
పవన్ కల్యాణ్‌కు కనీస పరిజ్ఞానం లేదని, మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో పవన్‌కు తెలుసా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దుయ్యబట్టారు.
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్‌కు కనీస పరిజ్ఞానం లేదని, మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో తెలుసా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నా మాటలను పవన్ వక్రీకరించి చెప్పారు. నేను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదు. నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు?. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి పవన్’’ అంటూ మండిపడ్డారు.
‘‘పవన్ ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు బూట్లు నాకుతున్నారు. బ్రో సినిమాతో డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ ఎందుకు మాట్లాడరు?. విశాఖను ఏం చేయాలనుకుంటున్నారో పవన్ చెప్పాలి. నువ్వు సీఎం అభ్యర్థివి అని చంద్రబాబుతో చెప్పించగలవా?. పవన్ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారు’’ అని ఎంపీ నిప్పులు చెరిగారు.
చదవండి: శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘‘కనీసం ఎమ్మెల్యేగా కూడా పవన్ గెలవలేకపోయారు. ఎంపీగా గెలిచిన నా గురించి పవన్ మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకుడి లక్షణం ఒక్కటి కూడా పవన్‌కు లేదు. సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరు. వీధి రౌడీకి, పవన్‌కు తేడా లేదు’’ అంటూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ధ్వజమెత్తారు.