బిగ్‌బాస్‌ : ‘కుక్క’ అంటే వింత అర్థం చెప్పిన కౌశల్‌! | Bigg Boss 2 Telugu Kaushal Gives Different Explanation | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 23 2018 11:09 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 Telugu Kaushal Gives Different Explanation - Sakshi

బిగ్‌బాస్‌ షో క్లైమాక్స్‌కు వచ్చేసింది. మిగిలింది ఇక ఒక్క వారమే. ఇక షో మరింత నాటకీయంగా మారే అవకాశం ఉంది. మిగిలిన ఆరుగురిలో ఈ ఆదివారం హౌస్‌లోంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు. సామ్రాట్‌ మాత్రమే డైరెక్ట్‌గా ఫైనల్‌కు వెళ్లగా, మిగిలిన ఐదుగురు ఎలిమినేషన్‌లో ఉన్నారు. అయితే ఎప్పటిలాగే బయటకు వచ్చిన లీకుల ద్వారా రోల్‌రైడా బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. 

ఇక​ నిన్నటి షోలో నాని అందరినీ ఓ రౌండ్‌ వేసేసుకున్నాడు. ఈ వారం జరిగిన కుక్క ఎపిసోడ్‌ మొత్తం తనకు అసంతృప్తిని మిగిల్చిందని తెలిపాడు. అందరూ ఒకేసారి అరవడమేంటని, ఎవరికి ఎదురైన సమస్యను వారే పరిష్కరించుకోవాలని హౌస్‌మేట్స్‌కు సూచించాడు. ఈ వారం బాగా ఎమోషన్‌ అయిన రోల్‌ రైడాను ఉద్దేశించి.. తాను అలా చేయడంతో అది పాజిటివ్‌గా గాకుండా నెగెటివ్‌గా వెళ్లిందని తెలిపాడు. అంతగా ఎమోషనల్‌ కావడానికి గల కారణాలేంటని అడగ్గా.. ఇంట్లో వారు గుర్తొచ్చారని, అమిత్‌ లేకపోయే సరికి ఇంకొంచెం ఎమోషనల్‌  అయ్యానని ఏదో తన కారణాలు వెల్లిబుచ్చాడు. 

ఇక తనీష్‌ను ఈసారి నాని గట్టిగానే వేసేసుకున్నాడు. సెలబ్రెటీలు అని మిమ్మల్ని లోపలికి పంపిస్తే.. మీరు చేయాల్సిందే ఇదేనా అంటూ ఫైర్‌ అయ్యాడు. ‘ఇక్కడ కాబట్టి బతికిపోయావ్‌.. అదే బయట అయితే సంగతి చూపిస్తానంటూ అన్నావ్‌.. ఇక్కడ ఇలాంటివి చేస్తే హౌస్‌లోంచి బయటకు పంపిస్తారు. అదే బయటైతే లోపలేసేస్తారం’టూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మొదట్నుంచీ తనకు సూచించేది అదేనని.. టెంపర్‌ తగ్గించుకోవడం లేదని.. అదే తనీష్‌కు మైనస్‌ అవుతోందని నాని సూచించాడు. ఇక ఇదే చివరి శనివారం అని, అటుపైన తాను చెప్పడానికి ఏమీ ఉండదని ఇంటిసభ్యులకు తెలిపాడు. కుక్క అనే మాట వినేసరికి తాను భరించలేకపోయానని అందుకే అంతలా రియాక్ట్‌ కావాల్సివచ్చిందని సామ్రాట్‌ తెలిపాడు. 

దీప్తి గ్రాఫ్‌ వారంవారం పెరుగుతోందని, టాస్క్‌ల్లో కూడా బాగా ఆడుతోందని అభినందించాడు. క్లారిటీగా మాట్లాడటం లేదంటూ, అందరూ కలిసి ఒకేసారి అరవడం వల్ల అక్కడి వాతావరణం చెడిపోతోందని చూసే ప్రేక్షకులకి కూడా విసుగుతెప్పించేలా ఆ ఎపిసోడ్‌ ఉందంటూ.. గీతనుద్దేశించి అన్నాడు. 

మళ్లీ వింత సమాధానం చెప్పిన కౌశల్‌.. 

బిగ్‌బాస్‌ కంటే పాపులర్‌ అయిన కంటెస్టెంట్‌ కౌశల్‌. బయట తనకు పెరిగిపోతోన్న పాపులారిటీతో ఓట్ల వర్షం కురుస్తోంది. అయితే ఎప్పుడూ వింత జవాబులు చెబుతూ.. తనను తాను డిఫెన్స్‌ చేసుకుంటూ.. తనకు మాత్రమే అర్థమయ్యేలా ఏవో కారణాలు చెప్పే కౌశల్‌.. నిన్నటి ఎపిసోడ్‌లో చెప్పిన కారణం చూస్తే జాలేస్తుంది. ఎందుకు కుక్క అని అరిచావు అని నాని అడిగితే.. ఏదో ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నాను అంటే సరిపోయేదానికి.. తన స్టైల్లో రీజన్స్‌ చెప్పే ప్రయత్నం చేశాడు. కుక్క అంటే.. కూర్చొని ఉండక కెవ్వు కెవ్వు అని అరిచేవాడనే అర్థంలో అలా అన్నానని, తనీష్‌ని క్యాట్‌ అని.. అంటే సిగరెట్‌ అపురూపంగా తాగేవాడు.. పోకిమాన్‌ అంటే గారాబాలు చేసే వ్యక్తి అని.. బిగ్‌బాస్‌లో ఇన్ని రోజులు మాతో ట్రావెల్‌ చేసింది కుక్క అని మేము పడుకుంటే కుక్క అరుస్తుందని.. ఇలా ఏదో తనకు తోచిన, నచ్చిన, వింత సమాధానాలు చెబుతుంటే..  సామ్రాట్‌ మధ్యలో కలగజేసుకుని.. ఏం మాట్లాడుతున్నారు? కౌశల్‌.. అని అన్నాడు. కౌశల్‌ సమాధానానికి అసహనానికి లోనైన నాని.. ఇదంతా ఎందుకు చెబుతున్నావు? ఫస్ట్రేషన్‌లో ఉండి అలా అన్నానని చెబితే సరిపోతుందని, దాన్నికూడా సపోర్ట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కౌశల్‌పై ఫైర్‌ అయ్యాడు. 

ఇక ప్రతీవారం ఎలిమినేషన్‌ నుంచి కాపాడడానికి ఓట్లు వేసే ప్రేక్షకులు.. ఈ వారం మాత్రం ఏ ఇంటి సభ్యుడు ఫైనల్‌ విన్నర్‌ కావాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేయండి అని నాని సూచించాడు. కేవలం ఓట్లు మాత్రమే ప్రాతిపదిక అయితే ఎవరు గెలుస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ​ బిగ్‌బాస్‌ మైండ్‌లో ఏముందో? ఫైనల్‌ విన్నర్‌ ఎవరు కానున్నారు? బయటినుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గి తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడా? చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement