మా సెంటిమెంట్‌ని రామయ్య నిజం చేస్తాడు!
మా సెంటిమెంట్‌ని రామయ్య నిజం చేస్తాడు!
Published Wed, Oct 9 2013 12:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
‘‘ఎన్టీఆర్ తాలూకు మాస్ ఎలిమెంట్స్, మా సంస్థ తాలూకు ఫ్యామిలీ ఎలిమెంట్స్, హరీష్‌శంకర్ తాలూకు యూత్ ఎలిమెంట్స్ వెరసి రామయ్యా వస్తావయ్యా’’ అన్నారు నిర్మాత దిల్ రాజు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ -‘‘11 నాకు బాగా అచ్చొచ్చిన సంఖ్య.
అలాగే హరీష్‌శంకర్ ‘గబ్బర్‌సింగ్’ విడుదలైంది కూడా మే 11నే. అందుకే ‘రామయ్యా వస్తావయ్యా’ను కూడా ఈ నెల 11న విడుదల చేస్తున్నాం. మా సెంటిమెంట్‌ని నిజం చేస్తూ ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని నా నమ్మకం. కేవలం యాక్షన్ సన్నివేశాల కారణంగానే ఈ సినిమాకు సెన్సార్‌వారు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. 2013లో విడుదలైన టాప్ త్రీ సినిమాల్లో ఒకటిగా రామయ్య నిలుస్తాడు’’ అని చెప్పారు.
హరీష్‌శంకర్ చెబుతూ -‘‘మాస్‌లో ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను డిజైన్ చేశాను. తారక్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. దర్శకుని మూడ్ బాగుండకపోతే... సినిమా సరిగ్గా రాదనే నమ్మే నిర్మాత దిల్ రాజు. అందుకే ఎలాంటి ఒత్తిడికీ లోను చేయకుండా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కసారి చూస్తే... మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది’’ అని తెలిపారు.
Advertisement
Advertisement