సంక్రాంతి సినిమాలో మహేష్, బన్నీ, ఎన్టీఆర్.?
టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. అది కూడా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే రికార్డుల మోత మొగిపోవాల్సిందే. అలాంటి అరుదైన సంఘటన ఈ సంక్రాంతి ఒరిలో కనిపించనుందట. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఈ ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు.
దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో శర్వానంద్ ,అనుపమా పరమేశ్వరన్లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శతమానంభవతి. చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలు బరిలో ఉన్న సంక్రాంతి సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇంత భారీ పోటిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి కారణం టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించటమే అన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ సినిమాలో మహేష్, బన్నీ, ఎన్టీఆర్లు స్వయంగా నటించలేదట. వాళ్లు నటించిన ఇతర చిత్రాల్లోని సీన్స్ను ఈ సినిమాకు తగ్గట్టుగా ఎడిట్ చేసి వాడుతున్నారట. అయితే ప్రేక్షకులకు మాత్రం సినిమాలో ఆ హీరోలు స్వయంగా నటించారన్న భావన కలిగేలా ఆ సీన్స్ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఇంత భారీ పోటిలో సినిమాను రిలీజ్ చేయడానికి ఆ సీన్స్ కూడా కారణంగా చెపుతున్నారు. మరి ఈ ఎడిటింగ్ మ్యాజిక్ శతమానంభవతి ఎంత వరకు కాపాడుతుందో చూడాలి.