N. T. Rama Rao Jr
-
టెంపర్ చూసేందుకు వచ్చిన ప్రముఖులు
-
సరికొత్త కాంబినేషన్లు
సినిమా పరిశ్రమలో ఎవరెవరు ఎప్పుడు కలిసి పనిచేస్తారనేది ఎవ్వరూ చెప్పలేరు. ఫలానావారు ఫలానా వారికే సెట్ అవుతారనే రూల్ కూడా ఏమీ లేదు. ఇక్కడ ఏదైనా జరగొచ్చును. ఒక్కోసారి కొన్ని కాంబినేషన్లు భలే గమ్మత్తుగానూ ఆసక్తికరంగానూ అనిపిస్తాయి. అలాంటి ఓ నాలుగు కాంబినేషన్ల గురించి ప్రస్తుతం ఫిలిమ్నగర్లో వేడి వేడి చర్చ జరుగుతోంది. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌కి మళ్లీ ఓ కొత్త ఉత్తేజం తీసుకొచ్చారు వెంకటేశ్. మహేశ్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసిన వెంకీ, ‘మసాలా’లో రామ్‌తో కలిసి యాక్ట్ చేస్తున్నారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు ఫిలిమ్నగర్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో పాటు మరో వార్త షికారు చేస్తోంది. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ చిత్రాలతో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న మారుతి దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయడానికి అంగీకరించారట. దీనికి టైటిల్ ‘రాధ’ అని సమాచారం. డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారట. ఎన్టీఆర్‌లాంటి హై ఓల్టేజ్ మాస్ హీరో, త్రివిక్రమ్ శైలిలో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఉద్వేగాన్ని రేకెత్తించే వార్తే. ఇటీవలే ‘అత్తారింటికి దారేది’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ నెక్స్ ్ట ఎన్టీఆర్‌తో కలిసి పని చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘రభస’ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉందట. రామ్‌చరణ్ అంటేనే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇటు దశరథ్ చూస్తే పక్కా క్లాస్ డెరైక్టర్. మరి వీరిద్దరి కలయికలో సినిమా అంటే సమ్‌థింగ్ డిఫరెంట్ అనుకోవాలి. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండిస్తాడనే పేరున్న దశరథ్ చెప్పిన కథ చరణ్‌కి బాగా నచ్చిందట. ఏవో కొన్ని మార్పులు సూచించారని సమాచారం. అన్నీ సెట్ అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ పట్టాలెక్కేస్తుందన్నమాట. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో కేరెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే హీరోలందరూ పూరితో కలిసి పనిచేయడానికి అమితాసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం నితిన్‌తో ‘హార్ట్ ఎటాక్’ చేస్తున్న పూరి, ఆ తర్వాత విష్ణుతో సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని పూరి కూడా ధ్రువీకరించారు. అయితే ఇది ‘అసెంబ్లీ రౌడీ’కి సీక్వెల్ అని బయట ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. -
అందుకే ‘బుడ్డోడు...’ డైలాగ్ రాశాను
‘‘నేను ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నానని తెలియగానే చాలామంది ‘బుడ్డోడితో సినిమా చేస్తున్నావట’ అంటూ మెసేజ్‌లు పంపించారు. బుడ్డోడు అని అభిమానంగా అన్నప్పటికీ, అదే పదంతో లెక్కలేనన్ని మెసేజ్‌లు రావడంతో అసహనానికి గురయ్యాను. ఆ అసహనం నుంచి పుట్టినదే ‘బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా..’ అనే డైలాగ్ వచ్చింది. అంతే తప్ప ఇది కావాలని ఎవర్నీ ఉద్దేశించి పెట్టింది కాదు’’ అన్నారు హరీష్‌శంకర్. ఎన్టీఆర్, సమంత జంటగా శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. హరీష్‌శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హరీష్‌శంకర్ పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘భీముడు పట్టాల్సిన గదను రాముడు పట్టాడు. ఎందుకు పట్టాడు? అనేది సినిమాలో చూడాల్సిందే. ఎన్టీఆర్‌ని యూత్‌ఫుల్‌గా చూపించాలనుకున్నాను. అందుకే ఇందులో ఆయనతో కాలేజ్ స్టూడెంట్ పాత్ర చేయించాను. అయితే కాలేజ్ సీన్స్ మాత్రం ఉండవు. లుక్పరంగా ఎన్టీఆర్ తగిన కేర్ తీసుకోవడంవల్ల చాలా బాగున్నారు. డాన్స్, ఫైట్స్, డైలాగ్స్.. దేన్నయినా సింగిల్ టేక్‌లో చేయగల సత్తా ఉన్న హీరో ఎన్టీఆర్. ఆయన సమంత కాంబినేషన్లో వచ్చే టీజింగ్ సీన్స్ చాలా అలరిస్తాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్ ఇలాంటి సన్నివేశాల్లో నటించలేదు. జనరల్‌గా నా సినిమా హీరోని నేను బాగా ఆరాధిస్తాను. తనని దృష్టిలో పెట్టుకునే సినిమా మొత్తం ప్లాన్ చేశాను. కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, ఈ చిత్రంలో సమంత, శ్రుతిహాసన్‌ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. సినిమాను కీలక మలుపు తిప్పే పాత్రలివి. తమన్ ఇచ్చిన పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమా కూడా ఘనవిజయం సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ సమయంలో సినిమా విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందనుకుంటున్నారు? అనే ప్రశ్నకు -‘‘నాకు రాష్ర్ట రాజకీయాల మీద అవగాహన లేదు. సినిమా పరిశ్రమలో ఉన్న 24 శాఖలను నమ్ముతాను. నిర్మాతకు చెప్పిన ప్రకారం సినిమాని తీయడం నా బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. మంచి ఎంటర్టైనర్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం’’ అని చెప్పారు హరీష్ శంకర్. -
ఎన్టీఆర్ అదుర్స్ సీక్వెల్ చేద్దామంటున్నాడు
ఈ తరంలో మాస్ సినిమాకు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు వీవీ వినాయక్. 11 ఏళ్లలో 12 సినిమాలు డెరైక్ట్ చేసిన వినాయక్ కెరీర్లో అత్యధిక శాతం విజయాలే ఉన్నాయి. వివాదాలకు దూరంగా... విజయాలకు సమీపంగా ఉండే వినాయక్ ప్రస్తుతం నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నారు. నేడు ఆయన పుట్టిన్రోజు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, ఇతర విషయాల గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘నాయక్’ సినిమా తర్వాత విరామం ఎక్కువ తీసుకున్నట్లున్నారు? అలా అని నేను అనుకోవడం లేదు. ‘నాయక్’ తర్వాత నేను ‘ఓకే’ చేసిన సినిమా బెల్లంకొండ సురేష్గారి అబ్బాయి సాయిగణేష్ది. ఒక కొత్త హీరోని పరిచయం చేసే బాధ్యత తలపై వేసుకున్నప్పుడు కథ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు అనుకున్న కొన్ని కథలు నాకంత తృప్తికరంగా అనిపించలేదు. సరైన కథ కుదిరాకే సెట్స్కెళ్లాలనేది నా అభిమతం. అలాంటి కథ కోసమే ఇన్నాళ్లూ ఆగాను. ఇప్పుడు నవరసాలు ఉన్న కథ కుదిరింది. ఈ నెలలోనే సెట్స్‌కి వెళుతున్నాం. *** సాయిగణేష్ని హీరోని చేయడానికి మీరు ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలేంటి? దర్శకత్వం నా వృత్తి. అయితే.. ఈ సినిమాకు పనిచేయడాన్ని వృత్తిగానే నేను భావించడం లేదు. ఇది నా బాధ్యత. బెల్లకొండ సురేష్ రుణం తీర్చుకోడానికి నాకు దొరికిన గొప్ప అవకాశం ఇది. తొలి సినిమాను ఏ దర్శకుడూ కంఫర్ట్‌గా ఫీలవ్వలేడు. కానీ నేను ఫీలయ్యాను. ఏ టెన్షన్ లేకుండా ఈజీగా ‘ఆది’ సినిమా చేయగలిగాను. దానికి కారణం బెల్లంకొండ సురేష్. ఈ రోజు ఆయన కారణంగా మా కుటుంబం హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆయన కొడుకుని హీరోని చేసే బాధ్యత నాపై పడింది. అందుకే ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. సాయి ఒక నిర్మాత కొడుకులా పెరగలేదు. హీరో అవ్వాలనే కసితో పెరిగాడు. అతనిలోని ఎనర్జీ స్థాయిని రేపు తెరపై చూస్తారు. యాక్షన్, లవ్, కామెడీ, మ్యూజిక్.. ఇలా అన్నీ మేళవించిన సినిమా ఇది. బాధ్యతాయుతమైన పాత్రను ఇందులో సాయి చేస్తున్నాడు. సమంత కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ నెలలోనే పాటతో షూటింగ్ మొదలు పెడతా. *** మాస్ సినిమాల దర్శకుడైన మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? చిన్నప్పట్నుంచీ యాక్షన్ సినిమాలు చూడ్డం ఇష్టం. దర్శకునిగా యాక్షన్ సినిమా తీయడం ఇష్టం. అలాగని యాక్షన్‌కే పరిమితం కాను. మణిరత్నం సినిమాలను కూడా ఇష్టపడతా. *** మరి మీ నుంచి అలాంటి సినిమాలు ఎందుకు రావు? ఇలాంటి సినిమాలే తీయాలని నేను దర్శకుణ్ణి కాలేదు. యాక్షన్ సినిమాలు కూడా నేను అనుకుని చేస్తున్నవి కాదు. నా జీవితంలో అన్నీ యాదృచ్ఛికంగా జరిగినవే. అయితే... నాక్కూడా ఒక మంచి ప్రేమకథ తీయాలని ఉంది. త్వరలో అంతా కొత్తవారితో ఓ ప్రేమకథ తీస్తా. *** భవిష్యత్తులో మీ నుంచి ప్రయోగాలు కూడా ఆశించొచ్చా? ప్రయోగాలంటే నాకు భయం. నాపై నమ్మకంతో కోట్ల రూపాయలు వెచ్చించే నిర్మాతల్ని ఇబ్బందుల్లో పెట్టలేను. *** మీలాంటి పెద్ద దర్శకుల నుంచి చిన్న సినిమాలు కూడా వస్తే బాగుంటుంది కదా? ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్లన్నీ నా సొంత ప్రొడక్షన్స్ లాంటివి. బెల్లకొండ సురేష్, దిల్‌రాజు, నల్లమలుపు బుజ్జి వీళ్ల సినిమాలతోనే సరిపోతుంది నాకు. ఇక చిన్న సినిమాలు తీయడానికి టైమ్ ఎక్కడిది? అయితే... ఈ మధ్య చెన్నయ్ వెళ్లినప్పుడు అక్కడ పోస్టర్లు చూస్తే... అన్నీ చిన్న సినిమాలే కనిపించాయి. కొత్తవారితో చిన్న సినిమాలు తీసే దర్శకులు అక్కడ చాలామంది ఉన్నారు. మా తరంలో మేం తీయలేకపోయినా... వచ్చే తరం కచ్చితంగా చిన్న సినిమాలకు పెద్ద పీట వేస్తుందని నా నమ్మకం. *** ఇతర భాషల్లో సినిమాలు ఎప్పుడు చేస్తారు? బాలీవుడ్లో చేసే అవకాశం వచ్చింది. బిజీ వల్ల చేయలేకపోయా. భవిష్యత్తులో చేస్తానేమో. *** వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసింది. నిజమేనా? పచ్చి అబద్దం. కొడాలి నాని మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ కారణంగా నేను కూడా రాజకీయాల్లోకి వెళతాననే టాక్ వచ్చింది. *** చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో చేశారు. మరి నాగార్జునతో ఎప్పుడు చేస్తారు? నాగార్జునగారితో ఎప్పుడో చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. నాకూ అందరు హీరోలతో చేయాలని ఉంది. త్వరలో చేస్తా. *** మళ్లీ తారక్‌తో సినిమా ఎప్పుడు? ఈ సినిమా అవ్వనీయండి. తర్వాత చెబుతా. *** మీ సినిమాల్లో సీక్వెల్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు? తారక్ ఆ మధ్య అన్నాడు ‘అదుర్స్’ సీక్వెల్స్ చేస్తే బాగుంటుందని. చూద్దాం! *** చిరంజీవి 150వ సినిమాకు మీరే దర్శకుడని టాక్. నిజమేనా? ఇప్పుడాయనకు సినిమా చేసే మూడ్ లేదు. *** మీరు సున్నిత మనస్కులట. సినిమా విషయంలో ఫలితం తేడాగా వస్తే ఫీలైపోతారట. నిజమేనా? అంత సున్నితంగా ఉండటం కరెక్ట్ కాదని మా నాన్న అంటూ ఉండేవారు. నా నైజం అది. *** కెరీర్లో ఎప్పుడైనా వెలితిగా ఫీలైన సందర్భాలున్నాయా? కలలో కూడా ఊహించనంత గొప్ప జీవితాన్ని నాకు దేవుడిచ్చాడు. ఇప్పుడున్న ఈ స్థితిని చూసి ఎప్పుడూ ఆనందిస్తుంటా. ఇక వెలితి ఎందుకుంటుంది? -
మా సెంటిమెంట్‌ని రామయ్య నిజం చేస్తాడు!
‘‘ఎన్టీఆర్ తాలూకు మాస్ ఎలిమెంట్స్, మా సంస్థ తాలూకు ఫ్యామిలీ ఎలిమెంట్స్, హరీష్‌శంకర్ తాలూకు యూత్ ఎలిమెంట్స్ వెరసి రామయ్యా వస్తావయ్యా’’ అన్నారు నిర్మాత దిల్ రాజు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ -‘‘11 నాకు బాగా అచ్చొచ్చిన సంఖ్య. అలాగే హరీష్‌శంకర్ ‘గబ్బర్‌సింగ్’ విడుదలైంది కూడా మే 11నే. అందుకే ‘రామయ్యా వస్తావయ్యా’ను కూడా ఈ నెల 11న విడుదల చేస్తున్నాం. మా సెంటిమెంట్‌ని నిజం చేస్తూ ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని నా నమ్మకం. కేవలం యాక్షన్ సన్నివేశాల కారణంగానే ఈ సినిమాకు సెన్సార్‌వారు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. 2013లో విడుదలైన టాప్ త్రీ సినిమాల్లో ఒకటిగా రామయ్య నిలుస్తాడు’’ అని చెప్పారు. హరీష్‌శంకర్ చెబుతూ -‘‘మాస్లో ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను డిజైన్ చేశాను. తారక్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. దర్శకుని మూడ్ బాగుండకపోతే... సినిమా సరిగ్గా రాదనే నమ్మే నిర్మాత దిల్ రాజు. అందుకే ఎలాంటి ఒత్తిడికీ లోను చేయకుండా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కసారి చూస్తే... మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది’’ అని తెలిపారు. -
రామయ్య... దసరాకి వస్తాడయ్య...
‘‘ఈ ఏడాది సంక్రాంతికి మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ని ప్రేక్షకులకు అందించాను. ఈ దసరాకి ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాన్ని అందించనున్నాను. ఇంకా ఈ ఏడాది రెండు పెద్ద పండగలున్నాయి. రైట్ రిలీజ్ కోసం చూసి, ఈ సంవత్సరమే ‘ఎవడు’ కూడా రిలీజ్ చేసేస్తా. ఒకే ఏడాది నలుగురు అగ్రహీరోల సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఘనత సొంతం చేసుకున్నాను. ఓ విధంగా 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ క్రెడిట్ దక్కింది నాకే అనుకుంటా’’ అని దిల్ రాజు అన్నారు. ఎన్టీఆర్ కథానాయకునిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడారు. ‘‘దసరా కానుకగా మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కొత్తబంగారు లోకం, బృందావనం. రెండూ మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం. ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోతో రెండో సారి సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ లుక్‌కి ప్రపంచ వ్యాప్తంగా స్పందన లభిస్తోంది. రవితేజకు ‘మిరపకాయ్’, పవన్‌కల్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’ లాంటి విజయాలనిచ్చిన హరీష్ తప్పకుండా ఎన్టీఆర్‌కి కూడా ఆ స్థాయి విజయాన్ని ఇస్తాడని నా నమ్మకం. ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ఎంటర్టైనర్ ఇది. ఈ వారంలో సెన్సార్ కూడా పూర్తవుతుంది. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని చెప్పారు. ‘‘క్లారిటీ ఉన్న నిర్మాత దిల్‌రాజు. మేకింగ్ అంటే ఏంటో పక్కన కూర్చోబెట్టి చూపించాడు తను. ఆయన సంస్థ విలువ పెంచేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ చాలా ఫ్రెష్‌గా ఉంటాడు. ఎన్ని అంచనాలైనా పెట్టుకొని రండి. అన్ని అంచనాలనూ అధిగమిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమా అనుకున్నప్పుడే బ్రహ్మానందంగారికి ఓ పాత్ర అనుకున్నాం. కానీ స్క్రీన్‌ప్లేలో కుదర్లేదు. అందుకే ఆయన్ను మిస్ అయ్యామనే బాధ ఉంది. అలాగే... అందరూ శ్రుతి హాసన్ లాయర్ అట కదా, డాక్టర్ అట కదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నాకు, తనకూ ఉన్న ర్యాపో కారణంగా.. నాపై గౌరవంతో ఓ ప్రత్యేక పాత్రలో నటించింది తను. అదేంటో రేపు తెరపై చూస్తారు’’ అన్నారు హరీష్‌శంకర్. ఇంకా రమేష్‌రెడ్డి, సతీష్ వేగేశ్న, బ్రహ్మ కడలి కూడా మాట్లాడారు. -
తారక్ ఇప్పుడు బాహుబలి
బరువు తగ్గి శరీరాన్ని శిల్పంగా మార్చుకోవడమంటే.. కఠోర శ్రమతో కూడుకున్న వ్యవహారం. అంత శ్రమనీ ఓర్చి బొద్దుగా ఉండే తారక్ కాస్తా... స్లిమ్‌గా మారి పరిశ్రమ మొత్తం విస్తుపోయేలా చేశారు. చాలామందికి ఈ విషయంలో ఆయన స్ఫూర్తిగా కూడా నిలిచారు. అయితే... తారక్ ఇప్పుడు ఊహకందని మరో ఫీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న తన బరువు కంటే... రెండు రెట్లు బరువును మోయగల బాహుబలశాలిగా మారారు తారక్. ఆయన ఇంత బలవంతునిగా మారడం వెనుక అకుంఠిత దీక్ష, పట్టుదల ఉన్నాయంటున్నారు తారక్ పర్సనల్ ఫిజికల్ ట్రైనర్స్ ఎంబర్, జాన్ షుమెట్. వీరిద్దరూ ఎనిమిది నెలల క్రితం తారక్ కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు. ఈ ఎనిమిది నెలల్లో శారీరకంగా తారక్‌లో ఎన్నో మార్పులొచ్చాయని, తన బరువు కంటే రెండు రెట్లు బరువును ఆయన అవలీలగా మోయగలరని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రస్తుతం తారక్ శరీరంలో కొవ్వు శాతం పూర్తిగా తగ్గిపోయిందని, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన సాధించిన ఘనత ఇదని ఎంబర్, జాన్ షుమెట్ తెలిపారు. ‘రామయ్యా వస్తావయ్యా’లో ఆరు పలకల దేహంతో తారక్ కనిపించనున్నారని సమాచారం. -
రారాజుగా తారక్?
రారాజు సుయోధన సార్వభౌముడు అనగానే... మన కళ్లల్లో తళుక్కున మెరిసే రూపం ‘ఎన్టీఆర్’. మూర్తీభవించిన రాజసంతో మదగజంపై రారాజుగా ఆ మహానటుడు వస్తోంటే... ప్రేక్షకులు పులకించిపోయారు. ‘ఆచార్యదేవా... ఏమంటివి ఏమంటివి...’ అంటూ ‘దానవీరశూర కర్ణ’లో అన్నగారు డైలాగులు చెబుతుంటే... వేదమంత్రాలు విన్నట్టు విన్నారు. తన అసమాన అభినయ కౌశలంతో దుర్యోధనుణ్ణి కూడా హీరోని చేసిన ఘనుడు ఎన్టీఆర్. రారాజుగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో నేటికీ స్థిరంగా నిలిచే ఉంది. అందుకే ఆ గెటప్‌లో కనిపించడానికి కూడా ఏ హీరో సాహసించడు. అప్పుడెప్పుడో ‘దేశోద్ధారకుడు’ సినిమాలో బాలకృష్ణ కాసేపు రారాజుగా కనిపించారు. అప్పుడు బాలయ్యలో కూడా ఎన్టీఆర్‌నే చూసుకున్నారు ప్రేక్షకులు. మళ్లీ ఇప్పుడు అలాంటి సాహసమే తారక్ చేస్తున్నాడని సమాచారం. ‘రామయ్యా వస్తావయ్యా’లో ఓ కీలక సన్నివేశంలో తారక్ రారాజుగా ఎన్టీఆర్ గెటప్‌లో కనిపిస్తారట. ‘యమదొంగ’లో అన్నగారి డైలాగు చెప్పి భేష్ అనిపించుకున్నాడు తారక్. మరి ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ గెటప్‌లోనే కనిపించబోతున్నాడు. ఆ సన్నివేశం మినహా ‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఆ ఎపిసోడ్‌ని చిత్రీకరించడానికి దర్శకుడు హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నారట. -
అమ్ములుగా శ్రుతిహాసన్
కొన్ని పాత్రలు నటీనటుల జీవి తాన్నే మార్చేస్తాయి. ‘గబ్బర్‌సింగ్’లో శ్రుతిహాసన్ పోషించిన భాగ్యలక్ష్మి పాత్ర లాగా. ఆ పాత్ర శ్రుతికి నిజంగానే భాగ్యాన్ని తెచ్చిపెట్టింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది ఈ ముద్దుగుమ్మకు. విరివిగా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా అవతరించారు శ్రుతి. ఇదిలావుంటే... ఎన్టీఆర్‌కి జోడీగా ఆమె నటించిన ‘రామయ్యా వస్తావయ్య’ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చాలా ఉద్వేగంతో ఉన్నారు శ్రుతి. కారణం ఆ సినిమాలో తను పోషించిన ‘అమ్ములు’ పాత్ర. జీవితాలను మలుపుతిప్పే పాత్రలు అరుదుగా మాత్రమే వస్తుంటాయి. నాకు వెంటవెంటనే వస్తున్నాయి. అంటూ ఇటీవల మీడియా ముందు ఆనందాన్ని వ్యక్తం చేశారు శ్రుతి. ‘‘‘గబ్బర్‌సింగ్’లోని భాగ్యలక్ష్మి పాత్రతో నేను తెలుగమ్మాయిని అయిపోయాను. ఇక్కడ అందరూ సొంత అమ్మాయిలా చూసుకుంటున్నారు. త్వరలో రాబోతున్న ‘రామయ్యా వస్తావయ్య’లో అంతకంటే గొప్ప పాత్ర చేశాను. ఇందులో నా పాత్ర పేరు ‘అమ్ములు’. అచ్చతెనుగు అమ్మాయి పాత్ర అన్నమాట. ‘గబ్బర్‌సింగ్’లో సెలైంట్‌గా కనిపించిన నేను, ఇందులో చలాకీగా మురిపిస్తా. ఈ సందర్భంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హరీష్శంకర్కే. రెండు మంచి పాత్రలిచ్చి నా కెరీర్‌నే మార్చేశారాయన’’ అన్నారు. -
ఒక్క రోజు వ్యవధిలో రెండు భారీ చిత్రాలు
విడుదల తేదీలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున తయారవుతోన్న ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాలు అక్టోబర్‌లో ఒక్క రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ‘అత్తారింటికి దారేది’అక్టోబర్ 9న విడుదల కాబోతుండగా, ‘రామయ్యా వస్తావయ్యా’ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జల్సా’ తర్వాత పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ పాటలు ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక పవన్‌కల్యాణ్ పాడిన ‘కాటమరాయుడా’ పాట యూట్యూబ్‌లో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిం చింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. సమంత, ప్రణీత ఇందులో కథానాయికలు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇక ‘రామయ్యా వస్తావయ్యా’ విషయానికొస్తే... ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీష్ శంకర్ చేస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్ ఇందులో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలూడదీసి కొడతా’ అనే టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పాటలు ఈ వారంలో విడుదల కానున్నాయి. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలు. ‘బృందావనం’తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఎన్టీఆర్, ఈ సినిమాతో యువతకు మరింత చేరువవుతారని నిర్మాత ‘దిల్’రాజు చెబుతున్నారు. -
రామయ్య స్పెషల్ ఎట్రాక్షన్
‘రామయ్యా వస్తావయ్యా’ టైటిల్లో సాఫ్ట్‌నెస్. ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగుల్లో రఫ్‌నెస్. కథాపరంగా ఎన్టీఆర్ యువజన నాయకుడని సమాచారం. లుక్ పరంగా మాత్రం చాక్లెట్‌బోయ్‌లా అనిపిస్తున్నాడు. భిన్నంగా గోచరిస్తున్న ఈ అంశాలన్నీ సినిమాపై ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు దర్శకుడు హరీష్‌శంకర్. నిర్మాత ‘దిల్’రాజు కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరో విషయం ఏంటంటే... ప్రేక్షకుల ఊహకందని ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో ఉందని సమాచారం. దాన్ని దర్శక, నిర్మాతలు గోప్యంగా ఉంచారని వినికిడి. ఇటీవలే ఎన్టీఆర్, హంసానందినిపై ఓ ఐటమ్ సాంగ్‌ని చిత్రీకరించారు. దీంతో ఒక సన్నివేశం మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేసి, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖ రామన్, రవిశంకర్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
స్పెయిన్‌లో రామయ్య డ్యూయెట్స్
కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ సినిమాలు చేయడం... ఏజీ ఇమేజీ పెరిగాక అప్పుడు మాస్ సినిమాలు చేయడం హీరోలకు పరిపాటి. కానీ ఎన్టీఆర్ అందుకు భిన్నం. కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి, బాలకృష్ణ చేసినంత మాస్ సినిమాలు చేసేశారాయన. ఇప్పుడేమో... రొమాంటిక్ యాంగిల్లో కనిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. స్లిమ్ అయ్యాక ఆయనలో వచ్చిన మార్పు ఇది. ‘బృందావనం’, త్వరలో రాబోతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ ఆ కోవకు చెందిన సినిమాలే. ఈ నెల 26న పాటల చిత్రీకరణకు ఈ చిత్రం యూనిట్ స్పెయిన్ వెళుతోంది. అక్కడ ఎన్టీఆర్-శ్రుతిహాసన్‌తో ఓ పాట, ఎన్టీఆర్-సమంతతో ఓ పాట చిత్రీకరించనున్నారు. ఈ రెండూ మంచి రొమాంటిక్ డ్యూయేట్లే కావడం విశేషం. యువతను ఉర్రూతలూగించేలా ఈ పాటలు ఉంటాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా లావిష్‌గా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, గతంలో ఎన్టీఆర్‌తో ఆయన నిర్మించిన ‘బృందావనం’ సినిమాను మించేలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకునిగా కనిపిస్తాడు. ఓ వైపు రొమాంటిగ్గా, మరోవైపు శక్తిమంతంగా ఆయన పాత్ర సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభినయిస్తున్న తీరును అభినందిస్తూ... దర్శకుడు హరీష్‌శంకర్ ట్విట్టర్లో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ‘‘నాట్యమైనా, నటనైనా, సంభాషణలు పలికే తీరైనా... ఏదైనా.. ఎన్టీఆర్‌కి కరతలామలకం. నిజానికి కెమెరా ముందు అతను పెట్టే ఎఫర్ తక్కువ. కానీ తెరపై మాత్రం అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దటీజ్ ఎన్టీఆర్’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీన్ని బట్టి... ఇందులో ఎన్టీఆర్ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే నెల 10కల్లా ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ వర్గాల భోగట్టా. -
కొరటాల శివ దర్శకత్వంలో...ఎన్టీఆర్
ఒక్క విజయం వస్తే వంద సినిమాలు చేసే అవకాశం వస్తుందో లేదో చెప్పలేం కానీ, కచ్చితంగా భారీ అవకాశాలు మాత్రం వస్తాయి. ప్రస్తుతం కొరటాల శివను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. రచయితగా ఆయన మంచి పేరు తెచ్చుకుని, ‘మిర్చి’తో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో శివ సీన్ మారిపోయింది. స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం వస్తోంది. వాటిలో రామ్‌చరణ్ పేరు ముందు వినిపించినా, ఇప్పుడా ప్రాజెక్ట్ లేదని వినికిడి. మహేష్‌బాబు హీరోగా వచ్చే ఏడాది శివ ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తారట. ఈలోపు ఎన్టీఆర్ హీరోగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇటీవలే ఎన్టీఆర్‌ని శివ కలిశారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వినిపిస్తోంది. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రారంభమవుతుందట. డీవీవీ దానయ్య నిర్మిస్తారని వినికిడి. -
రామయ్య రెడీ అవుతున్నాడు
ఎన్టీఆర్... భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరో. హరీష్‌శంకర్.... తన సృజనతో మాస్‌ని మెస్మరైజ్ చేయగల దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే.... అభిమానులకు పండుగ కాక మరేంటి! వీరి కలయికలో రూపొందుతోన్న ‘రామయ్యా... వస్తావయ్యా’ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత ‘దిల్’రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు తొంభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందీ సినిమా. వచ్చేవారం నుంచి మొదలయ్యే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమాలోని ఎన్టీఆర్ పాత్రను దర్శకుడు చాలా శక్తిమంతంగా తీర్చిద్దుతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. మాస్ ప్రజానీకంతో పాటు, యువతరం ప్రేక్షకులు కూడా మెచ్చేలా ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగులు ప్రతి నోటా మారుమోగుతున్నాయి. ముఖ్యంగా... ‘బుడ్డోడు బుడ్డోడు అంటే...’ డైలాగ్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోందని సమాచారం. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి నిర్మాత ‘దిల్’రాజు సన్నా హాలు చేస్తున్నారు. ఇదిలావుంటే... సంతోష్ శ్రీనివాస్ ‘రభస’ చిత్రంలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. మరో వార్త ఏంటంటే... ‘మిర్చి’ఫేం కొరటాల శివ ఇటీవలే ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్పారట. ఎన్టీఆర్‌కి కూడా ఈ కథ బాగా నచ్చడంతో... బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కొరటాలను ఎన్టీఆర్ పురమాయించి నట్లు ఫిలింనగర్ సమాచారం.