![Bigg Boss 6 Telugu: Inaya Sultana Best Captain, Adi Reddy Worst Captain - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/3/adi-reddy-inaya.gif.webp?itok=ksWU7tvy)
Bigg Boss Telugu 6, Episode 91: రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడు తండ్రైన శుభవార్తను చెప్పాడు. డిసెంబర్ 1న రాత్రి 11 గంటలకు నాకు లక్ష్మీదేవి పుట్టిందంటూ అతడు ఇంటిసభ్యులతో ఈ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తర్వాత శ్రీహాన్, రేవంత్ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడగా శ్రీహాన్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్టుగా అవతరించాడు. ఇక నాగార్జున వచ్చీరాగానే ఈ 13 వారాల్లో మీరు రిగ్రెట్ అయిన వారం ఏంటి? దేనికోసం ఫీలయ్యారో చెప్పాలన్నాడు.
దీనికి ఫైమా ఆరోవారం సుదీపతో మాట్లాడిన విధానం వల్లే నాకు వెటకారం అన్న ట్యాగ్ వచ్చిందని బాధపడింది. తర్వాత ఇనయ మాట్లాడుతూ.. తొమ్మిదోవారంలో నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి నానామాటలు అన్నాను, అలా అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. శ్రీహాన్ వంతు రాగా.. ఫ్యామిలీ వీక్ (12వ వారం)లో సిరి చెప్పడం వల్ల నా వెటకారంతో కీర్తి బాధపడుతుందని తెలిసింది. అలా చేయకుండా ఉండాల్సిందన్నాడు. కీర్తి మాట్లాడుతూ.. 13వ వారంలో టికెట్ టు ఫినాలే రేసులో టవర్ టాస్కును తన్నకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది.
ఫస్ట్ వీక్ నుంచి ఆరో వారం వరకు నేను కోపతో ఏది పడితే అది అనేశాను. ఎనిమిదోవారం చేపల టాస్కులో ఫిజికల్‌గా ఆది, గీతూ, ఇనయలను బాధపెట్టాను. 13వ వారం ఆదిరెడ్డి రెచ్చగొట్టేసరికి ఓవర్‌గా రియాక్ట్ అయ్యాను, ఇవన్నీ నా పొరపాట్లేనని అంగీకరించాడు రేవంత్. 12వ వారం కెప్టెన్సీ టాస్కులో ఇనయను నమ్మి పెద్ద తప్పు చేశానన్నాడు రోహిత్. 2వ వారంలో నాకు దెబ్బలు తగులుతాయన్న భయంతో గేమ్ ఆడకుండా కూర్చున్నా, 11వ వారంలో కీర్తిని ఇమిటేట్ చేశా.. అదే నా రిగ్రెట్ అని చెప్పింది శ్రీసత్య.
2వ వారంలో నేను కూడా దెబ్బలు తగులుతాయేమోనని పెద్దగా ఆడలేదు, 9వ వారంలో మైక్ విసిరికొట్టాను, 11వ వారంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల యూజ్ ఉండదు అని అందరిముందు చెప్పడం తప్పనిపించింది. అమ్మాయిల విషయంలో ఓవర్ సెన్సిటివ్‌గా ఆడటం కూడా తప్పేనన్నాడు ఆదిరెడ్డి. తర్వాత నాగార్జున ఎవరు బెస్ట్ కెప్టెన్? ఎవరు వరస్ట్ కెప్టెన్? చెప్పాలంటూ గేమ్ ఆడించాడు.
కంటెస్టెంట్ | ఉత్తమ కెప్టెన్ | చెత్త కెప్టెన్ |
రోహిత్ | కీర్తి | ఆదిరెడ్డి |
ఆదిరెడ్డి | ఇనయ | శ్రీసత్య |
శ్రీసత్య | ఇనయ | ఆదిరెడ్డి |
ఇనయ | శ్రీసత్య | శ్రీహాన్ |
శ్రీహాన్ | ఇనయ | ఆదిరెడ్డి |
కీర్తి | ఫైమా | శ్రీహాన్ |
ఫైమా | ఇనయ | రేవంత్ |
రేవంత్ | ఆది రెడ్డి | ఇనయ |
ఫైనల్‌గా హౌస్ మొత్తం ఇనయను బెస్ట్ కెప్టెన్‌గా, ఆదిరెడ్డిని వరస్ట్ కెప్టెన్‌గా నిలబెట్టింది.
ఇకపోతే రేవంత్ అమ్మాయిలే వీక్ అని మాట్లాడాడని ఆదిరెడ్డి ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నాడు. గతవారం ఈ విషయమై రేవంత్ అలా అనలేదని నాగార్జున క్లారిటీ ఇస్తూ వీడియో కూడా చూపించాడు. అయినప్పటికీ ఆది మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా పూర్తి వీడియోలో రేవంత్ ఆ మాట అన్నాడంటూ మొండిగా వ్యవహరించాడు. దీంతో నాగ్ ఈసారి పూర్తి వీడియో చూపించాడు. మొత్తం వీడియో చూపించాక రేవంత్ ఆడపిల్లలు వీక్, వాళ్లు వస్తే ఈజీగా ఆడేయొచ్చు అని అన్నాడా? లేదా? అని ఇనయ, కీర్తి, ఫైమాలను అడగ్గా వారు ముక్తకంఠంతో లేదని చెప్పారు. దీంతో నాగార్జున.. ఆది నాన్‌సెన్స్ మాట్లాడుతున్నావు, ఇకమీదట దీన్ని సాగదీయకుండా ఇక్కడితో ఆ ప్రస్తావనే ఆపేసేయ్ అని వేడుకున్నాడు.
అనంతరం నాగ్.. రేవంత్‌ను సర్‌ప్రైజ్‌లో ముంచెత్తాడు. అతడికి తన భార్యాబిడ్డలతో మాట్లాడే అదృష్టాన్ని కల్పించాడు. వీడియో కాల్ ద్వారా స్క్రీన్‌పై భార్యాబిడ్డను చూసుకుని రేవంత్ మురిసిపోయాడు. ఈ సమయంలో నేను నీకు తోడుగా లేనందుకు సారీ అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత.. పెదవే పలికిన మాటల్లోన సాంగ్ పాడి దాన్ని అందరు తల్లులకు డెడికేట్ చేశాడు. ఇకపోతే ఈ వారం ఫైమా ఎలిమినేషన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
చదవండి: వంద కోట్ల దాకా పోగొట్టుకున్నాను, జయసుధ కూడా అంతే: చంద్రమోహన్
మహేశ్‌బాబు అలా అనగానే కన్నీళ్లు ఆగలేదు: అడివి శేష్
Comments
Please login to add a commentAdd a comment