Tollywood Drug Case Updates: Rana Daggubati To Appear Before ED- Sakshi
Sakshi News home page

Tollywood drug case: విదేశీ టూర్లు, ఎఫ్‌ క్లబ్‌ వ్యవహారాలపై కూపీ లాగుతున్న ఈడీ

Published Wed, Sep 8 2021 7:56 AM | Last Updated on Wed, Sep 8 2021 4:42 PM

Tollywood drug case: Actor Rana Daggubati To Appear Before ED - Sakshi

Rana Daggubati Appears Before ED: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణ కొనసాగుతుంది. సుమారు రెండు గంటలకు పైగా ఈడీ అధికారులు రానాను విచారిస్తున్నారు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రానాను ప్రశ్నిస్తున్నారు. విదేశీ టూర్లు,మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ  అధికారులు కూపీ లాగుతున్నారు.అంతేకాకుండా ఎఫ్ క్లబ్ వ్యవహారాల్లో నవదీప్,రకల్‌తో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీయనుంది.


బ్యాంకు ఖాతాలతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను రానా తన వెంట తీసుకొచ్చారు.  ఆడిటర్స్‌, అడ్వకేట్స్‌తో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.PMLA కేసులో మొదటిసారి రానా పేరు  తెరపైకి వచ్చింది. దీంతో మెదటిసారి సినీతారల డ్రగ్స్ కేసులో రానా విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో 2017 జరిపిన ఎక్సైజ్‌ విచారణలో రానా,రకుల్‌ల పేర్లు  తెరపైకి రాలేదు. అయితే డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో వారిద్దరికి నోటీసులు జారీ ఇచ్చారు.

ఇప్పటికే ఈ కేసులో రకుల్‌ ఈడీ ముందుకు హాజరు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరోయిన్స్‌ చార్మీ,రకుల్‌, నటుడు నందు ఈడీ విచారణను ఎదుర్కున్నారు. ఇంకా ఈ కేసులో ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి అన్నది చూడాల్సి ఉంది. 

చదవండి : కెల్విన్‌తో కలిపి నందు విచారణ
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement