Avanti srinuvasa rao
-
చంద్రబాబులా పబ్లిసిటీ కోరుకునే సీఎం కాదు
సాక్షి, విశాఖ : రాష్ర్టంలో భారీ వర్షాలు నమోదైనా, అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తం కావడం వల్లే పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన..ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటే చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు లాగా కేవలం ఫోటోలకు ఫోజులిచ్చే సీఎం జగన్మోహన్ రెడ్డి కాదని నష్టం జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో సహాయం చేసే మనస్తత్వం జగన్‌ది అని పేర్కొన్నారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదని, జూమ్ మీటింగ్‌లు మానుకొని చంద్రబాబు రాష్ర్టానికి రావాలన్నారు. రాష్ర్టంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాథమికంగా విశాఖలో 5795 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయంలో పెడతారని, ఎవరి పేర్లయినా జాబితాలో లేకపోయినా నమోదుకు మళ్ళీ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. (ఏపీలో పంట నష్టం అంచనాను ప్రారంభించిన ప్రభుత్వం) రాష్ర్టంలో కురిసిన భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం జిల్లాలో 660 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని, ఇది సాధారణం కంటే 500 రెట్లు ఎక్కువ అని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. ముందుగా అప్రమత్తం అవడం వల్ల మత్స్యకారులకు నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. భారీ వర్షాలకు జీవిఎంసీలో 15 కోట్ల నష్టం, ఈపిడిసిఎల్‌కు 16 లక్షల నష్టం వాటిల్లిందని కలెక్టర్ పేర్కొన్నారు. ‘30 మండలాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయి. భారీ వర్షాలకు జిల్లాలో 5 మంది చనిపోయారు. 90 ఇల్లులు డ్యామేజి అయ్యాయి. రోడ్లు దెబ్బతిని 62 కోట్ల నష్టం వాటిల్లింది. పంట నష్టం జరిగిన రైతుల వివరాలను గ్రామ వార్డ్ సచివాలయంలో పెట్టమని సీఎం ఆదేశించారు. ఎవరైనా పేర్లు నమోదు కాకపోతే వారికి మరోమారు అవకాశం ఇస్తామ’ని పేర్కొన్నారు. (ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు) -
మాకూ స్వాతంత్య్రం కావాలి
వీధి బాలల నేపథ్యంలో శ్రీ తారక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీధిబాలలం’. ‘మాకూ స్వాతంత్య్రం కావాలి’ అన్నది ఉపశీర్షిక. ఎ.వి. వర్మరాజు సమర్పణలో వాహిని క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా పాటలను సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సమాజానికి సందేశమిచ్చే ఇటువంటి సినిమాలు మరెన్నో రావాలి. వీధిబాలల కథాంశంతో సినిమా చేసిన దర్శక–నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమా విడుదల విషయంలో నా వంతు సాయం చేస్తా’’ అన్నారు. ‘‘సుమారు 1200 మంది పిల్లలను వివిధ స్కూల్స్ నుంచి ఎంపిక చేసి నటనలో మెళకువలు నేర్పించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమాజంలోని ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీ తారక్. ‘‘ఈ సినిమా మీద వచ్చిన ప్రతి పైసా అనాథ పిల్లల సహాయార్థం ఉపయోగిస్తాం’’ అన్నారు ఎ.వి. వర్మరాజు. ‘‘నేను కూడా బాల నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు నటుడు తనీష్. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పాటల రచయిత దుర్గాప్రసాద్, విజయవాణి, ఎఫ్ఎమ్ బాబాయి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖను పర్యాటక రాజధాని చేస్తా
పమర్థతకు, నమ్మకానికి, విశ్వసనీయతకు వైఎస్జగన్ సర్కారు పెద్దపీట వేసింది. మంత్రివర్గ కూర్పులోనూ, విప్ల నియామకంలోనూ జిల్లాకు తగిన ప్రాధాన్యం కల్పించింది. మంత్రిమండలిలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ స్థానం శుక్రవారమే ఖరారు కాగా శనివారం ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడును ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇప్పటికే సమర్థుడిగా గుర్తింపు పొంది అమాత్య పదవి పొందిన అవంతికి పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. పర్యాటక స్వర్గధామమైన విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు అదే శాఖ కేటాయించడం విశేషం. విశాలమైన తీరప్రాంతం, ఎన్నోపర్యాటక స్థలాలు ఉన్న రాష్ట్రంలో వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయి.ఇక మొదటి నుంచి వైఎస్సార్సీపీ వెంట ఉండి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ఎమ్మెల్యే ముత్యాలనాయుడుకు ప్రభుత్వ విప్‌గా నియమించి సముచిత గౌరవం కల్పించారు.2014లో జిల్లా నుంచి ఎన్నికైన ముగ్గురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి ఫిరాయించనా.. బూడి మాత్రం అటువంటి వాటికి లొంగకుండా నైతిక విలువలకు కట్టుబడి వైఎస్జగన్ వెంటే నిలిచారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరు పొందారు. గత అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఉప నాయకుడిగా పని చేసిన ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్ హోదాలో మరింత గౌరవప్రదంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖమంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు తెలిపారు. మంత్రిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగుదేశం పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ రంగానికే అధిక ప్రాధాన్యమిచ్చిందని, పర్యాటక ఆదాయ వనరులను విస్మరించిందని ఆరోపించారు. తాను పర్యాటక రంగం ద్వారా ఆర్థిక వనరులు పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. విశాఖను ప్రపంచ పటంలో నిలిపేందుకు పాటుపడతానన్నారు. అలాగే నవ్యాంధ్రను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తానని అన్నారు. పర్యాటక రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయంతో పాటు వేలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందన్నారు. ఆ క్రమంలోనే ప్రాధాన్య శాఖ అయిన పర్యాటక శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించారని తెలిపారు. సీఎం ఏ నమ్మకంతో అప్పజెప్పారో ఆ మేరకు తాను శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. పర్యాటకాభివృద్ధికి రాష్ట్రంలో ఎన్నో అనువైన ప్రాంతాలున్నాయని, వాటిని గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. తనను మంత్రి చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. నేడు విశాఖకు అవంతి రాక.. మంత్రిగా తొలిసారి బాధ్యతలను స్వీకరించిన అవంతి శ్రీనివాస్ ఆదివారం విశాఖ నగరానికి వస్తున్నారు. అమరావతి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన రానున్నారు. ఉదయం 9 గంటలకు పాయకరావుపేట, 9.30 గంటలకు యలమంచిలి, 10 గంటలకు అనకాపల్లి, 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు కొత్త మంత్రికి ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతరం నగరంలోని మహిళా కళాశాల ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్కు వద్ద అభిమానులు, ఆత్మీయులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభను ముగించుకుని నగరంలోని మద్దిలపాలెంలో ఉన్న పార్టీ ఆఫీసును సందర్శిస్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం భీమిలిలోని పార్టీ ఆఫీసుకు చేరుకుంటారు. పర్యాటక శాఖ తొలిసారి.. విశాఖ జిల్లాకు పర్యాటకశాఖ దక్కడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఈ జిల్లాకు దేవాదాయ, పంచాయితీరాజ్, రోడ్లు, భవనాలు, అటవీ, సహకార, విద్య, మానవ వనరులు, గిరిజన సంక్షేమ శాఖ తదితర మంత్రి పదవులు లభించాయి. పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే విశాఖకు తొలిసారిగా పర్యాటక శాఖ ఇవ్వడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. అవంతి శ్రీనివాస్‌కు పర్యాటక శాఖ కేటాయించడం వల్ల విశాఖ నగరం, జిల్లా పర్యాటకరంగం మరింతగా అభివృద్ది చెందుతుందన్న ఆశాభావం అన్ని వర్గాల వారిలో కనిపిస్తోంది. -
ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు:అవంతి
-
పచ్చ గుట్టు.. పబ్లిగ్గా రట్టు!
అనకాపల్లి లాడ్జిలో ‘దేశం’ యవ్వారం నోట్ల పంపిణీకి ‘పెద్దల’ రహస్య వ్యూహం లాడ్జీలోనే ‘పచ్చచొక్కాల’ మకాం.. మంతనాలు ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీలు అప్పటికే పలాయనం అనకాపల్లి నుంచి ‘సాక్షి’ ప్రతినిధి : అనకాపల్లిలో తెలుగుదేశం గుట్టు లాడ్జి సాక్షిగా రచ్చకెక్కింది. పచ్చనోట్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు సాగుతున్నట్టు అక్కడి వాతావరణాన్ని బట్టి స్పష్టమవుతోంది. ఎంపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ సిండికేట్ తెరచాటున నడిపిన వ్యవహారం స్థానికుల అప్రమత్తత కారణంగా వెలుగు చూసింది. ప్రజాగ్రహం వెల్లువ కావడంతో పచ్చముఠా కంగుతింది. ముందే తోక ముడిచింది. ఫిర్యాదు అందడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు లాడ్జిని నిశితంగా సోదా చేయగా అనుమానాస్పద ఆధారాలు లభించినా, అసలు కథ మాత్రం అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. వారం రోజులుగా తెలుగు తమ్ముళ్లకు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో ఈ కథ చోటు చేసుకుంది. అసలేం జరిగింది? : అనకాపల్లిలోని ఓ లాడ్జి ముందుకు గత రాత్రి ఓ వాహనం వచ్చింది. ఆ వాహనంలో వచ్చిన వ్యక్తులు అందులోంచి కొన్ని బ్యాగులు, తెలుగుదేశం పార్టీకి చెందిన కరపత్రాలు, జెండాలు దించడాన్ని స్థానికులు గమనించారు. అనుమానంతో చుట్టపక్కల వా ళ్లు నిఘా పెట్టారు. రాత్రి 12 గంటల తర్వాత ఆ లాడ్జిలోని రూములోకి కొందరు దఫదఫాలుగా రావడం, చేతి సంచులతో వెళ్ళడం స్థానికుల కళ్లబడింది. లోపల టీడీపీ నేతలున్నట్టు తేలిం ది. చుట్టపక్కల చోటామోటా నేతలతో బేరాలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఎవరిని ప్రశ్నించి నా సంతృప్తికరమైన సమాధానం రాలేదు. శుక్రవారం ఉదయం కూడా మరో వాహనం రావ డం, మళ్ళీ బ్యాగులు లోనికి వెళ్లడం స్థానికుల దృష్టికి వచ్చింది. సందేహించిన జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అధికారు లు లాడ్జికి బయల్దేరారు. కానీ ఈ సమాచా రం ముందే లాడ్జిలో ‘ముఖ్యులకు’ చేరింది. దాంతో వారు ఆఘమేఘాల మీద లాడ్జి నుంచి పలాయనం చిత్తగించారు. టీడీపీ కరపత్రాలు, ఎన్నికల ప్రచార సామాగ్రిని మాత్రం వదిలేశారు. గంటా, అవంతి లింక్? లాడ్జీలో అణువణువూ శోధించిన పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. నోట్ల కట్టలపై ఉండే లేబుల్స్ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సందేహాలు కమ్ముకుంటున్నాయి. హడావిడిలో మరచిపోయిన సెల్‌ఫోన్‌ను పోలీసులు తనిఖీ చేసినట్టు తెలిసింది. అందులోంచి గంటాకు, అవంతికి గత రెండు రోజులుగా ఎక్కువసేపు కాల్స్ వెళ్లినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. లాడ్జిలో మకాం వేసిన ఇద్దరి కోసం పోలీసులు వెదుకులాట మొదలు పెట్టారు. ఈ లోగానే గంటా వర్గీయుల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు అనకాపల్లి రూరల్: పట్టణంలోని శ్రీనివాస లాడ్జిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెందిన వారు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. రెండురోజులుగా లాడ్జిలో ఈ తతంగం నడుస్తున్నట్టు స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసులు లాడ్జిలో సోదాలు నిర్వహించారు. ప్రతీ రూమ్‌లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. ఒక రూమ్ తాళాలు లేవని లాడ్జి సిబ్బంది బుకాయించారు. అయితే తాళాలు వెంటనే తెచ్చి రూమ్‌ను తెరవకపోతే లాడ్జిని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వెంటనే తాళాలు తెచ్చి రూమ్‌ను తెరిచారు. రూమ్‌లో తెలుగుదేశం పార్టీ కరపత్రాలు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లాడ్జి సిబ్బందిని ప్రశ్నించగా రామారావు అనే వ్యక్తి పేరు మీద ఒకరు రూమ్ తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు గురించి సీఐ చంద్రను ప్రశ్నించగా, నగదు దొరకనందున కేసు నమోదు చేయలేదని చెప్పారు. దాడుల్లో ఎన్నికల నియమావళి అమలు సిబ్బంది బి. సత్యనారాయణ, బి. వెంకటేశ్వరరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సిబ్బంది కె. రత్నాకర్, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
గంటా కొత్త పాట!
విలీన రాజకీయం శాటిలైట్ మున్సిపాలిటీగా మారుస్తానంటూ హామీ నాడు విలీనానికి సహకరించి..నేడు మాట మార్చి.. భీమిలి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వరం మారింది. ఇప్పటి వరకు ఎన్నికలకో నియోజక వర్గం, పార్టీలు మార్చే గంటా ఇప్పుడు హామీల్లో కూడా అదే బాటపడుతున్నారు. జీవీఎంసీలో భీమునిపట్నం మున్సిపాలిటీ విలీనానికి ప్రధాన కారకుడైన గంటా ఇప్పుడు మాట మార్చి.. మళ్లీ భీమిలిని మున్సిపాలిటీగా మారుస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారు. దీనిపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కుమ్మక్కు నిర్ణయాలు! జీవీఎంసీలో విలీనానికి ఆరంభం నుం చీ భీమి లి ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారు. స్థానిక పాలన ముగిశాక అధికారులపై స్థానిక నాయకుల ఒత్తిడి పెరిగింది. అప్పటి వరకు శాటిలైట్ నగరంగా తీర్చిదిద్దుతానంటూ హామీలు గుప్పించిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కూడా మాట మార్చారు. దీని వెనుక మాజీ మంత్రి గంటా హస్తముందని స్థానికుల నమ్మకం. అనకాపల్లి, భీమిలి విలీనానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే జీవీఎంసీలో 210, అనకాపల్లిలో కేవలం 20 అభిప్రాయాలు మాత్రమే వచ్చాయి. భీమిలి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా 258 లేఖలొచ్చాయి. ఇది తెలుసుకున్న భీమిలి నేతలు అప్రమత్తమయ్యారు. దీనికి జీవీఎంసీ అధికార యంత్రాంగం కూడా సహకరించింది. భీమిలి విలీనానికి అనుకూలంగా ఉన్నట్టు ఒకే విషయాన్ని వేల సంఖ్యలో ముద్రించి.. పేపర్ కింద ఆ నేతల అనుచరులతో సంతకాలు చేయించి జీవీఎంసీకి ఇచ్చేశారు. అప్పటి వరకు వంద కూడా రాని అభిప్రాయాలు ఏకంగా 3119కే చేరుకున్నాయంటే.. దీని వెనుక గంటా, అవంతిల హస్తం ఏపాటిదో స్థానికులు గుర్తించారు. అందుకే వీరి తీరుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. దీంతో పంచాయతీల విలీనం వెనక్కి జరిగి, వాటికి ఎన్నికలు కూడా నిర్వహించేశారు. వ్యతిరేకత తెలుసుకుని..! భీమిలి విలీన వ్యవహారంలో తనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలున్నాయన్న విషయాన్ని గుర్తించే ఇప్పుడు గంటా స్వరం మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికుల్ని శాంతింపజేసేందుకు మళ్లీ మున్సిపాలిటీగా చేస్తానంటూ హామీలు గుప్పిస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే జీవీఎంసీకి, భీమిలికి మధ్యనున్న పంచాయతీల్ని మినహాయించడంతో రెండు ప్రాంతాలకూ లింకు తెగింది. దీంతో భీమిలి విలీనాన్ని ఉపసంహరించుకునే దిశగా ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) ఇప్పటికే దీనిపై ఫైల్ కూడా సిద్ధం చేసింది. వీలైనంత వేగంగా భీమిలిని ఉపసంహరించి, ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదించింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధికార వర్గాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న గంటా ఇప్పుడు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకే భీమిలిని తిరిగి మున్సిపాలిటీ చేస్తానంటూ వాగ్దానాలు గుప్పిస్తున్నారని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఈ ఎన్నికల్లో మాత్రం భీమిలి విలీన ప్రహసనం గంటా కొంప ముంచడం ఖాయమని స్థానికులు జోస్యం చెప్తున్నారు. -
ఆరని సెగలు
టీడీపీలో అసమ్మతి చిచ్చు కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన పక్షులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కష్టపడినవారికి ఫలితం శూన్యమంటూ కింది స్థాయి కేడర్ సెగలు కక్కుతోంది. పార్టీలో ఎటువంటి పాత్ర పోషించని వారికి టికెట్లు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా శివాలెత్తిపోతున్నారు. ఎన్నికలకు పట్టుమని 20 రోజులే ఉన్నా..కొత్తగా వచ్చినవారికి, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారి మధ్య సయోధ్య మాత్రం కానరావడం లేదు. నర్సీపట్నం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ వలస పక్షులైన గంటా బృందం చేరికను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. మొదట్లో వీరి చేరికపై పత్రికల్లో పలుమార్లు దుమ్మెత్తి పోసిన అయ్యన్న, చంద్రబాబు సాక్షిగా విశాఖలో జరిగిన ప్రజా గర్జనలో సైతం అదే తరహాలో గంటాకు చురకలు అంటించారు. ఆ తరువాత కాస్త సెలైంట్‌గా ఉన్నారనిపించినా మళ్లీ ఆయ్యన్న శివాలెత్తారు. మంగళవారం నర్సీపట్నం వచ్చిన అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌పై అయ్యన్న ఒంటికాలుపై లేకవడంతో అసమ్మతి చిచ్చు తిరిగి రాజుకున్నట్టయింది. అనకాపల్లి ఎంపీ టిక్కెట్ తన తనయుడు విజయ్‌బాబుకు ఇవ్వాలని అయ్యన్న పలుమార్లు చంద్రబాబును కోరారు. అయితే ఈ సీటు గంటా బృందంలో సభ్యుడైన అవంతి శ్రీనివాసరావుకు కేటాయించడంతో అయ్యన్న అవాక్కయ్యారు. ఇదేకాకుండా యలమంచిలిలో ఎప్పట్నుంచో పనిచేస్తున్న వారిని కాదని ఆ ప్రాంతానికి పరిచయం లేని పంచకర్ల రమేష్‌బాబుకు టిక్కెట్ ఇచ్చారు. ఇలా ప్రతికూల పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న అయ్యన్నకు తన నామినేషన్ కార్యక్రమం ఓ వేదికగా ఉపయోగపడింది. ఉదయమే వచ్చిన అవంతిని చూసి ‘ఎందుకు వచ్చారని’ ప్రశ్నించారు. ఎవర్ని సంప్రదించకుండా ‘ఆయన ఎవరికి టిక్కు పెడితే వారికి మేము పనిచేయడమేనా?’ అని నిలదీశారు. యలమంచిలి గురించి ఏం తెలుసని పంచకర్లకు ఆక్కడ టిక్కెట్టు కేటాయించారని ప్రశ్నించారు. నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి ఎంపీకి పనిచేసేదీ?లేనిదీ? చెబుతామని తేల్చిచెప్పారు. మరొకడుగు ముందుకేసి ‘మీరు ఇక్కణ్ణుంచి వెళితే మేం నామినేషన్ కార్యక్రమానికి వెళ్తామ’ని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న అవంతి, మీరు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుని ఎమ్మెల్యేగా గెలుపొంది, రాబోయే టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేరాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. దీనిపై స్పందించిన అయ్యన్న ‘నేను గెలిచినా, మీ గ్రూపు సభ్యులు నన్ను మంత్రిని చేసేందుకు అంగీకరిస్తారా?’ అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో భంగపడిన అవంతి శ్రీనువాసరావు ఇంటిదారి పట్టారు.