బిగ్‌బాస్‌ : మరోసారి కౌశల్‌ టార్గెట్‌ | Bigg Boss 2 Telugu Kaushal Was Targeted Again By Housemates | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 24 2018 12:08 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 Telugu Kaushal Was Targeted Again By Housemates - Sakshi

ఆరో వారం తేజస్వీ ఎలిమినేట్‌ అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆసక్తి పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ వారం నామినేషన్‌లో భాగంగా ఒక ఇంటి సభ్యుడు తనకు ఇష్టంలేని మిగతా సభ్యుడిని ఎంచుకుని అందుకు గల కారణాలు తెలిపి అనంతరం వారి నెత్తిపై గుడ్డు పగలగొట్టాలని ఆదేశించాడు. తనీష్‌ కెప్టెన్‌ అయినందున అతని పేరును ఎవరూ చెప్పకూడదనీ బిగ్‌బాస్‌ ఆదేశించాడు.

ఇక ఎవరి నెత్తిపై అధిక గుడ్లు పగులుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ కౌశలే టార్గెట్‌ అయ్యాడు. అమిత్‌, రోల్‌ రైడా, తనీష్‌, నందిని, బాబు గోగినేని, గణేష్‌లు కౌశల్‌పై గుడ్లు పగలగొట్టారు. కౌశల్‌ వంతు వచ్చినప్పుడు నందిని, బాబు గోగినేనిపై గుడ్లు పగలగొట్టాడు.  

సోమవారం షోలో నందిని వర్సెస్‌ కౌశల్‌ హైలైట్‌గా నిలిచింది. తనకు అనవసరంగా అడ్వైజ్‌ చేస్తున్నాడని, ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ చేసానని ఎప్పటికీ గుర్తు చేస్తున్నాడంటూ కౌశల్‌ గురించి ఇంటి సభ్యులతో చెప్పుకుంటూ వచ్చింది. నామినేషన్‌ టైమ్‌లో కూడా నందిని ఇదే విషయం ప్రస్తావించి కౌశల్‌పై గుడ్డు పగలగొట్టింది. కాగా.. నందిని ఫ్రెండ్‌షిప్‌ విషయంలో మోసం చేసిందని, బాబు గోగినేని రాజమౌళి విషయంలో తప్పుగా మాట్లాడాడని, అందుకే నామినేట్‌ చేస్తున్నాని వారిద్దరిపై గుడ్లు పగలగొట్టాడు. అయితే దీనిపై బాబు గోగినేని ఇంటి సభ్యులతో చర్చిస్తూ.. అదంతా నటనా అని, రాజమౌళి అభిమానులు తనకు సపోర్ట్‌ చేయాలని అలా చేశాడని చెప్పుకొచ్చాడు.

అనూహ్య ఎంట్రీ.. అర్దరాత్రి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనూహ్యంగా ఓ కొత్త వ్యక్తి ప్రవేశించారు. ఆమె ఎవరో కాదు స్వామిరారా ఫేం పూజా రామచంద్రన్‌. అయితే ఆమె వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లేక యాంకర్‌ ప్రదీప్‌లా గెస్ట్‌ అన్న విషయం  మంగళవారం ఎపిసోడ్‌లో రివీల్‌ కానుంది. 

ఈవారం ఎలిమినేషన్‌ లేదు..
అయితే ఈ వారం హౌస్‌ మేట్స్‌ ఎలిమినేషన్‌ లేదని ఎపిసోడ్‌ చివర్లో బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ‘ఇన్ని వారాలు మీ పేవరేట్ హౌస్‌ మేట్స్‌ను సేవ్‌ చేయడానికి ఓట్లేశారు. కానీ ఈ వారం ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌లను మళ్లీ హౌస్‌లోకి పంపించడానికి ఓట్లేయబోతున్నారు.. సంజనా, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వీ ఇందులో ఎవరినైనా మీ ఓట్లతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించవచ్చు. ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌! ఏదైనా జరగొచ్చు’ అని నాని ప్రేక్షకులకు మరో అవకాశం ఇచ్చాడు. ఎలిమినేట్‌ అయిన వారి కోసం ఓటింగ్‌ లైన్‌ను ప్రారంభించినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అయితే తేజస్వీని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తీసుకునేందుకే మళ్లీ ఇలా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు 

తేజస్వీ సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్లోకి వచ్చి తనకు సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌కు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇక ఈ సందర్భంలో కొందరు తేజస్వీపై మండిపడగా, మరికొందరు సపోర్ట్‌గా నిలిచారు. పరిస్థితి కౌశల్‌ ఆర్మీ వర్సెస్‌ తేజస్వీ ఫ్యాన్స్‌గా మారిపోయింది. మరి ఇదంతా దాటుకుని తేజస్వీ ఇంట్లోకి అడుగుపెడుతుందా? లేక మరెవరైనా అడుగుపెడతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.. అసలే బిగ్‌బాస్‌ ఏదైనా జరగొచ్చు. 

బిగ్‌బాస్‌ : తేజస్వీ సంచలన వ్యాఖ్యలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement