
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 రెండో వారం ఆసక్తికరంగా సాగుతోంది. తొలివారం వరకూ బాగానే ఉన్న హౌస్‌మేట్స్ రెండో వారాంతానికి గ్రూపులుగా విడిపోయారు. అంతేకాకుండా కంటెస్టెంట్ల మద్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. హోస్ట్ నానీ చెప్పినట్లుగానే ఏమైనా జరగొచ్చు.. ఇంకొంచెం మసాలా అన్నట్లుగానే సాగుతోంది. వీటన్నింటిని వివరిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శుక్రవారం విడుదల చేసిన ప్రోమో అందరినీ అలరించింది. ఈ ప్రోమోలో ఇంటి సభ్యుల మద్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
సామాన్యుల కోటా నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగిపెట్టిన నూతన్ నాయుడు, సామ్రాట్‌ల మద్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇంటిలోని వస్తువులను సక్రమంగా ఉంచట్లేదనే విషయంలో ఇద్దరు వాగ్వాదానికి తెలుస్తోంది. అంతేకాకుండా నూతన్‌నాయుడు, తనీష్‌ల మద్య కూడా గొడవ జరిగింది. ఇందులో నూతన్ నాయుడు ఎక్కువగా మాట్లాడకు అనగా.. స్పందించిన తనీష్ ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ దూసుకువచ్చారు. పక్కనే ఉన్న గణేష్, కౌషల్‌లు తనీష్‌ను ఆపే ప్రయత్నం చేశారు. వీటితో పాటు మేమేమి చేతులకు గాజులేసుకు కూర్చోలేదు అంటూ నూతన్ నాయుడు పేల్చిన మాటల తూటాలు నేటి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. వీరితో పాటు తేజస్వి, కౌషల్ మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది.
Comments
Please login to add a commentAdd a comment