శర్వా ధైర్యాన్ని అభినందించిన కింగ్
ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ల్యాండ్ మార్క్ సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో తన సినిమా శతమానంభవతిని రిలీజ్ చేస్తున్న శర్వానంద్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోల సినిమాలతో పోటి పడటం సామాన్యమైన విషయం కాదు. థియేటర్లు దొరకటమే కష్టమనుకునే సమయంలో గ్రాండ్గా రిలీజ్ అవుతున్న శర్వానంద్ సినిమా శతమానంభవతి, సక్సెస్ సాధించాలని శుభాకాంక్షలు తెలిజేశాడు కింగ్ నాగార్జున.
ఇప్పటికే రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలకు కూడా తన శుభాకాంక్షలు తెలిపిన నాగ్, తాజాగా ఇంతటి భారీ కాంపిటీషన్లో శతమానం భవతి సినిమాను రిలీజ్ చేస్తున్న శర్వానంద్ ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. గత ఏడాది సొగ్గాడే చిన్ని నాయనా, డిక్టేటర్ సినిమాలతో పోటి పడ్డ శర్వానంద్ సక్సెస్ సాధించాడు. ఈ ఏడాది కూడా అదే ఫీట్ రిపీట్ చేయాలని ఆశిస్తున్నాని ట్వీట్ చేశాడు.
#sharwanand,Guts&glory work 2gether!Releasing yr film wt the biggies needs guts/U did it last yr successfully/wishing u the glory this yr 2👍
— Nagarjuna Akkineni (@iamnagarjuna) 13 January 2017