రేపటి నుంచి సెయిలింగ్‌ శిబిరం | Sailing campaign starts tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సెయిలింగ్‌ శిబిరం

Published Sat, Mar 24 2018 10:26 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Sailing campaign starts tomorrow

సాక్షి, హైదరాబాద్‌: సెయిలింగ్‌ క్రీడపై ఆసక్తి ఉన్న చిన్నారులకు మంచి అవకాశం. వేసవిలో ఈ క్రీడపై పట్టు పెంచుకునేందుకు వీలుగా ఈఎంఈ సెయిలింగ్‌ ఆసోసియేషన్‌ (ఈఎంఈఎస్‌ఏ) శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. ఆదివారం నుంచి హుస్సేన్‌సాగర్‌లో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నారు. సెయిలింగ్‌లోని అన్ని విభాగాల్లో, అన్ని స్థాయిల్లోనూ ఏప్రిల్‌ 1 వరకు శిక్షణనిస్తారు. ఆసక్తి గల వారు ఆదివారం ఉదయం 11 గంటలలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం హుస్సేన్‌సాగర్‌ సమీపంలోని ఈఎంఈ సెయిలింగ్‌ క్లబ్‌ను సందర్శించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement