Bigg Boss 6 Telugu: Adi reddy Counter to Hero Adivi Sesh - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: అడివి శేష్‌కే పంచ్‌ ఇచ్చిన ఆదిరెడ్డి, ప్రోమో చూశారా?

Published Sun, Dec 4 2022 3:37 PM | Last Updated on Sun, Dec 4 2022 4:18 PM

Bigg Boss Telugu 6: Adi reddy Counter to Adivi Sesh - Sakshi

బిగ్‌బాస్‌ స్టేజీపైకి హిట్‌ 2 హీరో అడివి శేష్‌ వచ్చాడు. వచ్చీరాగానే అతడికో కేస్‌ అప్పజెప్పాడు నాగార్జున. అతడు వచ్చేముందే ఇంటిసభ్యుల్లో ఎవరైనా అద్దంపై కోడి బుర్ర అని రాసి దానిపై హారర్‌ బొమ్మ వేయమని సూచించాడు. తర్వాత అడివి శేష్‌ను పిలిచి ఆ బొమ్మ గీసిన నేరస్తుడిని పట్టుకోమని సవాలు విసిరాడు. ఆ బొమ్మ చూసిన అడివి శేష్‌ నన్ను కోడిబుర్ర అంటున్నారా? అని అడగడంతో అందరూ ఫక్కుమని నవ్వేశారు.

ఇక శేష్‌ తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి బొమ్మ గీసిందెవరో కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, నువ్వే గీశావా? అని అడగ్గా కనుక్కోవాల్సింది మీరు కదా సర్‌ అంటూ కౌంటరిచ్చాడు ఉడాల్‌ మామ. దీంతో నాగార్జున పగలబడి నవ్వాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఫన్‌ గేమ్స్‌ ఆడించాడు. మరి అడివి శేష్‌ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే!

చదవండి: ఈ వారం ఆమె ఎలిమినేట్‌, సీజన్‌ బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరంటే?
కాబోయే భర్తను పరిచయం చేసిన బాహుబలి సింగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement