Bigg Boss 6 Telugu Grand Finale Updates: Awards For Five Contestants, Know Details - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6 Grand Finale: బెస్ట్‌ గేమర్‌, లవర్‌ బాయ్‌ అవార్డు అందుకుందెవరంటే?

Published Sun, Dec 18 2022 7:48 PM | Last Updated on Mon, Dec 19 2022 3:48 PM

Bigg Boss 6 Telugu Grand Finale: Awards For Five Contestants - Sakshi

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో అవార్డుల కార్యక్రమం జరిగింది. ఓ ఐదు అవార్డులను ప్రవేశపెట్టిన నాగ్‌ వాటికి ఎవరు అర్హులో చెప్పాలని ఫైనలిస్టులను ఆదేశించాడు. మొదటగా బెస్ట్‌ చెఫ్‌ అవార్డును ప్రవేశపెట్టాడు. ఇది మెరీనాకు సరిగ్గా సూటవుతుందన్నాడు రేవంత్‌. అందరికీ వంట చేసి పెడుతూనే తను గేమ్‌ ఆడేదని చెప్పాడు. దీంతో ఆ అవార్డును మెరీనాకు అందించాడు హోస్ట్‌.

తర్వాత బెస్ట్‌ డ్యాన్సర్‌ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఆమె స్టేజీపైకి రాగానే చేతికి ముద్దు పెడతానంటూ ఆటపట్టించాడు నాగ్‌. దెబ్బకు హడలిపోయిన ఫైమా.. మీరు ముద్దులు ఇస్తే నాకు నిద్ర పట్టడం లేదంటూ దూరం జరిగింది. అనంతరం కీర్తి.. స్లీపింగ్‌ స్టార్‌ అవార్డును శ్రీసత్యకు ఇవ్వాలనడంతో నాగ్‌ దాన్ని ఆమెకు బహుకరించాడు. రోహిత్‌.. రాజ్‌ బెస్ట్‌ గేమర్‌ అని చెప్పడంతో అతడికి పురస్కారం ఇచ్చాడు నాగ్‌. శ్రీహాన్‌.. లవర్‌ బాయ్‌ అవార్డుకు అర్జున్‌ కల్యాణ్‌ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపైకి వెళ్లి అవార్డు అందుకున్నాడు.

చదవండి: పెళ్లికూతురి గెటప్‌లోనే గ్రాండ్‌ ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి
బిగ్‌బాస్‌ 6 గ్రాండ్‌ ఫినాలే.. లైవ్‌ అప్‌డేట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement