెలుగమ్మాయిని అయిపోయాను. ఇక్కడ అందరూ సొంత అమ్మాయిలా చూసుకుంటున్నారు. త్వరలో రాబోతున్న ‘రామయ్యా వస్తావయ్య’లో అంతకంటే గొప్ప పాత్ర చేశాను.
ఇందులో నా పాత్ర పేరు ‘అమ్ములు’. అచ్చతెనుగు అమ్మాయి పాత్ర అన్నమాట. ‘గబ్బర్‌సింగ్’లో సెలైంట్‌గా కనిపించిన నేను, ఇందులో చలాకీగా మురిపిస్తా. ఈ సందర్భంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హరీష్‌శంకర్‌కే. రెండు మంచి పాత్రలిచ్చి నా కెరీర్‌నే మార్చేశారాయన’’ అన్నారు.
Advertisement
Advertisement