Bigg Boss Telugu 6: Rajasekhar Eliminated From BB Show - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: చచ్చినా బిగ్‌బాస్‌కు రానన్నాడు, ఏకంగా కప్పుకే గురి పెట్టాడు

Published Sat, Nov 26 2022 11:09 PM | Last Updated on Sun, Nov 27 2022 3:20 PM

Bigg Boss Telugu 6: Rajasekhar Eliminated From BB Show - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 84: ఇంటిసభ్యుల రాకతో హౌస్‌మేట్స్‌ ఫుల్‌ జోష్‌ మీదున్నారు. వారి జోష్‌ రెట్టింపు చేయడానికి మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను రప్పించారు. అయితే వారి గొంతు గుర్తుపడితనే వారితో మాట్లాడే అవకాశం కల్పిస్తానని మెలిక పెట్టాడు నాగ్‌. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ గొంతును గుర్తుపట్టడం డెడ్‌ ఈజీ కాబట్టి అందరూ ఎంచక్కా ఫ్యామిలీస్‌తో కబుర్లాడారు.

మొదటగా ఇనయ కోసం ఆమె తమ్ముడితోపాటు మాజీ కంటెస్టెంట్‌ సోహైల్‌ వచ్చారు. ఇనయను, ఆమె తల్లిని కలిపినందుకు బిగ్‌స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఫినాలేలో డబ్బు ఆఫర్‌ చేస్తే తనలా సూట్‌కేస్‌ తీసుకోమని సలహా ఇచ్చాడు. తనకోసం వచ్చిన సోహైల్‌కు థ్యాంక్స్‌ చెప్పిన ఇనయ బయటకు వచ్చాక ఫోన్‌ నెంబర్‌ తీసుకుంటానంటూ మెలికలు తిరిగింది. సోహైల్‌ కోసం ఆమె మణికొండకు వచ్చిందని, తన జిమ్‌ సెంటర్‌లో జాయిన్‌ అయిందంటూ ఆమె గుట్టంతా బయటపెట్టాడు సోహైల్‌. ఇనయకు హౌస్‌లో రేవంత్‌ టఫ్‌ కాంపిటీషనర్‌ అని, ఆదిరెడ్డి అసలు పోటీ ఇవ్వడని ఇనయ తమ్ముడు అభిప్రాయపడ్డాడు.

తర్వాత శ్రీహాన్‌ కోసం అతడి తండ్రి, శివబాలాజీ వచ్చారు. ఈ సందర్భంగా శివబాలాజీ.. నేను షో గెలిచి బయటకు వచ్చినప్పుడు రేవంత్‌ హౌస్‌లో జరిగేదంతా నిజమేనా? అడిగాడు. అవునని చెప్పినప్పుడు చచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్నాడు. మరి ఇప్పుడేంటి? అంటూ ఆటపట్టించాడు. తర్వాత శ్రీహాన్‌కు రేవంత్‌ కాంపిటీషన్‌ అయితే, ఫైమా పోటీనే కాదని చెప్పాడు. ఈ 12 వారాల ఆటకు శ్రీహాన్‌కు 9 మార్కులిచ్చాడు.

ఫైమా తన అక్క సల్మాను, బుల్లెట్‌ భాస్కర్‌ను చూడగానే ఏడ్చేసింది. భాస్కర్‌ అయితే పంచులతో అందరినీ నవ్వించాడు. ఇనయను ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదన్నాడు. ఫైమాకు ఇనయ గట్టి పోటీ ఇస్తుందని, శ్రీసత్య పోటీనే కాదని చెప్పాడు. ఫైమా మాట్లాడుతూ.. అమ్మవాళ్లకు సొంతిల్లు కట్టించి, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ సెట్‌ చేశాకే తాను పెళ్లి చేసుకుంటానంది. అనంతరం రేవంత్‌ అన్నయ్య సంతోష్‌, స్నేహితుడు రోల్‌ రైడా స్టేజీపైకి వచ్చారు. తన తమ్ముడికి శ్రీహాన్‌ పోటీ అని, రోహిత్‌ అసలు పోటీనే కాదన్నాడు. తర్వాత రోహిత్‌ కోసం అతడి తమ్ముడు డింప్‌, నటుడు ప్రభాకర్‌ వచ్చి పలకరించారు. రోహిత్‌కు రేవంత్‌ పోటీ అని, రాజ్‌ పోటీయే కాదని చెప్పాడు ప్రభాకర్‌. రేవంత్‌ను గెలిస్తే టైటిల్‌ గెలవడం ఈజీ అని ఉన్నమాట చెప్పి అందరికీ హింటిచ్చాడు.

తర్వాత ఆదిరెడ్డి కోసం చెల్లెలు నాగలక్ష్మి, మాజీ కంటెస్టెంట్‌ లహరి వచ్చారు. నువ్వు కనిపించనందుకు బాధగా ఉందన్నా అంటూ అంధురాలైన నాగలక్ష్మి బాధపడింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు. ఆదికి రేవంత్‌ కాంపిటీషన్‌ అని, శ్రీసత్య పోటీయే కాదని చెప్పింది నాగలక్ష్మి. కళ్లు లేని పిల్ల అని నాతో ఎవరూ ఫ్రెండ్‌షిప్‌ చేయరు. ఇప్పుడు లహరి నాతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తానంది అని మురిసిపోయింది.

శ్రీసత్య కోసం తన బెస్ట్‌ఫ్రెండ్‌ హారిక, నటి విష్ణుప్రియ స్టేజీపైకి వచ్చారు. ఆమెకు రేవంత్‌ పోటీ అని, కీర్తి పోటీయే కాదని చెప్పారు. శ్రీసత్యను తన తల్లి కోసం టెన్షన్‌ పడొద్దని సూచించారు. అమ్మకు రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ జరుగుతోందని, తన ఆరోగ్యం గురించిఆందోళన పడొద్దని చెప్పారు. తర్వాత రాజ్‌ ఫ్రెండ్‌ వెంకీ, హీరో సాయిరోనక్‌ వచ్చి రాజ్‌కు ఆటలో రేవంత్‌ కాంపిటీషన్‌ అయితే, ఇనయ పోటీయే కాదని స్పష్టం చేశారు.

కీర్తి కోసం ప్రియాంక, వితికాషెరు వచ్చారు. ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నావు, కానీ బయట చాలామంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అని కీర్తిలో ధ:ర్యం నింపింది వితికా. కీర్తికి హౌస్‌లో శ్రీహాన్‌ పోటీ అని, శ్రీసత్య పోటీయే కాదని కుండ బద్ధలు కొట్టారు ప్రియాంక, వితికా. ఇకపోతే సండే షూటింగ్‌ ఆల్‌రెడీ పూర్తవగా రాజ్‌ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.

చదవండి: నటించినందుకు నా భార్య ఇప్పటికీ ఏదోలా ఫీలవుతుంది: విష్ణు విశాల్‌
ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి?: స్పందించిన కూతురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement