
Raviteja Appears Before ED: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ)విచారణను ఎదుర్కోంటున్నారు. PMLA కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ ఎదుట హాజరయ్యారు.
గతంలోనూ వీరు ఎక్సైజ్ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కెల్విన్ నుంచి రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌కు డ్రగ్స్ సరఫరా అయినట్లు ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఎఫ్‌క్లబ్‌తో ఉన్న పరిచయాలు, విదేశీ టూర్లు, కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది.
మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్‌ను విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పూరి జగన్నాథ్, చార్మీ, రకుల్,నందు, రానాలను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే నందు, రానాలను డ్రగ్ అప్రూవర్ కెల్విన్ సమక్షంలో ఈడీ విచారించింది. దీంతో నేడు మరోసారి కెల్విన్ హాజరు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
చదవండి : Tollywood drug case: విదేశీ టూర్లు, ఎఫ్ క్లబ్ వ్యవహారాలపై కూపీ లాగుతున్న ఈడీ
టాలీవుడ్ డ్రగ్ కేసు: ముగిసిన రానా విచారణ