సాక్షి, హైదరాబాద్: మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనందర్ అధ్యక్షతనగురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగినఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రా పాలీ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాలు నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇంట్లో ఉన్న వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. డీజే సౌండ్స్ పోనుపోనూ శ్రుతి మించుతున్నాయని, గణేష్ పండుగే కాకుండా మిలాద్ ఉన్ నబిలోనూ డీజే నృత్యాలు విపరీతం అయ్యాయని అన్నారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని చెప్పారు.
డీజే శబ్దాలపై కంట్రోల్ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బ తింటాయన్నారు సీవీ ఆనంద్ డీజే శబ్దాలు కట్టడి చేయాలని కోరుతూ తమకు అనేక సంఘాల నుంచి వినతులువచ్చాయని అన్నారు. డీజేల వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా భద్రతకు ముప్పు ఉందన్నారు. అందుకే పలు వర్గాలను పిలిచామని, అందరి అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. తమ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment