డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని వర్ధమాన హీరో తనీష్ తెలిపారు. సోమవారం అబ్కారీ కార్యాలయంలో ఆయన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన తర్వాత తనీష్ విలేకరులతో మాట్లాడారు. మీడియాలో కథనాలు ప్రసారం చేసే ముందు ఒకసారి నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరాధారిత కథనాలతో తమ కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ భాగంగా ఆయనకు అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.