ఓరి దేవుడా! | Oh My God ' | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడా!

Published Sat, Nov 7 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

ఓరి దేవుడా!

ఓరి దేవుడా!

శ్రీవెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వి. శ్రీవాత్సవ్ దర్శకత్వంలో వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం ‘ఓ మైగాడ్’. తనీష్, మేఘశ్రీ, పావని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీత దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో నిర్మాత డి.ఎస్.రావు సీడీని  ఆవిష్కరించి, దర్శక-రచయిత శివశక్తి దత్తాకు అందించారు. ‘‘నా శిష్యుడు శ్రీవాత్సవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అని శివశక్తి దత్తా అన్నారు.

ఇది సోషియో ఫాంటసీ చిత్రమని తనీష్  పేర్కొన్నారు. చంద్రమహేశ్ దగ్గర ‘హనుమంతు’ చిత్రానికి దర్శకత్వ శాఖలో చేశాననీ, విజయేంద్ర ప్రసాద్ దగ్గర కూడా చేసిన అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, చంద్రమహేష్, మేఘశ్రీ పాల్గొన్నారు.ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రాజు తోట, కో-ప్రొడ్యూసర్: చనమాల పురుషోత్తం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement