బయట కౌశల్ ఆర్మీ విజృంభిస్తుంటే.. లోపల మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. గత వారం ఎలిమినేట్ అయిన శ్యామలను నాని.. టాప్ త్రీలో ఎవరు ఉంటారని అడిగితే.. కౌశల్ పేరు చెప్పలేదు. అసలే కౌశల్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటారు. ఇక తమ అభిమాన కంటెస్టెంట్ పేరును చెప్పలేదని శ్యామలను విపరీతంగా ట్రోల్‌చేశారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన అమిత్ కూడా ఇదే బాటలో సాగుతూ.. రోల్‌రైడా, గీతా, సామ్రాట్ టాప్ త్రీలో ఉంటారని.. రోల్, సామ్రాట్ ఇద్దరిలో ఏవరైనా టైటిల్ గెలవాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
సోషల్ మీడియాలో కౌశల్‌కు సపోర్ట్‌గా భారీగానే మద్దతు లభిస్తోంది. అయితే అది పెయిడ్ క్యాంపెన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి పెయిడ్ క్యాంపెయిన్‌ల గురించి చాలానే చర్చ జరుగుతుంది. దీప్తి తరపున కూడా పెయిడ్ క్యాంపెన్ నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే రీసెంట్‌గా కౌశల్ ఫాలోవర్స్ నిర్వహించిన 2కే రన్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపైనా.. పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కౌశల్ విన్నర్ కావాలని, అవుతాడని సోషల్ మీడియా కోడై కూస్తుంటే.. హౌజ్‌మేట్స్ మాత్రం కౌశల్ పేరు అసలే ప్రస్తావించడం లేదు. వాళ్లు కావాలని అలా అంటున్నారో, ఏదైనా పథకం ప్రకారం మాట్లాడుతున్నారో తెలియదు కానీ కౌశల్ మాత్రం టాప్‌త్రీలో గాని, ఫైనల్‌లోగానీ ఉంటాడని పొరపాటున కూడా చెప్పడం లేదు.
బయట జరిగే టీవీ షోల్లో... పాల్గొనే వ్యక్తులు మాత్రం కౌశల్ విన్నర్ అవుతాడని చెప్పుకొస్తున్నారు. మాధవీలత, సంజన, యాంకర్ రష్మీ ఇలా ఎంతోమంది కౌశలే బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తాడని చెప్పుకొచ్చారు. నూతన్ నాయుడికి ఓట్లు ఎక్కువ వచ్చాయని, అయినా సరే కావాలనే నూతన్‌ను ఎలిమినేట్ చేశారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రజల ఓట్లకు వ్యతిరేకంగా బిగ్‌బాస్ నిర్ణయం తీసుకున్నాడని.. బిగ్‌బాస్‌పై ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఈ షోలో బిగ్‌బాస్ చెప్పిందే జరుగుతుంది.. చెయ్యాలనుకున్నదే చేస్తాడు.. కాబట్టి ఏదైనా జరుగొచ్చు. బయటి విషయాలతో సంబంధం లేకుండా బిగ్‌బాస్ వ్యవహరిస్తాడేమో చూడాలి. అయినా ఈ కార్యక్రమం కూడా చివరి అంకానికి చేరుకుంది కాబట్టి... ఇంకా షో లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. చివరకు ఎవరు మిగులుతారో.. ఎవరు టైటిల్ కొడతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment