బిగ్‌బాస్‌: తనీష్‌ నువ్వెలా బెస్ట్‌ ప్లేయర్‌? | Bigg Boss 2 Host Nani Fires On Tanish | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 12 2018 10:50 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

Bigg Boss 2 Host Nani Fires On Tanish - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్‌-1 కన్నా హౌజ్‌ మేట్స్‌ గొడవలు, సోషల్‌ మీడియా ట్రోల్స్‌తో ఈ సీజన్‌ వేడెక్కింది. శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాని తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన పరిణామాలపై ఆరాతీశాడు. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల ప్రవర్తనపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశాడు. చెప్పిందే చెప్పి తనకే బోర్‌ వస్తుందని, హౌస్‌ మేట్స్‌ మాత్రం మారడం లేదన్నాడు. కాస్త సీరియస్‌గానే సాగిన ఈ ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు కావాల్సిన మజా దొరికింది.

రజనీకాంత్‌ ‘నరసింహా’ సినిమా స్టోరీని పిట్టకథగా చెబుతూ షోను ప్రారంభించిన న్యాచురల్‌ స్టార్‌.. డబ్బు ఏమైనా చేస్తుందని, దానితో జాగ్రత్త ఉండాలని, హౌస్‌లో కూడా ఇదే నిరూపితమైందని తెలిపాడు. శుక్రవారం హౌస్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర ఘటనలను నాని చూపించాడు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌తో నెలకొన్న బంధం గురించి సరదాగా ముచ్చటించారు. ఇక కౌశల్ కొందరి ఇంటిసభ్యులను ఇమిటేట్‌ చేస్తుండగా నూతన్‌ నాయుడు వారి పేర్లు చెప్పాడు. నామినేషన్‌లో ఉన్న కారణంగా ఇంటి సభ్యులతో ముచ్చటిస్తూ.. తన దగ్గరకు వచ్చిన దీప్తిపై నూతన్‌ నాయుడు ఫైర్‌ అయ్యాడు. (చదవండి: బిగ్‌బాస్‌-2.. అదే అసలు సమస్య!)

తనీష్‌కు క్లాస్‌...
తొలుత నామినేషన్‌లో ఉన్న ఒక్కక్కరితో నాని ముచ్చటించారు. ముఖ్యంగా తనీష్‌కు గట్టిగానే క్లాస్‌ పీకాడు. టాస్క్‌లో దీప్తి సునయన కోసం తప్పుకోవడం ఏమిటని మందలించాడు. దీనికి తనీష్‌ కాలునొప్పితో అలా చేశానని, సునయన కోసం కాదని ఎదో సాకు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నాని కన్విన్స్‌ కాలేదు. ఇక ఏ టాస్క్‌లో పాల్గొని నువ్వు బెస్ట్‌ ప్లేయర్‌ ఎలా అయ్యావని ప్రశ్నించాడు. కబడ్డీ టాస్క్‌, క్రైయింగ్‌ టాస్క్‌, బాక్స్‌ టాస్క్‌ల్లో పాల్గొనలేదు మరీ ఎలా బెస్ట్‌ పర్‌ఫార్మర్‌ అయ్యావు అని నిలదీశాడు. ఈ ప్రశ్నకు తనీష్‌, అతని మద్దతుదారులకు దిమ్మతిరిగింది. సమాధానం చెప్పడంలో తనీష్‌ తడబడ్డాడు. ఇక కౌశల్‌ కాయిన్స్‌ తీసుకెళ్లడం వ్యతిరేకించిన తనీష్‌ పూజా విసిరిన కాయిన్స్‌ ఎలా తీసుకుంటావని ప్రశ్నించాడు. ఎదో ఒకవైపు ఉండాలి అని మందలించాడు. గణేష్‌ మళ్లీ హౌస్‌లో కనబడటం లేదని, సమోసాలు, వర్షం అంటూ ఎదో చెప్పాడు. అయినా వేడివేడి వర్షం ఏంటీరా నాయనా అని ప్రశ్నించాడు. దీంతో నవ్వులు పూసాయి.   

బాబు డబుల్‌ గేమ్‌..
బాబుగోగినేని నుంచి ఎలాంటి ప్రయత్నం జరగడం లేదని, ప్రతీసారి ఇదే చెబుతున్నాని, కానీ తను మాత్రం లైట్‌ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక కాయిన్స్‌ టాస్క్‌లో కౌశల్‌ కాయిన్స్‌ ఎత్తుకెళ్లడాన్ని మహిళా కంటెస్టెంట్స్‌ వద్ద తప్పుబట్టడం, మళ్లీ కౌశల్‌ వద్ద సమర్ధించడం ఎంటని ప్రశ్నించాడు. దీనికి బాబు తనదైన సమాధానంతో నాని ట్రాప్‌లో పడే ప్రయత్నం చేశాడు. కానీ నాని వీడియో క్లిప్‌ ప్లే చేసి బాబు డబుల్‌ గేమ్‌ను బయటపెట్టాడు. దీనికి బాబుగోగినేని సైతం తన తప్పును అంగీకరించాడు.

ఎలాగోలా బతికే చేపలు..
హౌస్‌లో అమిత్‌, రోల్‌రైడాలు ఎలాగోలా బతికే చేపలని నాని కామెంట్‌ చేశాడు. వీరు మంచితనం అనే ముసుగులో గేమ్‌ ఆడుతున్నారని, ఇంకా అది పనిచేయదని సూచించాడు. అమిత్‌ డబుల్‌ గేమ్‌ను సైతం వీడియో క్లిప్‌తో బట్టబయలు చేశాడు. కౌశల్‌తో కాయిన్స్‌ తీయడాన్ని సమర్ధించడం.. మళ్లీ ఆ విషయమే తనే తీయాలని రోల్‌రైడాతో చర్చించడం.. చివర్లో ఎవరికి చెప్పావని కౌశల్‌ను ప్రశ్నించడం ఏమిటని నాని నిలదీశాడు. ఏదో ఒకనిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నాడు. 

ఆ విషయంలో నచ్చావ్‌ కౌశల్‌..
కెప్టెన్‌ టాస్క్‌లో భాగంగా దీప్తి సునయన సంచాలకులుగా వ్యవహిరంచడం ఏమిటని నాని ప్రశ్నించాడు. తనీష్‌కు క్లోజ్‌గా ఉండే తను న్యాయంగా ఉన్నా అలా అనిపించడం లేదన్నాడు. దీనికి సునయన ఎప్పుడు చేయలేదు కదా అని చేశా.. నిజాయితీగానే చెప్పా అని సమాధానమిచ్చింది. దీనికి ఎలిమినేష్‌న్‌ ఎప్పుడు కాలేదు కదా అని అయితావా ఏంటీ అని పంచ్‌ ఇచ్చాడు. ఇదే ఎవరి గొయ్యి వారు తవ్వుకోవడం అని బదులిచ్చాడు. ఈ టాస్క్‌ వ్యవహారంలో కౌశల్‌ ఓ స్టాండ్‌ తీసుకోని తన అభిప్రాయాన్ని వెల్లడించడం నచ్చిందని నాని మెచ్చుకున్నాడు. అయితే ఆ టాస్క్‌లో నేనైతే ఇలా చేశావాడినని, తోసేవాడినని చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. దానికి నేనైతే ఇలా ఆడేవాడినని మాత్రమే చెప్పానని కౌశల్‌ బదులిచ్చాడు. ఇక కాయిన్స్‌ టాస్క్‌ మొత్తం మార్చేశావని, అయితే ఆ పని మీ జట్టు సభ్యులకు చెప్పి చేస్తే బాగుండేదని నాని అభిప్రాయపడ్డాడు. ఇక సామ్రాట్‌ బాగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు.

గీతాగారు మీరు ఇన్‌ఫ్లూయెన్స్‌..
గత వారం నుంచి ఓ ఇంటి సభ్యుడితో ఓ లక్కీ అభిమాని ఫోన్‌ మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా వరంగల్‌ నుంచి గీతామాధురి అభిమాని మాట్లాడారారు. ముందుగా నాని న్యాచురల్‌గా హోస్ట్‌ చేస్తున్నాడని కితాబిచ్చి.. గీతా మాధురితో మాట్లాడారు. ‘ తొలి రోజుల్లోని మీ ప్రవర్తనకు ఇప్పటికి తేడా వచ్చిందని, మీరు దీప్తి, శ్యామల మాటలకు ప్రభావం అవుతున్నారని ప్రశ్నించారు. మీరు మీలానే ఉండాలని సూచించారు’. దీనికి గీతా సైతం అలానే ఉండటానికి ప్రయత్నిస్తానని సమాధానిమచ్చింది.

చివర్లో కౌశల్‌ నాని టాస్క్‌ల్లో హౌజ్‌ మేట్స్‌ నిజాయితీగా బెస్ట్‌ పర్‌ఫార్మర్‌ పేరు చెప్పడం లేదన్నాడు. దీనికి వారు నిజాయితీగా లేకుంటే ప్రేక్షకులున్నారు. నీకు ప్రేక్షకులు కావాలా కంటెస్టెంట్స్‌ కావాలా అని ప్రశ్నించాడు. దీనికి కౌశల్‌ ప్రేక్షకులేనని సమాధానమిచ్చాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న గీతా మాధురి, శ్యామల ప్రొటెక్ట్‌ అయ్యారని నాని తెలిపాడు. మిగిలిన తనీష్‌, బాబుగోగినేని, గణేష్‌, దీప్తిల్లో ఎవరూ ప్రొటెక్ట్‌ అవుతారు? ఎవరూ ఎలిమినేట్‌ అవుతారో తెలియాంటే నేటి ఎపిసోడ్‌ వరకు వేచి ఉండాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement