తారక్ ఇప్పుడు బాహుబలి | Tarak now amazon | Sakshi
Sakshi News home page

తారక్ ఇప్పుడు బాహుబలి

Published Mon, Sep 30 2013 2:14 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తారక్ ఇప్పుడు బాహుబలి - Sakshi

తారక్ ఇప్పుడు బాహుబలి

బరువు తగ్గి శరీరాన్ని శిల్పంగా మార్చుకోవడమంటే.. కఠోర శ్రమతో కూడుకున్న వ్యవహారం. అంత శ్రమనీ ఓర్చి బొద్దుగా ఉండే తారక్ కాస్తా... స్లిమ్‌గా మారి పరిశ్రమ మొత్తం విస్తుపోయేలా చేశారు. చాలామందికి ఈ విషయంలో ఆయన స్ఫూర్తిగా కూడా నిలిచారు. అయితే... తారక్ ఇప్పుడు ఊహకందని మరో ఫీట్ చేశారు. 
 
 ప్రస్తుతం ఉన్న తన బరువు కంటే... రెండు రెట్లు బరువును మోయగల బాహుబలశాలిగా మారారు తారక్. ఆయన ఇంత బలవంతునిగా మారడం వెనుక అకుంఠిత దీక్ష, పట్టుదల ఉన్నాయంటున్నారు తారక్ పర్సనల్ ఫిజికల్ ట్రైనర్స్ ఎంబర్, జాన్ షుమెట్. వీరిద్దరూ ఎనిమిది నెలల క్రితం తారక్ కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు. 
 
 ఈ ఎనిమిది నెలల్లో శారీరకంగా తారక్‌లో ఎన్నో మార్పులొచ్చాయని, తన బరువు కంటే రెండు రెట్లు బరువును ఆయన అవలీలగా మోయగలరని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రస్తుతం తారక్ శరీరంలో కొవ్వు శాతం పూర్తిగా తగ్గిపోయిందని, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన సాధించిన ఘనత ఇదని ఎంబర్, జాన్ షుమెట్ తెలిపారు. ‘రామయ్యా వస్తావయ్యా’లో ఆరు పలకల దేహంతో తారక్  కనిపించనున్నారని సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement