వీధి బాలల నేపథ్యంలో శ్రీ తారక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీధిబాలలం’. ‘మాకూ స్వాతంత్య్రం కావాలి’ అన్నది ఉపశీర్షిక. ఎ.వి. వర్మరాజు సమర్పణలో వాహిని క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా పాటలను సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సమాజానికి సందేశమిచ్చే ఇటువంటి సినిమాలు మరెన్నో రావాలి. వీధిబాలల కథాంశంతో సినిమా చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమా విడుదల విషయంలో నా వంతు సాయం చేస్తా’’ అన్నారు.
‘‘సుమారు 1200 మంది పిల్లలను వివిధ స్కూల్స్ నుంచి ఎంపిక చేసి నటనలో మెళకువలు నేర్పించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమాజంలోని ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీ తారక్. ‘‘ఈ సినిమా మీద వచ్చిన ప్రతి పైసా అనాథ పిల్లల సహాయార్థం ఉపయోగిస్తాం’’ అన్నారు ఎ.వి. వర్మరాజు. ‘‘నేను కూడా బాల నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు నటుడు తనీష్. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పాటల రచయిత దుర్గాప్రసాద్, విజయవాణి, ఎఫ్‌ఎమ్ బాబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment