రామయ్య స్పెషల్ ఎట్రాక్షన్ | Junior NTR to cast as youth leader in "Ramaiah vastavayya" | Sakshi
Sakshi News home page

రామయ్య స్పెషల్ ఎట్రాక్షన్

Published Tue, Sep 17 2013 12:50 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

రామయ్య స్పెషల్ ఎట్రాక్షన్ - Sakshi

రామయ్య స్పెషల్ ఎట్రాక్షన్

 ‘రామయ్యా వస్తావయ్యా’ టైటిల్‌లో సాఫ్ట్‌నెస్. ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగుల్లో రఫ్‌నెస్. కథాపరంగా ఎన్టీఆర్ యువజన నాయకుడని సమాచారం. లుక్ పరంగా మాత్రం చాక్లెట్‌బోయ్‌లా అనిపిస్తున్నాడు. భిన్నంగా గోచరిస్తున్న ఈ అంశాలన్నీ సినిమాపై ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు దర్శకుడు హరీష్‌శంకర్. నిర్మాత ‘దిల్’రాజు కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరో విషయం ఏంటంటే... ప్రేక్షకుల ఊహకందని ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో ఉందని సమాచారం. దాన్ని దర్శక, నిర్మాతలు గోప్యంగా ఉంచారని వినికిడి. ఇటీవలే ఎన్టీఆర్, హంసానందినిపై ఓ ఐటమ్ సాంగ్‌ని చిత్రీకరించారు.
 
 దీంతో ఒక సన్నివేశం మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేసి, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖ రామన్, రవిశంకర్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement