‘శతమానం భవతి’ సీక్వెల్‌ వచ్చేస్తోంది! | Dil Raju Announced Shatamanam Bhavati Sequel, Title As Shatamanam Bhavati Next Page - Sakshi
Sakshi News home page

Shatamanam Bhavati Next Page: ‘శతమానం భవతి’ సీక్వెల్‌ వచ్చేస్తోంది!

Published Wed, Jan 17 2024 10:07 AM | Last Updated on Wed, Jan 17 2024 10:34 AM

Dil Raju Announced Shatamanam Bhavati Sequel, Title As Shatamanam Bhavati  Next Page - Sakshi

శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహించిన చిత్రం ‘శతమానం భవతి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా 2017 సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘శతమానం భవతి నెక్ట్స్‌ పేజి’ నిర్మించనున్నట్లు ప్రకటించారు ‘దిల్‌’ రాజు.

‘‘చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ‘శతమానం భవతి’ మా బ్యానర్‌కి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును దక్కించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్పతనాన్ని చాటింది. మా బ్యానర్‌ విలువలకు తగ్గట్లు ‘శతమానం భవతి నెక్ట్స్‌ పేజి’ని ఘనంగా రూపొందించనున్నాం. 2025 సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement