Shatamanam Bhavati
-
‘శతమానం భవతి’ సీక్వెల్ వచ్చేస్తోంది!
శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన చిత్రం ‘శతమానం భవతి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2017 సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘శతమానం భవతి నెక్ట్స్ పేజి’ నిర్మించనున్నట్లు ప్రకటించారు ‘దిల్’ రాజు. ‘‘చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ‘శతమానం భవతి’ మా బ్యానర్‌కి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును దక్కించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్పతనాన్ని చాటింది. మా బ్యానర్ విలువలకు తగ్గట్లు ‘శతమానం భవతి నెక్ట్స్ పేజి’ని ఘనంగా రూపొందించనున్నాం. 2025 సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. 7 years ago, #ShathamanamBhavathi Celebrated Sankranthi with its timeless magic ❤️ Now, get ready for another chapter unfolding with even more enchantment in 2025! 😍 More Details loading soon 😉 వచ్చే సంక్రాంతికి కలుద్దాం ❤️🔥 pic.twitter.com/yJT5xump4Q — Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2024 -
కథా కేళి కొత్త ప్రయత్నంలా ఉంది – ‘దిల్’ రాజు
‘‘సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ‘శతమానం భవతి’ సినిమా మా బ్యానర్‌కి జాతీయ అవార్డును తీసుకొచ్చింది. ఇప్పుడు శతమానం భవతి ఆర్ట్స్ పేరుతో సతీశ్ బ్యానర్ పెట్టడం సంతోషంగా ఉంది. ‘కథా కేళి’ టీజర్ చూస్తుంటే సతీశ్ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితపొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ కీలక పా త్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథా కేళి’. చింతా గోపా ల కృష్ణారెడ్డి సమర్పణలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొం దుతోన్న ఈ సినిమా లోగోను ‘దిల్’ రాజు విడుదల చేయగా, టీజర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పా తికేళ్లు అయ్యింది. ‘ప్రియా ఓ ప్రియా’ చిత్రంలో నా పేరుని మొదటిసారి స్క్రీన్ పై చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు రైటర్‌గా, డైరెక్టర్‌గా నిలబడ్డాను. ఈవీవీ సత్యనారాయణగారి మాటల స్ఫూర్తితోనే ఈ బ్యానర్ పెట్టాను. నేను స్టార్ట్ చేసిన ‘కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమాలు ఆలస్యం అవుతుండటంతో ఈ గ్యాప్‌లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని ‘కథా కేళి’ తీశా’’ అన్నారు. -
28లో 22 హిట్... గ్రేట్ గ్రాఫ్
‘‘ఒక ప్రాజెక్ట్ ప్రాఫిట్లో ఉంటేనే నా దృష్టిలో అది సక్సెస్ఫుల్ సినిమా. ఎందుకంటే ఇది వ్యాపారం. డబ్బు పోగొట్టుకుని సినిమాలు తీయడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. డబ్బు పోతే ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు. అల్టిమేట్‌గా డబ్బు కావాల్సిందే. సినిమా తీయడానికి ఎంత? కరెక్ట్ కలెక్షన్ ఎంత? ఈ రెండే ‘దిల్’ రాజుగా నాకు అవసరం. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా నాది డబుల్ రోల్. నిర్మాతగా నా డిస్ట్రిబ్యూటర్స్ను కాపాడుకోవడానికే ట్రై చేస్తాను. సినిమా తీస్తున్నప్పుడు కథ ఎంత ముఖ్యమో, బడ్జెట్ కూడా అంతే ముఖ్యం’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆయన సక్సెస్ఫుల్ నిర్మాతగా పాతిక పైగా సినిమాలు తీశారు. ఈ ఏడాది ‘శతమానం భవతి’కి నేషనల్ అవార్డు కూడా సాధించారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ‘దిల్’ రాజు మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నిర్మాతగా పద్నాలుగేళ్ల కెరీర్లో 28 సినిమాలు చేశా. డిస్ట్రిబ్యూటర్‌గా 22 ఏళ్ల కెరీర్. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నేను ప్రొడ్యూస్ చేసిన 28 సినిమాల్లో 22 చిత్రాలు సక్సెస్ టాక్ తెచ్చుకోవడం గ్రేట్ గ్రాఫ్. హ్యాపీగా ఉంది. ఈ ఏడాది ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యాను కానీ డిస్ట్రిబ్యూటర్‌గా బ్యాడ్ ఇయర్. శ్రీ వెంకటేశ్యర క్రియేషన్స్‌ను 1999లో స్టార్ట్ చేశాం. డిస్ట్రిబ్యూటర్‌గా ఇంతటి బ్యాడ్ ఇయర్ ఇప్పటివరకు చూడలేదు. సినిమా హిట్ అయితే సక్సెస్‌ను తీసుకున్నప్పుడు, బ్యాడ్ రిజల్ట్ వచ్చినప్పుడు వేరే వారిని కారణంగా చూపను. ఫెయిల్యూర్‌ను కూడా తీసుకుంటాను. అయితే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని విశ్లేషించుకుంటా. ఈ ఏడాది ‘శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్’ తర్వాత వస్తున్న సిక్త్ బాల్ ‘ఎంసీఏ’ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ► ఒక సినిమా కలెక్షన్ స్టామినా ఏంటో తెలియాలంటే వన్ వీక్ పడుతుంది. బాలీవుడ్లో ఉన్నట్లు ఏ సినిమాకైనా గ్రాస్ కలెక్షన్ చెప్పాలి. హైర్లు, షేర్ గ్యారెంటీలు కలుపుకుని ఫస్డ్ డే కలెక్షన్ ఫిగర్స్ చెప్పుకోకూడదు. వీటి వల్ల అంతగా ఉపయోగం లేదు. ఈ మార్పు ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటున్నాను. ► సినిమా డిజిటల్ రైట్స్‌ను అమ్మడానికి టైమ్ లిమిట్ సెట్ చేయాలనుకుంటున్న కొందరి నిర్మాతల నిర్ణయం సరైనదే. కానీ సినిమా రిలీజైన రోజునే పైరసీ వస్తోంది. అలా కాకుండా ఆడియన్స్ డిజిటల్ ప్లాట్ఫామ్లో సినిమాను కొనుక్కుని చూడటంలో తప్పులేదనిపిస్తోంది. పైరసీ రూపంలో సినిమాను అన్ అఫీషియల్‌గా చూస్తున్నారు. కాంట్రవర్సీ చేయడం కాదు. నిర్మాతగా డిజిటల్ రైట్స్‌ను అమ్మడం ఆపుదామని కాదు. మేజర్ డ్యామేజ్ జరిగేది పైరసీ వల్లే అన్నది నా అభిప్రాయం. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కలసికట్టుగా ఫైట్ చేసి పైరసీ భూతాన్ని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలి. ► ఇండస్ట్రీకి వచ్చే కొత్త నిర్మాతలు సక్సెస్ అయిన సినిమాలను కాదు.. ఫెయిల్ అయిన సినిమాలు తీసుకుని విశ్లేషించుకోవాలి. ఆడని సినిమాల లిస్ట్ తీసుకుని ఎందుకు ఆడలేదని చెక్ చేసుకుంటే బెటర్. కొంత వరకు డబ్బు సేవ్ అవుతుంది. ► వచ్చే ఏడాది మా బ్యానర్ నుంచి ఇద్దరు కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. కొత్త డైరెక్టర్ శశి ‘అదే నువ్వు అదే నేను’ చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో శర్వానంద్, నితిన్ హీరోలుగా ‘దాగుడు మూతలు’ సినిమా నిర్మించబోతున్నా. అనుకోని కారణాల వల్ల కమల్‌హాసన్‌గారు, శంకర్ల కాంబినేషన్ ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. ► మహేశ్‌బాబుకి నిర్మాత అశ్వినీదత్‌గారితో కమిట్మెంట్ ఉంది. డైరెక్టర్ వంశీతో నాకు కమిట్మెంట్ ఉంది. అలా అశ్వినీదత్‌గారు, నేను కలసి ఈ సినిమా నిర్మించబోతున్నాం. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లొచ్చు. పవన్ కల్యాణ్‌తో సినిమా అంటే.. చేయాలని నాకూ ఉంది. టైమ్, కథ కుదిరితే సెట్స్‌పైకి వెళతాం. ► నితిన్ హీరోగా మేం చేయబోతున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాకి అడిగితే, హీరోయిన్ సాయిపల్లవి రిజెక్ట్ చేసిందన్న వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. అసలు సాయి పల్లవికి ఈ సినిమా కథ కూడా తెలియదు. అంతేకాదు సాయి పల్లవి షూటింగ్ స్పాట్‌కు లేట్‌గా వస్తుందన్న రూమర్లు వచ్చాయి. ‘ఫిదా’ చూశాను. ‘ఎంసీ ఏ’ చుశాను. తను కరెక్ట్‌గా ఉంటుంది. నా బ్యానర్లో మరో సినిమా చేయబోతోంది. బిజీగా ఉండి కూడా సాయిపల్లవి ‘ఎంసీఏ’ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేసింది. నిర్మాతగా ఇన్ని సినిమాలు చేస్తున్నారు. డైరెక్షన్ చేసే ఉద్దేశం ఉందా? అన్న ప్రశ్నకు – ‘నో యాక్టింగ్.. నో డైరెక్షన్’ అన్నారు. ఒకే డేట్లో రెండు సినిమాలను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ వేరే డేట్ లేనప్పుడు, హాలీడేస్ వచ్చి కుదరనప్పుడు తప్పని పరిస్థితి ఇది. ఆల్టర్నేట్ డేట్స్‌పై అందరికీ ప్రాబ్లమ్ ఉంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ రేట్స్ వల్ల మార్చి ఫస్ట్ నుంచి థియేటర్ల మూసివేత అన్న విషయం పూర్తి స్థాయిలో నా వరకు రాలేదు. ఒకవేళ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కువ వసూలు చేస్తే మార్చి ఫస్ట్ నుంచి ఎలా ఉండబోతుందన్న విషయం నిర్మాతలందరూ కలసి మీటింగ్స్‌లో తేలుస్తారు. -
శతమానం...చిత్రబృందానికి సన్మానం
-
‘జోక్ చేశారనుకున్నా, అసలు ఊహించలేదు’
చెన్నై : ‘శతమానం భవతి’ జాతీయస్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపిక కావడంపై ఆ చిత్ర దర్శకుడు సతీష్ వేగ్నేశ సంతోషం వ్యక్తం చేశారు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగ్నేశమాట్లాడుతూ... ’ఇది నాకు ప్లజెంట్ సర్ఫ్రైజ్. శతమానం భవతి చిత్రానికి అవార్డు వచ్చినట్లు మా ప్రొడక్షన్ టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే వాళ్లు జోక్ చేశారనుకున్నారు. ఈ సినిమాకు అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ఇది నిజంగా సర్ఫ్రైజే. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్ చెప్పాలి’. అని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'శతమానం భవతి' బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన తారాగణంగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. -
ఆ బాధలోంచి పుట్టుకొచ్చిన కథ ఇది!
‘‘శతమానం భవతి’ కథను తొలుత సాయిధరమ్ తేజ్, రాజ్ తరుణ్‌కి వినిపించాం. వాళ్లకు నచ్చింది. వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కథాంశం కావడంతో ఎలాగైనా పండగకి విడుదల చేయాలనుకున్నాం. ఈ పాత్రకు శర్వానంద్ సరిపోతాడనిపించి, కథ వినిపించాం. తనకు కథ నచ్చి, అంగీకరించారు’’ అన్నారు దర్శకుడు సతీష్ వేగేశ్న. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘శతమానం భవతి’ ఈ సంక్రాంతికి విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పలు విశేషాలు పంచుకున్నారు. ♦ పదిహేడేళ్ల కింద ఉద్యోగ రీత్యా సంక్రాంతి పండుగ అప్పుడు మా అమ్మానాన్నలను మిస్ అయ్యాను. చాలా బాధ అనిపించింది. అప్పుడు ‘పల్లె పయనమెటు’ అని ఓ షార్ట్ స్టోరీ రాశా. ‘కబడ్డీ కబడ్డీ’ క్లయిమాక్స్ టైమ్‌లో జగపతిబాబుగారికి చెబితే నేను ప్రొడ్యూస్ చేస్తా, షార్ట్ ఫిలిం తీద్దామన్నారు. ఆ స్టోరీతో ఫీచర్ ఫిల్మ్ తీయొచ్చు కదా అన్న నా మిత్రుల సలహా మేరకు ‘దిల్’ రాజుగారిని కలిసి, స్టోరీ లైన్ వినిపించా. డెవలప్ చేయమన్నారు. ఏడాదిన్నర టైమ్ తీసుకుని ‘శతమానం భవతి’ కథ తయారు చేశా. ♦ రచయితగా, దర్శకుడిగా నాపై ఈవీవీ సత్యనారాయణగారి ప్రభావం ఉంది. సినిమాను సినిమాగానే చూడాలి. చిన్నదా? పెద్దదా? అనే తేడా ఉండకూడదని చెప్పేవారాయన. స్క్రిప్ట్ రెండు మూడు సార్లు చదివి, కరెక్షన్స్ ఫైనల్ చేశాకే షూటింగ్ మొదలు పెట్టేవారు. అందుకే ఈవీవీగారు త్వరగా షూటింగ్ పూర్తి చేసేవారు. ♦ దర్శకుడిగా నా మొదటి సినిమా ‘దొంగలబండి’ హిట్ కాలేదు. కథ మనకు నచ్చేలా కాదు.. ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని ఆ ఓటమి నాకు పాఠం నేర్పింది. రచయితగా నలభై సినిమాలకు పని చేసిన నాకు డైరెక్టర్‌గా ‘లైఫ్ అండ్ డెత్’ అనుకుని ‘శతమానం భవతి’ చేశా. మా నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయకుండా ఆదరించారు. ♦ ‘శతమానం భవతి’ కథ కొత్తది కాకున్నా, సన్నివేశాలు కొత్తగా అనిపిస్తున్నాయి. మా చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఇది నా కథ అని ఎక్కడో ఒక చోట ఫీలయ్యారు. మా చిత్రం బాగుందని దర్శకులు కె.విశ్వనాథ్, దాసరి, రాఘవేంద్ర రావుగార్లు అభినందించడం మరచిపోలేను. ఈ విజయం నా బాధ్యత మరింత పెంచింది. ♦ తరాలు మారినా ఎమోషన్స్ మారవు. కమర్షియల్ సినిమాకు కథ త్వరగా రాయొచ్చు. కానీ, ఎమోషన్స్‌తో కూడిన కథ రాయడానికి టైమ్ పడుతుంది. ♦ నా తర్వాతి ప్రాజెక్ట్ ‘దిల్’ రాజుగారి బ్యానర్లోనే ఉంటుంది. త్వరలో పూర్తి వివరాలు చెబుతాం. -
మేకింగ్ ఆఫ్ మూవీ - శతమానం భవతి
-
సంక్రాంతి సినిమా సక్సెస్ మీట్‌కు మెగాస్టార్
రీ ఎంట్రీలో సూపర్ హిట్‌తో అలరించిన మెగాస్టార్ చిరంజీవి, వీలైనంత వరకు అభిమానులకు కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా వేడుకల్లో సందడి చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్స్‌తో పాటు ఇతర హీరోల సినీ వేడుకల్లో కూడా మెగాస్టార్ తరుచుగా కనిపిస్తున్నాడు. తాజాగా ఓ యంగ్ హీరో సినిమా సక్సెస్మీట్కు చిరు, చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ మారింది. తన రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ సమయంలోనే విడుదలయిన శతమానం భవతి సినిమా సక్సెస్‌మీట్‌లో చిరంజీవి పాల్గొననున్నారు. ఇలా మెగాస్టార్ చిన్న సినిమాల ఫంక్షన్స్‌కు హాజరు కావటం ఆ సినిమాలతో పాటు మెగాస్టార్ ఇమేజ్‌కు కూడా ప్లస్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. -
అనుబంధం భవతి
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు తీసే బేనర్... స్టోరీ సెలక్షన్లో బెస్ట్ అనిపించుకున్న హీరో... ఫొటోలు చూస్తే.. తెరనిండా సీనియర్ ఆర్టిస్టులు... ఇవన్నీ ‘శతమానం భవతి’పై అంచనాలు క్రియేట్ చేశాయి. గత ఏడాది సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ హిట్‌తో పండగ చేసుకున్న శర్వానంద్ ఈసారి కూడా వెనక్కి తగ్గలేదు. మెగా 150 ఫిల్మ్.. నటసింహం నూరో సినిమా మధ్య వచ్చాడు. కథేంటి?: ఆత్రేయపురంలోని పెద్దమనిషి రాఘవరాజు (ప్రకాశ్‌రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతుల ఇద్దరు కుమారులు, కుమార్తె విదేశాల్లో స్థిరపడ్డారు. రాఘవరాజు తమ్ముడి కుమారుడు బంగార్రాజు (సీనియర్ నరేశ్). బంగార్రాజు కుమారుడు రాజు (శర్వానంద్). రాఘవరాజు, జానకమ్మ దంపతులకు బంగార్రాజు కుటుంబం నోట్లో నాలుకలా ఉంటారు. సంక్రాంతి పండక్కి పిల్లాపాపలతో తమ పిల్లలు ఊరు వస్తారని జానకమ్మ ఎదురుచూపులతో ఏళ్లకు ఏళ్లు గడుస్తుంటాయి. పరాయి గడ్డ మీద ఉన్న పిల్లలకు సొంత ఊరికి వచ్చే తీరిక ఉండదు. భార్యామణి బాధ చూడలేక రాఘవరాజు ఓ పథకం వేస్తాడు. సంక్రాంతికి కొన్ని రోజుల ముందే íపిల్లలను రప్పిస్తాడు. వరసకు బావ అయ్యే రాజుతో రాఘవరాజు మనవరాలు నిత్య (అనుపమా పరమేశ్వరన్) ప్రేమలో పడుతుంది. రాజుకీ నిత్య అంటే ఇష్టమే. ఇంతలో రాఘవరాజు వేసిన పథకం జానకమ్మకి తెలిసి గొడవ జరుగుతుంది. రాజు, నిత్యల ప్రేమకథ రాఘవరాజు కుమార్తెకి తెలిసి మేనల్లుణ్ణి హెచ్చరిస్తుంది. ఇంట్లో గొడవల్నీ, తన ప్రేమకథలో సమస్యల్నీ రాజు ఏ విధంగా పరిష్కరించాడనేది మిగతా కథ. విశ్లేషణ: క్లుప్తంగా చెప్పాలంటే... ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి, సహజంగానే ఇతర కుటుంబ కథాచిత్రాల పోలికలు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే దర్శకుడు ఎక్కువ సమయం వృథా చేయకుండా ప్రారంభంలోనే కథలోకి, నేరుగా తాను చెప్పాలనుకున్న పాయింట్లోకి వెళ్లాడు. ఊహించదగ్గ కథ చుట్టూ మంచి సన్నివేశాలు అల్లుకోవడంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ప్రకాశ్‌రాజ్, జయసుధలు తాము తప్ప మరొకరు ఆ పాత్రల్లో నటించలేరు అన్నట్టుగా సన్నివేశాలను రక్తి కట్టించారు. ప్రకాశ్‌రాజ్–జయసుధల డామినేషన్ ఉన్నప్పటికీ కథకు ప్రాధాన్యం ఇచ్చి, శర్వానంద్ ఈ సినిమా ఒప్పుకున్న విషయం అర్థమవుతుంది. మరదలి మీద ఉన్న ప్రేమను అత్త కోసం చంపుకునే సన్నివేశాల్లో శర్వా హావభావాలు, డైలాగులు పలికిన తీరు బాగుంది. శర్వా, అనుపమల జోడీ బాగుంది. కంగారుపడే బంగార్రాజు అలియాస్ కంగార్రాజు పాత్రలో నరేశ్ నటన అద్భుతం. ‘దిల్’ రాజు నిర్మాణ విలువలు, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. మిక్కి జె.మేయర్ బాణీలు హాయిగా సాగాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ‘శతమానం భవతి...’ పాటలో సాహిత్య విలువలు అనుబంధాలను మరోసారి గుర్తుచేస్తాయి. ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. సెకండాఫ్ మధ్యలో అంత్యాక్షరి తరహాలో సాగిన డబ్ స్మాష్ సన్నివేశాలు కథని సాగించడానికి ఉపయోగపడ్డాయి. మిగతా భాగమంతా సున్నితమైన భావోద్వేగాలతో సాగుతుంది. ఇక, పతాక సన్నివేశం పిల్లలకు దూరంగా సొంతూళ్లల్లో నివసిస్తున్న తల్లిదండ్రుల భావాల్ని తెరపై చూపింది. మొత్తంగా ‘దిల్’ రాజు మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ ‘శతమానం భవతి’. డబ్బు సంపాదనలో పడి, తల్లిదండ్రుల ఆప్యాయతానురాగాలను మిస్ అవుతున్న పిల్లలకు ఈ సినిమా ఓ మంచి మెసేజ్. చిత్రం ‘శతమానం భవతి’ తారాగణం శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాశ్‌రాజ్, జయసుధ, సీనియర్ నరేశ్... ఛాయాగ్రహణం సమీర్‌రెడ్డి, సంగీతం మిక్కి జె.మేయర్, నిర్మాత: ‘దిల్’ రాజు, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం వేగేశ్న సతీష్ -
శర్వా ధైర్యాన్ని అభినందించిన కింగ్
ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ల్యాండ్ మార్క్ సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో తన సినిమా శతమానంభవతిని రిలీజ్ చేస్తున్న శర్వానంద్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోల సినిమాలతో పోటి పడటం సామాన్యమైన విషయం కాదు. థియేటర్లు దొరకటమే కష్టమనుకునే సమయంలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న శర్వానంద్ సినిమా శతమానంభవతి, సక్సెస్ సాధించాలని శుభాకాంక్షలు తెలిజేశాడు కింగ్ నాగార్జున. ఇప్పటికే రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలకు కూడా తన శుభాకాంక్షలు తెలిపిన నాగ్, తాజాగా ఇంతటి భారీ కాంపిటీషన్లో శతమానం భవతి సినిమాను రిలీజ్ చేస్తున్న శర్వానంద్ ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. గత ఏడాది సొగ్గాడే చిన్ని నాయనా, డిక్టేటర్ సినిమాలతో పోటి పడ్డ శర్వానంద్ సక్సెస్ సాధించాడు. ఈ ఏడాది కూడా అదే ఫీట్ రిపీట్ చేయాలని ఆశిస్తున్నాని ట్వీట్ చేశాడు. #sharwanand,Guts&glory work 2gether!Releasing yr film wt the biggies needs guts/U did it last yr successfully/wishing u the glory this yr 2👍 — Nagarjuna Akkineni (@iamnagarjuna) 13 January 2017 -
సంక్రాంతి సినిమాలో మహేష్, బన్నీ, ఎన్టీఆర్.?
టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. అది కూడా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే రికార్డుల మోత మొగిపోవాల్సిందే. అలాంటి అరుదైన సంఘటన ఈ సంక్రాంతి ఒరిలో కనిపించనుందట. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఈ ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో శర్వానంద్ ,అనుపమా పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శతమానంభవతి. చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలు బరిలో ఉన్న సంక్రాంతి సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇంత భారీ పోటిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి కారణం టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించటమే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో మహేష్, బన్నీ, ఎన్టీఆర్‌లు స్వయంగా నటించలేదట. వాళ్లు నటించిన ఇతర చిత్రాల్లోని సీన్స్‌ను ఈ సినిమాకు తగ్గట్టుగా ఎడిట్ చేసి వాడుతున్నారట. అయితే ప్రేక్షకులకు మాత్రం సినిమాలో ఆ హీరోలు స్వయంగా నటించారన్న భావన కలిగేలా ఆ సీన్స్ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఇంత భారీ పోటిలో సినిమాను రిలీజ్ చేయడానికి ఆ సీన్స్ కూడా కారణంగా చెపుతున్నారు. మరి ఈ ఎడిటింగ్ మ్యాజిక్ శతమానంభవతి ఎంత వరకు కాపాడుతుందో చూడాలి. -
శతమానం భవతి ట్రైలర్ విడుదల
-
తాతా మనవళ్ల కథలో...
శర్వానంద్... హీరోగా ఎప్పటికప్పుడు వైవిధ్యం కోసం పరితపించే నటుడీయన. మళ్లీ మళ్లీ ఇటువంటి మంచి కథ, పాత్ర వస్తుందో? రాదో? అని 30ఏళ్ల వయసులోనే ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’లో తండ్రి పాత్రలో పరిణితితో కూడిన నటన ప్రదర్శించేశారు. వెంటనే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అంటూ తనలో వేగం చూపించారు. ఎలాంటి పాత్రలోనైనా సూట్ వేసుకున్నంత ఈజీగా సూటయ్యే ఈ నటుడు ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో పోలీస్‌గా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఆ తర్వాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రం చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘తాతా మనవళ్ల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలను ఆవిష్కరించే చిత్రమిది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించిన ‘బొమ్మరిల్లు’ మా సంస్థకు ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో.. ఈ ‘శతమానం భవతి’ అంతటి పేరు తీసుకొస్తుందని నమ్మకముంది’’ అన్నారు. ‘బొమ్మరిల్లు’ (ఆగస్టు 9, 2006) విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ‘శతమానం భవతి’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: మధు, కెమేరా: సమీర్ రెడ్డి, మ్యూజిక్: మిక్కీ జె.మేయర్.