టాలీవుడ్ డ్రగ్ కేసు, మనీలాండరింగ్ కేసులో హీరో రానా దగ్గుబాటి విచారణ ముగిసింది. రానా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బుధవారం ఉదయం హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. బ్యాంకు ఖాతాలతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను రానా తన వెంట విచారణకు తీసుకొచ్చారు. ఆడిటర్స్, అడ్వకేట్స్‌తో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. PMLA కేసులో మొదటిసారి రానా పేరు తెరపైకి వచ్చింది. దీంతో మెదటిసారి సినీతారల డ్రగ్స్ కేసులో రానా విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
చదవండి: రానాపై ఈడీ ప్రశ్నల వర్షం..రెండు గంటలుగా విచారణ
ప్రధాన నిందితుడు కెల్విన్‌తో లావాదేవీలపై రానాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కెల్విన్ ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. మనీ లాండరింగ్ కోణంలో 2015 నుంచి 2017 వరకు రానా బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. ఇక ఎఫ్ క్లబ్ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో పాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.
చదవండి: ఆర్‌సీ 15 కాన్సెప్ట్ పోస్టర్‌కు డైరెక్టర్ ఎంత ఖర్చు పెట్టించాడో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment