
Bigg Boss Telugu 6, Episode 92: బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఫన్ అండ్ గేమ్ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. ఈరోజు హౌస్‌లో హిట్ 2 చిత్రయూనిట్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసి ఎంటర్‌టైన్ చేశారు. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..
జీవితాంతం ఎవరు ఫ్రెండ్‌గా ఉంలనుకుంటున్నారు? ఎవరిని జీవితంలో అసలు ఫ్రెండ్‌గా వద్దనుకుంటున్నారో చెప్పాలంటూ చిన్న టాస్క్ ఇచ్చాడు నాగార్జున. దీనికి ఆది.. ఫైమాను ఫ్రెండ్ అని, ఇనయతో అంత ఫ్రెండ్‌షిప్ ఉండదంటూ ఆమె ఫోటోను డస్ట్‌బిన్‌లో వేశాడు. ఇనయ.. కీర్తిని ఫ్రెండ్‌గా, శ్రీహాన్‌తో ఫ్రెండ్‌షిప్ డౌటేనంటూ అతడి ఫోటోను చించేసింది. శ్రీహాన్ వంతు రాగా రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉండదని అతడి ఫోటోను చించేశాడు.
రోహిత్.. రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమోనన్నాడు. ఫైమా.. ఆదిరెడ్డి తన జీవితాంతం ఫ్రెండ్ అని రోహిత్‌తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది. కీర్తి.. ఇనయ ఫ్రెండ్ అంటూ శ్రీహాన్‌కు కటీఫ్ చెప్పింది. రేవంత్.. శ్రీసత్యతో దోస్తానా చేస్తానని, కీర్తి తనను తక్కువ అర్థం చేసుకుంటుందంటూ సైడ్ చేశాడు. శ్రీసత్య.. ఎక్కువ గొడవపడేది, ఎక్కువ క్లోజ్ అయింది రేవంత్‌తోనే అంటూ అతడే లైఫ్‌టైమ్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇంట్లో అందరికన్నా రోహిత్‌తో తక్కువ కనెక్షన్ ఉందని తన ఫొటోను చెత్తబుట్టలో పడేసింది.
తర్వాత హిట్ 2 హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. ఇక అడివిశేష్‌కు ఓ కేసు అప్పజెప్పాడు నాగ్. బిగ్‌బాస్ హౌస్‌లో అద్దంపై కోడిబుర్ర అని రాసిందెవరో కనిపెట్టమన్నాడు. శేష్ ఎంతో ఈజీగా ఆ బొమ్మ గీసింది రేవంతేనని కనిపెట్టాడు. తర్వాత ఇంటిసభ్యులతో మూవీ డంబ్ షేర్ ఆర్ట్స్ ఆడిస్తూ వారికోసం కొన్ని సినిమా పోస్టర్లను అంకితమిచ్చాడు. అనంతరం ఫైమా ఎలిమినేట్ కావడంతో ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. స్టేజీమీదకు వచ్చిన ఫైమాతో ఎవరితో ఫన్? ఎవరితో ఫ్రస్టేషన్? చెప్పాలన్నాడు నాగ్.
దీనికి ఫైమా ఫన్ కేటగిరీలో ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయ, రోహిత్‌లను చేర్చింది. రేవంత్‌ను ఫ్రస్టేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంది. ఇక ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఆమె చేతిని ముద్దాడాడు. ఆమెకు వీడ్కోలు పలికిన అనంతరం నాగ్ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్ విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల ప్లాట్ కూడా సొంతం చేసుకుంటారని చెప్పాడు.
చదవండి: సెలూన్ అమ్మేసి పాత ఇల్లు కొన్న జబర్దస్త్ కమెడియన్
తండ్రి మాట వినకపోతే బన్నీలా తయారవుతారు: బండ్ల గణేశ్







Comments
Please login to add a commentAdd a comment