సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ జలాల్లో సందడి చేసిన సీనియర్ మల్టిక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆర్మీ యాటింగ్ నోడ్ (ఏవైఎన్) సెయిలర్ జితేశ్ అదరగొట్టాడు. ఈఎంఈ సెయిలింగ్ సంఘం, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, భారత లేజర్ క్లాస్ సంఘం (ఎల్‌సీఏఐ) సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా ఆరు టైటిళ్లను జితేశ్ కైవసం చేసుకున్నాడు. లేజర్ స్టాండర్డ్ ఓపెన్ ట్రోఫీ, లేజర్ రేడియల్ ఓపెన్ ట్రోఫీ, ఎస్‌ఎస్‌సీ రోలింగ్ ట్రోఫీ, వైఏఐ కటారి బౌల్ అవార్డు, లెఫ్టినెంట్ కెల్లీరావు ట్రోఫీ, మేజర్ ఏఏ బాసిత్ ట్రోఫీలను అతను హస్తగతం చేసుకున్నాడు. దేశంలోని 17 ప్రముఖ సెయిలింగ్ క్లబ్‌లకు చెందిన మొత్తం 192 మంది సెయిలర్లు ఈ పోటీల్లో తలపడ్డారు.
ఇందులో 22 మంది మహిళా సెయిలర్లూ పోటీపడ్డారు. టోర్నీలో పాల్గొన్న వారిలో 68 ఏళ్ల మురళీ కనూరి, 13 ఏళ్ల అన్షురాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఓవరాల్ విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్‌సీఏఐ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, పతకాలను ప్రదానం చేశారు. లేజర్ స్టాండర్డ్ ఓపెన్ కేటగిరీలో జితేశ్ 16 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకోగా, హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్) 27 పాయింట్లతో రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ముజాహిద్ ఖాన్ (ఏవైఎన్) 33 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. లేజర్ స్టాండర్డ్ (అండర్–21) విభాగంలో శిఖర్ గార్గ్ (ఎన్‌ఎస్‌ఎస్, 90 పాయింట్లు), నాగార్జున (టీఎస్‌సీ, 133 పాయింట్లు), అథర్వ్ తివారీ (ఈఎంఈఎస్‌ఏ, 213 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమంలో ఈఎంఈఎస్‌ఏ వైస్ కమాండర్ టీఎస్‌ఏ నారాయణ్, షూటర్ గగన్ నారంగ్, రాష్ట్ర క్రీడా కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
లేజర్ రేడియల్
ఓపెన్: 1. జితేశ్ (ఏవైఎన్), 2. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్), 3. నేత్ర (టీఎన్‌ఎస్‌ఏ). మహిళలు: 1. నేత్ర (టీఎన్‌ఎస్‌ఏ), 2. రమ్య శరవణన్ (సీఈఎస్‌సీ), 3. జయలక్ష్మి (టీఎన్‌ఎస్‌ఏ). వైయు–19: 1. ఎన్. హేమంత్ (టీఎస్‌సీ), 2. సతీశ్ యాదవ్ (ఎన్‌ఎస్‌ఎస్), 3. నవీన్ (టీఎస్‌ఎస్‌ఏ). ఏఎం: 1. షరీఫ్ ఖాన్ (ఏవైఎన్), 2. సీడీఆర్ ఎంఎల్ శర్మ (ఐఎన్‌డబ్ల్యూటీసీ).
లేజర్ 4.7
ఓపెన్: 1. రమిలాన్ యాదవ్ (ఎన్‌ఎస్‌ఎస్), 2. రితిక (ఎన్‌ఎస్‌ఎస్), 3. సిఖాన్షు సింగ్ (టీఎస్‌సీ). అండర్–19 బాలురు: 1. సిఖాన్షు సింగ్ (టీఎస్‌సీ), 2. సంజయ్‌రెడ్డి (ఈఎంఈఎస్‌ఏ), 3. ఆశిష్ (ఎన్‌ఎస్‌ఎస్). అండర్–16 బాలికలు: 1. రితిక (ఎన్‌ఎస్‌ఎస్), 2. సంచిత (ఈఎంఈఎస్‌ఏ), 3. అశ్విని (ఈఎంఈఎస్‌ఏ). అండర్–18 బాలికలు: 1. సాన్య (ఈఎంఈఎస్‌ఏ), శ్రద్ధ వర్మ (ఎన్‌ఎస్‌ఎస్), 3. నిత్య (టీఎన్‌ఎస్‌ఏ). ఆర్‌ఎస్:ఎక్స్: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. డేన్ కోయిలో (జీవైఏ), 3. మన్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్). ఫిన్: 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. వివేక్ (ఏవైఎన్). 470 క్లాస్: 1. పీపీ ముత్తు–ఎస్‌సీ సింఘా, 2. అయాజ్–ఉప్‌కార్ సింగ్, 3. అతుల్ లిండే–సీహెచ్‌ఎస్‌రెడ్డి 470 యూత్: బినూబ్, అఖిల్ (టీఎస్‌సీ).
Comments
Please login to add a commentAdd a comment