కొరటాల శివ దర్శకత్వంలో...ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో...ఎన్టీఆర్
Published Thu, Aug 15 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
ఒక్క విజయం వస్తే వంద సినిమాలు చేసే అవకాశం వస్తుందో లేదో చెప్పలేం కానీ, కచ్చితంగా భారీ అవకాశాలు మాత్రం వస్తాయి. ప్రస్తుతం కొరటాల శివను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. రచయితగా ఆయన మంచి పేరు తెచ్చుకుని, ‘మిర్చి’తో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.
ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో శివ సీన్ మారిపోయింది. స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం వస్తోంది. వాటిలో రామ్‌చరణ్ పేరు ముందు వినిపించినా, ఇప్పుడా ప్రాజెక్ట్ లేదని వినికిడి. మహేష్‌బాబు హీరోగా వచ్చే ఏడాది శివ ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తారట.
ఈలోపు ఎన్టీఆర్ హీరోగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇటీవలే ఎన్టీఆర్‌ని శివ కలిశారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వినిపిస్తోంది. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రారంభమవుతుందట. డీవీవీ దానయ్య నిర్మిస్తారని వినికిడి.
Advertisement
Advertisement