ఒక్క రోజు వ్యవధిలో రెండు భారీ చిత్రాలు
ఒక్క రోజు వ్యవధిలో రెండు భారీ చిత్రాలు
Published Thu, Sep 19 2013 2:16 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
విడుదల తేదీలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున తయారవుతోన్న ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాలు అక్టోబర్‌లో ఒక్క రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ‘అత్తారింటికి దారేది’అక్టోబర్ 9న విడుదల కాబోతుండగా, ‘రామయ్యా వస్తావయ్యా’ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘జల్సా’ తర్వాత పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ పాటలు ఇప్పటికే మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక పవన్‌కల్యాణ్ పాడిన ‘కాటమరాయుడా’ పాట యూట్యూబ్‌లో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిం చింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. సమంత, ప్రణీత ఇందులో కథానాయికలు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇక ‘రామయ్యా వస్తావయ్యా’ విషయానికొస్తే... ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీష్ శంకర్ చేస్తున్న సినిమా ఇది.
ఎన్టీఆర్ ఇందులో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలూడదీసి కొడతా’ అనే టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పాటలు ఈ వారంలో విడుదల కానున్నాయి. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలు. ‘బృందావనం’తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఎన్టీఆర్, ఈ సినిమాతో యువతకు మరింత చేరువవుతారని నిర్మాత ‘దిల్’రాజు చెబుతున్నారు.
Advertisement
Advertisement