కథా కేళి కొత్త ప్రయత్నంలా ఉంది – ‘దిల్‌’ రాజు  | Katha Keli, Movie Teaser, Release, | Sakshi
Sakshi News home page

కథా కేళి కొత్త ప్రయత్నంలా ఉంది – ‘దిల్‌’ రాజు 

Published Tue, Aug 8 2023 12:24 AM | Last Updated on Tue, Aug 8 2023 12:24 AM

Katha Keli, Movie Teaser, Release, - Sakshi

హరీష్‌ శంకర్, ‘దిల్‌’ రాజు, సతీష్‌ వేగేశ్న

‘‘సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించిన ‘శతమానం భవతి’ సినిమా మా బ్యానర్‌కి జాతీయ అవార్డును తీసుకొచ్చింది. ఇప్పుడు శతమానం భవతి ఆర్ట్స్‌ పేరుతో సతీశ్‌ బ్యానర్‌ పెట్టడం సంతోషంగా ఉంది. ‘కథా కేళి’ టీజర్‌ చూస్తుంటే సతీశ్‌ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. యశ్విన్, దినేశ్‌ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితపొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్‌ కీలక పా త్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథా కేళి’.

చింతా గోపా ల కృష్ణారెడ్డి సమర్పణలో సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొం దుతోన్న ఈ సినిమా లోగోను ‘దిల్‌’ రాజు విడుదల చేయగా, టీజర్‌ను డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ రిలీజ్‌ చేశారు. సతీశ్‌ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పా తికేళ్లు అయ్యింది. ‘ప్రియా ఓ ప్రియా’ చిత్రంలో నా పేరుని మొదటిసారి స్క్రీన్‌ పై చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు రైటర్‌గా, డైరెక్టర్‌గా నిలబడ్డాను. ఈవీవీ సత్యనారాయణగారి మాటల స్ఫూర్తితోనే ఈ బ్యానర్‌ పెట్టాను. నేను స్టార్ట్‌ చేసిన ‘కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమాలు ఆలస్యం అవుతుండటంతో ఈ గ్యాప్‌లో ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా చేద్దామని ‘కథా కేళి’ తీశా’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement