
పవన్ కల్యాణ్ ఏళ్లకేళ్లుగా చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. నాలుగైదేళ్లుగా సెట్స్ మీదే ఉంది. మే 9న పక్కా థియేటర్లలోకి వస్తామని పోస్టర్స్ మీద పోస్టర్లు వదిలారు. తీరా చూస్తే ఇప్పుడు సౌండ్ లేదు. దీంతో వాయిదా లాంఛనమే. మరోవైపు ఈ తేదీని ఇప్పుడు మరికొన్ని తెలుగు మూవీస్ పట్టేస్తున్నాయి.
(ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్)
మే 9 టాలీవుడ్ కి చాలా అచ్చొచ్చిన తేదీ. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి.. ఇలా చెప్పుకొంటూపోతే ఆ రోజున థియేటర్లలో రిలీజై హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. 'హరిహర..' కూడా అదే తేదీ అనేసరికి ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఇప్పుడు మే 23న లేదంటే జూన్ 4న రావొచ్చని టాక్ వినిపిస్తుంది.
పవన్ సినిమా వాయిదా లాంఛనమే అని తెలియడానికి మరోలా కూడా క్లారిటీ వచ్చింది. కొన్నిరోజుల క్రితం సమంత నిర్మించిన 'శుభం' మూవీ ఇదే తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు శ్రీ విష్ణు '#సింగిల్' కూడా మే 9న థియేటర్లలోకి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇలా వరస చిత్రాలు ఆ తేదీన రాబోతున్నాయంటే పవన్ మూవీ మరోసారి వాయిదా పడ్డట‍్లేగా.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)