ప్రేమిస్తే సరిపోదు
‘అప్పుడే పుట్టిన పసిబిడ్డలాంటిదే చిన్న సినిమా. చిన్న చిత్రాలను కాపాడాలి. వాటి వల్ల చాలా మందికి జీవనోపాధి దక్కుతుంది. ‘ప్రేమిక’ టీజర్ బాగుంది’’ అని దర్శక-నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. తనీష్, శ్రుతీ యుగళ్ జంటగా మహేంద్ర దర్శకత్వంలో దేశాల లక్ష్మయ్య నిర్మిస్తున్న ‘ప్రేమిక’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో రూపొందిస్తోన్న చిత్రమిది. అమ్మాయిల వెనక అల్లరి చిల్లరగా తిరిగే యువకులు... పెళ్లి చేసుకోవాలంటే ప్రేమిస్తే సరిపోద్ది.
అదే అమ్మాయిని పోషించాలంటే సంపాదించాలనే నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ల జీవితంలోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అనేది కథ. త్వరలో పాటలు, ఆగస్టులో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘ప్రేమిక’ అన్నది ఓ సినిమా కాదు. టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ కష్టం. ఆ కష్టానికి నిర్మాత లక్ష్మయ్య ఎంతో సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు తనీష్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శౌర్య, మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి, శ్యామ్ సుందర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: స్టార్ లైన్ మూవీస్, కెమెరా: రాహుల్ మాచినేని.