పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ? | Nidhi Aggarwal film career got gap due to Pawan Kalyan movie | Sakshi
Sakshi News home page

పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ?

Published Mon, Jan 13 2025 1:45 PM | Last Updated on Mon, Jan 13 2025 2:02 PM

Nidhi Aggarwal film career got gap due to Pawan Kalyan movie

సాధారణంగా ఓ హీరోయిన్‌ ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసేస్తుంటారు. స్టార్‌ హీరోయిన్లు అయితే కనీసం ఒకటైనా రిలీజ్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకుంటారు. కానీ ఓ హీరోయిన్‌ మాత్రం దాదాపు మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంది. అలా అని అవకాశాలు రాలేదని కాదు. ఎన్ని అవకాశాలు వచ్చిన వదులుకోవాల్సిన వచ్చింది. దానికి కారణం ఓ స్టార్‌ హీరో సినిమా. ఆ హీరో సినిమా టీమ్‌తో చేసుకున్న ఒప్పందమే ఆమె కెరీర్‌ని ముంచేసింది. మూడేళ్లుగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తోంది. అయినా కూడా ఆ సినిమా పూర్తి కాలేదు. ఆ సినిమా పేరే హరిహర వీరమల్లు. హీరో పవన్‌ కల్యాణ్‌.. మూడేళ్లుగా ఎదురు చూస్తోన్న హీరోయిన్‌ నిధి అగర్వాల్‌.

కొంప ముంచిన ఒప్పందం
పవన్‌ కల్యాణ్‌(pawan kalyan) హీరోగా నటించాల్సిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. కరోనా కంటే ముందే ఈ సినిమాను ప్రకటించారు. కొంత షూటింగ్‌ అయిన తర్వాత ఎన్నికలతో నెపంతో పవన్‌ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంకా బిజీ అయిపోయారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికీ పూర్తికాలేకపోయింది. అయితే ఈ సినిమా ఒప్పుకోవడమే నిధి అగర్వాల్‌(Nidhi Aggarwal ) కెరీర్‌కి శాపంగా మారింది. షూటింగ్‌ పూర్తయ్యే వరకు ఇతర సినిమాల్లో నటించరాదని ఒప్పందం చేసుకున్నారట. ఆ కారణంగానే వేరే సినిమాల్లో నటించలేకపోయారట. ఈ విషయాన్ని నిధి అగర్వాలే చెప్పారు.

‘లాక్‌డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సైన్‌ చేశాను. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా ఇవ్వాలని, కాబట్టి సినిమా అయ్యేంతవరకు వేరే సినిమా ఒప్పుకోకూడదని కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను. ఆ సమయంలోనే లాక్‌డౌన్‌ వచ్చింది. తర్వాత షూటింగ్‌ మొదలు పెట్టినా.. రెండోసారి లౌక్‌డౌన్‌ కారణంగా మళ్లీ వాయిదా పడింది. తర్వాత పవన్‌ పాలిటిక్స్‌లో బిజీ అయిపోయారు. ఇలా దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా కోసమే ఉండాల్సి వచ్చింది.  ఈ గ్యాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఆ కాంట్రాక్టు వల్లే వేరే ఏ సినిమా ఒప్పుకోలేదు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా రావడంతో ఆ సినిమా వదులుకోకూడదు అని హరిహర వీరమల్లు మూవీ టీమ్ తో మాట్లాడి, రిక్వెస్ట్ చేసి, షూటింగ్స్ కి క్లాష్ రానివ్వను అని చెప్పి రాజాసాబ్ సినిమాకు ఓకే చెప్పాను. ఈ రెండింటిపై పూర్తి నమ్మకంతో ఉన్నాను’ అని నిధి చెప్పారు.

తట్టుకోలేక  తప్పుకున్న క్రిష్‌!
హరిహర వీరమల్లు చిత్రానికి తొలుత క్రిష్‌ దర్శకుడు. ఈ పాటికే షూటింగ్‌ అయిపోయి..రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు. దానికి కారణం పవన్‌ కల్యాణే. ఆయన పాలిటిక్స్‌లో బిజీ కావడంతో కొంతకాలం క్రిష్‌ ఎదురు చూశాడు. అయితే గ్యాప్‌లో కూడా ఈ సినిమాను పూర్తి చేయకుండా ఇతర సినిమాలు ఒప్పుకోవడం..వాటికి డేట్స్‌ కేటాయించడంతో ఈ సినిమాకు మరింత గ్యాప్‌ వచ్చింది. దీంతో క్రిష్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. 

దీంతో మిగిలిన పోర్షన్ పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. అతడి కెరీర్లో ఇప్పటిదాకా హిట్ అన్నదే లేదు. చివరి చిత్రం ‘రూల్స్ రంజన్’ దారుణమైన ఫలితాన్నందుకుంది. మరి అతను తీసే మిగతా పార్ట్ ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.మాటల రచయిత  బుర్రా సాయిమాధవ్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం గమనార్హం. కాగా, పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి భాగం మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement