Shruti Yugal
-
ఉన్నది ఒకటే జీవితం
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా పరిచయం కానున్న సినిమా ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అనేది ఉప శీర్షిక. శృతియుగల్ కథానాయికగా నటించారు. ఎమ్.వెంకట్ దర్శకత్వంలో నారాయణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు బాగున్నాయి. అనుభవం ఉన్న దర్శకునిలా వెంకట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.‘‘హారీష్రావుగారు మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ టెక్నాలజీ యుగంలో హ్యూమన్ రిలేషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు వెంకట్. సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి తదితరులు నటించిన ఈ సినిమాకు అమ్రీష్ సంగీతం అందించారు. -
టెక్నాలజీ పేరుతో పరుగులు
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అన్నది ఉప శీర్షిక. శృతి యుగల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎం.వెంకట్ దర్శకత్వంలో లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. వెంకట్ మాట్లాడుతూ– ‘‘నేటి తరం యువత టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోంది. మానవ సంబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అమ్రీష్ అద్భుతమైన సంగీతం, రీ–రికార్డింగ్’’ అందించారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సినిమా ఇది. వెంకట్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. ఆగస్ట్ 22న సినిమా విడుదల చేస్తాం’’ అని నిర్మాత నారాయణ్ రామ్ అన్నారు. -
హ్యాండిల్ విత్ కేర్
సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అన్నది ఉపశీర్షిక. శృతి యుగల్ కథానాయిక. ఎం.వెంకట్ దర్శకత్వంలో లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వెంకట్ మాట్లాడుతూ –‘‘టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోన్న నేటి తరం హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని సినిమాలో చూపిస్తున్నాం. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రమిది. మా టీమ్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నారాయణ్ రామ్. సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి, శ్యామ్, దిశ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: వై.గిరి. -
పల్లెటూరి ప్రేమ
తనీష్, శ్రుతీ యుగళ్ జంటగా ఎస్.వి.ఎన్. రావు సమర్పణలో మహేంద్ర దర్శకత్వంలో దేశాల లక్ష్మయ్య నిర్మించిన చిత్రం ‘ప్రేమిక’. దిలీప్ బండారి స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే మంచి ప్రేమకథ. మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఛాన్స్ ఇచ్చిన లక్ష్మయ్యకు రుణపడి ఉంటా’’ అన్నారు మహేంద్ర. ‘‘సెప్టెంబర్ 8న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దేశాల లక్ష్మయ్య. తనీష్, శృతియుగళ్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, దర్శకుడు త్రినాథరావు, గణేష్ మాస్టర్ పాల్గొన్నారు. -
ప్రేమిస్తే సరిపోదు
‘అప్పుడే పుట్టిన పసిబిడ్డలాంటిదే చిన్న సినిమా. చిన్న చిత్రాలను కాపాడాలి. వాటి వల్ల చాలా మందికి జీవనోపాధి దక్కుతుంది. ‘ప్రేమిక’ టీజర్ బాగుంది’’ అని దర్శక-నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. తనీష్, శ్రుతీ యుగళ్ జంటగా మహేంద్ర దర్శకత్వంలో దేశాల లక్ష్మయ్య నిర్మిస్తున్న ‘ప్రేమిక’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో రూపొందిస్తోన్న చిత్రమిది. అమ్మాయిల వెనక అల్లరి చిల్లరగా తిరిగే యువకులు... పెళ్లి చేసుకోవాలంటే ప్రేమిస్తే సరిపోద్ది. అదే అమ్మాయిని పోషించాలంటే సంపాదించాలనే నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ల జీవితంలోకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అనేది కథ. త్వరలో పాటలు, ఆగస్టులో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘ప్రేమిక’ అన్నది ఓ సినిమా కాదు. టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ కష్టం. ఆ కష్టానికి నిర్మాత లక్ష్మయ్య ఎంతో సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు తనీష్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శౌర్య, మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి, శ్యామ్ సుందర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: స్టార్ లైన్ మూవీస్, కెమెరా: రాహుల్ మాచినేని.