
Tanish Appears Before ED: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతుంది. హీరో తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై తనీష్‌ను ఈడీ ప్రశ్నించనుంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలుపై కూడా ఆరాతీయనుంది. అంతేకాకుండా ఎఫ్ క్లబ్‌తో ఉన్న పరిచయాలపై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు.
ఇప్పటికే తనీష్‌కు నోటీసులు జారీ చేసిన ఈడీ బ్యాంకు ఖాతాలను వెంట తేవాలని పేర్కొంది. కెల్విన్ సమక్షంలో తనీష్‌ను సుధీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో 2017లో తనీష్ ఎక్సైజ్ విచారణను సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఇప్పటికే 10మంది సినీ ప్రముఖులను ఈడీ విచారించింది.