ఉగాది పచ్చడిలో అయినా షడ్రుచులు కాస్త అటూఇటుగా ఉంటాయోమో కానీ బిగ్‌బాస్ షోలో మాత్రం అన్ని రసాలు పండించే కంటెస్టెంట్లను లోనికి పంపిస్తారు. ఆవేశం స్టార్లను, అతి సహనపరులను, నవ్వించేవాళ్లను, డ్యాన్స్ చేసేవాళ్లను.. ఇలా ప్రతీది ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ సీజన్‌లో ఓ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అనేది పక్కాగా ఉంటోంది. వీళ్లు చిన్న విషయానికి కూడా చిందులు తొక్కుతుంటారు. మరి మొదటి సీజన్ నుంచి నాల్గవ సీజన్ వరకు ఆ అర్జున్‌రెడ్డి ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి..
ఇస్మార్ట్ సోహైల్
ఇప్పుడు అతడిని కెప్టెన్ సోహైల్ అని పిలుచుకోవాలి. ఈ సీజన్‌లో ఐదో కెప్టెన్‌గా అవతరించాడు. మొదట్లో కాస్త సాఫ్ట్‌గా కనిపించిన సోహైల్ ఉన్నట్టుండి వయొలెంట్‌గా మారిపోయాడు. గొడవ ప్రారంభమైందంటే చాలు కథ వేరుంటది అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి తెలీకుండానే బూతులు కూడా మాట్లాడేస్తాడు. దీంతో అతడంటేనే ఓ రకమైన భయం వచ్చేసింది కొందరు కంటెస్టెంట్లకు. ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ కూడా సోహైల్ నరాలు కట్ అయిపోయేలా మాట్లాడతాడని చెప్పింది. ఆఖరికి నాగార్జున కూడా చాలా కోపం ఉందని, కాస్త నియంత్రించుకోమని సూచించారు.
తమన్నా సింహాద్రి
మొట్టమొదటిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చారు. మొదట బాగానే ఉన్న ఆమె తన విశ్వరూపం చూపించింది. సహ కంటెస్టెంటు రవికి చుక్కలు చూపించింది. పప్పు అని ఆడుకుంటూ అతడిని ఏడిపించింది. అటు అలీ రెజా, రోహిణితో కూడా కయ్యానికి కాలు దువ్వేది. అలా హౌస్‌లో ఆమె పేరు చెప్తేనే వణికే పరిస్థితి వచ్చింది. దీంతో ఆమె అరాచకాలకు అడ్డు కట్ట వేయాలని భావించిన ప్రేక్షకులు ఆమెను తొందరగానే హౌస్ నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇలా కోపంగా ఉంటూ గొడవలు పెట్టుకుంటూనే తను షోలో ఉన్నానన్న విషయం అందరికీ తెలుస్తుందనే ఈ ట్రిక్ ప్లే చేశానని చెప్పుకొచ్చింది. (చదవండి: అవినాష్, అరియానాల బండారం బయటపడనుందా?)
అలీ రెజా
టాస్క్ అంటే చాలు.. ఉన్న శక్తినంతా కూడదీసుకుని మరీ టాస్క్‌లో తన ప్రతాపాన్ని చూపేవాడు. అతని ఆటకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కానీ అతని కోపమే అతని పాపులారిటీని, ఓట్లను దెబ్బ తీసింది. వీరావేశంతో ఎదుటివారిపై నోరు జారడంతో ఆయన షో మధ్యలోనే వీడ్కోలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ అతడు రీ ఎంట్రీ ఇవ్వాలని నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంతో మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు. ఈ సారి గేమ్ ప్లాన్ మార్చి ఆడటంతో ఫైనల్ వరకు వెళ్లాడు.
తనీష్ అల్లాడి
రెండో సీజన్‌లో పాల్గొన్న హీరో తనీష్‌ను కోపానికి కేరాప్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు. కౌశల్, నూతన్ నాయుడుతో తరచూ గొడవలు జరిగేవి. వీటికి హద్దూ అదుపూ ఉండేది కాదు. అయినా సరే, తనీష్‌కు అభిమాన గణం మెండుగానే ఉండేది. దీనికితోడూ దీప్తి సునయనతో ప్రేమాయణం కూడా బాగానే వర్కవుట్ అయింది. దీంతో టాప్ 3 స్థానంలో నిలబడ్డాడు. ((చదవండి: 'అమ్మో' రాజశేఖర్, మళ్లీ శాపం పెట్టాడు!)
తేజస్వి మడివాడ
రెండో సీజన్‌లో తేజస్వి కూడా చీటికి మాటికీ రుసరుసలాడుతుండేది. తనకు ఏదైనా నచ్చకపోతే చాలా ఆ విషయాన్ని చీల్చి చెండాడేది. వివాదం, ఫిజికల్ టాస్క్, బ్రెయిన్ టాస్క్ ఇలా ఏదైనా సరే అందులో తన మార్క్ చూపించేది. ముక్కు మీద కోపం ఉన్న ఈ భామ ఏడో వారంలోనే బ్యాగు సర్దేసుకుని వెళ్లిపోయింది. (చదవండి: అవునా.. అరియానాకు బిగ్‌బాస్ అంత ఇస్తున్నాడా?)
శివబాలాజీ
అన్నీ అమర్చిన బిగ్‌బాసే ఒక్కోసారి కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడు. అయితే ఇలాంటి సందర్భాల్లో బిగ్‌బాస్‌ను అభ్యర్థించాల్సింది పోయి అతడిపైనే ఆవేశపెట్టాడు శివబాలాజీ. మొదటి సీజన్‌లో పాల్గొన్న శివబాలాజీ ఓ రోజు నీళ్లు సడన్‌గా రాకపోవడంతో బిగ్‌బాస్‌పైనే ఆగ్రహించాడు. కోపంతో పాటు మిగతా ఎమోషన్స్ కూడా ఎక్కువే కావడంతో ఆ ఆగ్రహాన్ని కవర్ చేయగలిగాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్ విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment