sound pollution
-
డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు, ప్రభుత్వానికి నివేదిక: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనందర్ అధ్యక్షతనగురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రా పాలీ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాలు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇంట్లో ఉన్న వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. డీజే సౌండ్స్ పోనుపోనూ శ్రుతి మించుతున్నాయని, గణేష్ పండుగే కాకుండా మిలాద్ ఉన్ నబిలోనూ డీజే నృత్యాలు విపరీతం అయ్యాయని అన్నారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని చెప్పారు.డీజే శబ్దాలపై కంట్రోల్ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బ తింటాయన్నారు సీవీ ఆనంద్ డీజే శబ్దాలు కట్టడి చేయాలని కోరుతూ తమకు అనేక సంఘాల నుంచి వినతులువచ్చాయని అన్నారు. డీజేల వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా భద్రతకు ముప్పు ఉందన్నారు. అందుకే పలు వర్గాలను పిలిచామని, అందరి అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. తమ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
చెవుల్లో రీసౌండ్
ఓవైపు వాహనాల రొద.. హారన్ల మోత. మరోవైపు భవన నిర్మాణ చప్పుళ్లు, డీజేలు, లౌడ్‌స్పీకర్ల హోరు.. వెరసి రోజురోజుకూ భాగ్యనగరంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా నివేదిక ప్రకారం 78 డెసిబెల్స్ శబ్ద కాలుష్యంతో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీ పీసీబీ) గణాంకాల ప్రకారం నగరంలో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ లోపు శబ్దాలు ఉండాల్సి ఉంది.కానీ పరిమితికి మించి 10 నుంచి 20 డెసిబెల్స్ శబ్ద తీవ్రత అధికంగా నమోదవుతోంది. వాణిజ్య, పారిశ్రామికవాడలతో పోలిస్తే నివాస, సున్నిత ప్రాంతాల్లోనే రణగొణ ధ్వనులు పగలూరాత్రి అనే తేడా లేకుండా వెలువడుతున్నాయి. దీంతో ఇప్పటికే వాయు కాలుష్యంతో అనారోగ్యాల బారినపడుతున్న నగరవాసులను కొంతకాలంగా శబ్ద కాలుష్యం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు కూడా వెంటాడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ఉదాహరణకు..⇒ రెసిడెన్షియల్ జోన్ అయిన జూబ్లీహిల్స్‌లో ఏప్రిల్‌లో పగలు 68.71 డెసిబెల్స్ శబ్ద తీవ్రత నమోదవగా రాత్రివేళ 71.36 డీబీ నమోదైంది. ⇒ పారిశ్రామిక ప్రాంతమైన సనత్‌నగ ర్లో ఉదయం 66.40 డెసిబెల్స్‌గా ఉంటే రాత్రిపూట 66.58 డీబీగా ఉంది.⇒ వాణిజ్య ప్రాంతమైన జేఎన్టీయూ వద్ద పగలు 67.76 డీబీ ఉండగా.. రాత్రివేళ 67.57 డీబీ నమోదైంది. అలాగే సున్నిత ప్రాంతమైన జూపార్క్ వద్ద ఉదయం 56.88 డీబీ నమోదవగా.. రాత్రిపూట 52.20గా రికార్డయింది.కారణాలు అనేకం..⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్ల నిరంతరం హారన్లు మోగించడం⇒ ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనాల మోత⇒ 15 ఏళ్లకు మించిన వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంతో వాటి నుంచి వచ్చే అధిక శబ్దాలు.⇒ నివాసిత ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్ల నుంచి లౌడ్ స్పీకర్లు, డీజేల హోరు.⇒ నివాస ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, పబ్బుల ఏర్పాటుతో డప్పులు, డీజే సౌండ్లు⇒ భవన నిర్మాణాల కోసం తవ్వకాలు, బ్లాస్టింగ్లు, బోర్ల తవ్వకం, భారీ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం.⇒ పరిశ్రమల కోసం జనరేటర్ల వినియోగం.శబ్ద కాలుష్యంతో చుట్టుముట్టే అనారోగ్యాలు ఇవే..⇒ పరిమితికి మించి శబ్దాల విడుదలతో గుండె స్పందనల్లో భారీగా హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు.⇒ తలనొప్పి, చికాకుతోపాటు నిద్రలేమి, అలసట⇒ గుండెజబ్బులు, చెవుడు కూడా రావచ్చు.⇒ పిల్లల్లో కర్ణభేరిలో సూక్ష్మనాడులు దెబ్బతినే ప్రమాదం. వృద్ధులకు వినికిడి శక్తి తగ్గిపోయే అవకాశం.⇒ మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం.⇒ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.ప్రభుత్వ విభాగాలు విఫలం..నగరంలో పరిమితికి మించి నమోదవుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి (టీజీ పీసీబీ), ట్రాఫిక్ పోలీసులు, రవాణా, మున్సిపల్ శాఖలు విఫలమవుతున్నాయి. ఇతర నగరాల్లో ‘నో హాంకింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తుండగా మన నగరంలో ఈ తరహా కార్యక్రమాల ఊసే లేదు. భారీ శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించడానికి పరిమితమవుతున్నారు తప్పితే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదు. వాహనాల నుంచి వెలువడే అధిక శబ్దాలు, అక్రమ ఎయిర్ హారన్లను గుర్తించి జరిమానాలు విధించేందుకు పోలీసులు నగరంలోని ప్రధాన మార్గాల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి. -
ఆ శబ్దం వారికే వినిపిస్తుంది, వెంటాడుతుంది! వేలల్లో కేసులు నమోదు!
మీరెప్పుడైనా రాత్రి పూట చెవి చుట్టూ దోమ తిరగడం గమనించారా? అది తిరిగిన కాసేపు చిర్రెత్తుకొస్తుంది. లైటు వేసి దాన్ని చంపేదాకా నిద్రపట్టదు. కానీ ప్రపంచంలో చాలామందికి ఓ విచిత్రమైన కొత్తశబ్దాన్ని.. అసంబద్ధంగా వింటూ.. నిద్రకు దూరమవుతున్నారట. లైట్ తీసినా, వేసినా.. మెలకువగా ఉన్నా.. నిద్రపోయినా.. పోనీ ఆ చోటుని వదిలి ఎంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారు వినే ఆ శబ్దం.. తమ వెంట ఉన్నవారికి కూడా వినిపించకపోవచ్చు. అదే ‘ది హమ్’ మిస్టరీ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ కేసులు వేలల్లో నమోదయ్యాయి. శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య అస్పష్టమైన ఓ అలికిడి ఉంటుందని.. రాత్రివేళ దాన్ని స్పష్టంగా వింటున్నామని చెప్పే వాళ్లే ఈ మిస్టరీకి సృష్టికర్తలు. వీరిని ‘ది హియర్స్’ అంటారు. సాధారణంగా మనిషి చెవులు.. 20 ఏ్డ (తక్కువ పిచ్) నుంచి 20 జుఏ్డ (అత్యధిక పిచ్) మధ్య ఫ్రీక్వెన్సీలను గ్రహిస్తాయి. కానీ ‘ది హియర్స్’ మాత్రం తమకు ఇంకాస్త తక్కువ ఫ్రీక్వెన్సీలో అస్పష్టమైన నాయిస్ వినిపిస్తోందని వాదిస్తారు. వారు వినే శబ్దాన్ని.. అతి తక్కువ–ఫ్రీక్వెన్సీ హమ్మింగ్లా, రంబ్లింగ్ (దూరంగా ఉన్న పెద్దపెద్ద వాహనాల నుంచి వచ్చే ప్రతిధ్వని) నాయిస్‌గా భావించారు నిపుణులు. ప్రశాంతమైన నగరాల్లో, పల్లెటూళ్లలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ హమ్మింగ్‌కి బ్రిస్టల్ హమ్, టావోస్ హమ్, విండ్సర్ హమ్ వంటి పలు పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బ్రిస్టల్ హమ్.. ఇంగ్లాడ్‌లోని బ్రిస్టల్‌లో 1970లో తొలి కేసు నమోదైంది. అక్కడి నివాసితులు కొందరు.. రాత్రి పూట ఏదో శబ్దం నిద్రకు భంగం కలిగిస్తోందని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మొదట్లో ఈ హమ్ సమీపంలోని ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ పైలాన్లు కారణం అయ్యి ఉండొచ్చని భావించారట. అయితే మరికొందరు నివాసితులు.. ఆ శబ్దాలన్నీ గ్రహాంతర అంతరిక్ష నౌకల నుంచి వస్తున్నాయని భావించారు. ఇంకొందరైతే.. రహస్య సైనిక చర్యల్లో భాగం కావచ్చని నమ్మారు. అయితే చాలామంది ఈ హమ్ ఈ లోకానికి చెందినది కాదని, మరో లోకానికి సంబంధించిందని ప్రచారం చేశారు. కొన్ని నెలలకు ఆ హమ్ హఠాత్తుగా ఆగినట్లే ఆగి.. బ్రిట¯Œ లోని ఇతర ప్రదేశాలకు వినిపించడం మొదలైంది. అదే హమ్ని ఇప్పటికీ చాలామంది వింటూనే ఉన్నారట. టావోస్ హమ్.. ఇక అమెరికాలోని న్యూ మెక్సికోలో 1990లో ఈ హమ్ ఫిర్యాదులు మొదలయ్యాయి. అయితే ఈ హియర్స్ ఒకే రకమైన శబ్దాన్ని వినడం లేదని అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకమైన శబ్దాన్ని వింటున్నట్లు వివరించడం మొదలు పెట్టారు. దాంతో శాస్త్రవేత్తలు వారు నివేదించిన శబ్దాలను వినేందుకు.. వారి వారి ఇళ్లల్లో.. ప్రత్యేకమైన పరికరాలను కూడా అమర్చారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. శాస్త్రవేత్తలకు ఎలాంటి అసాధారణ కంపనాలు చిక్కలేదు. విండ్సర్ హమ్.. ఇంగ్లాడ్‌లోని విండ్సర్‌లో వినిపించే ఈ హమ్.. మొదటిగా ఎప్పుడు గుర్తించారో తెలియదు కానీ.. 2012 నుంచి ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విన్నవారంతా ఇది ఎక్కువ సేపు వినిపిస్తోందని.. బిగ్గరగా వినిపిస్తోందని వాపోతుంటారు. ఈ శబ్దం కిటికీలను కదిలిస్తోందని.. పెంపుడు జంతువుల్ని భయపెడుతోందని ఆరోపించారు. ఇది మానసికస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని మొరపెట్టుకు న్నారు. ఈ శబ్దాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు చేసినా.. ఆ శబ్దం వారిని వెంటాడుతూనే ఉందట. ఈ హమ్ కేసులో స్త్రీ పురుషులు సమానంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు.. తాము హమ్ కేసును పరిష్కరించామని.. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసునని చెప్పారు. పెద్ద పెద్ద అలల కారణంగా సముద్రపు అడుగుభాగం కంపించడమే ఈ హమ్మింగ్‌కు మూలమని ప్రకటించారు. అయితే ఆ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు ఖండించారు. సముద్రం లేని చోట కూడా ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయంటూ కొట్టిపారేశారు. ఇది ఒక మానసికమైన సమస్య అని కొందరు వైద్యులు చెబితే.. ఇది దూరంగా నడిచే ట్రాఫిక్ నుంచి కానీ, విమానాశ్రయాల నుంచి కానీ, నౌకాయానాల నుంచి కానీ, గాలి మరల నుంచి కానీ కావచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేశారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ఈ శబ్దానికి మిడ్‌షిప్‌మ్యాన్ ఫిష్ లేదా టోడ్ ఫిష్‌లు కారణం కావచ్చని భావించారు. ఈ చేపలు తన సహచరిని సంభోగానికి పిలుపునిచ్చినప్పుడు కొన్నిసార్లు చిన్నగానే హమ్మింగ్ చేస్తాయి కానీ.. కొన్నిసార్లు చాలా పెద్దగా ఎక్కువ సేపు హమ్మింగ్ చేస్తుంటాయట. అది సుమారు గంట ప్రక్రియ అని.. ఆ శబ్దాలే.. ఈ హియర్స్ చెవిన పడుతున్నాయని వాదించారు. మరోవైపు ఈ హమ్మింగ్ బాధితులకు కేవలం ఒత్తిడి, ఆందోళనల వల్లే అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయని ఇంకొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. ఏది ఏమైనా ఈ హమ్(శబ్దం) ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వినిపిస్తోంది? అనేది వినేవాళ్లకు కూడా తెలియకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
Hyderabad: గూబ గుయ్‌మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్‌రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్‌డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్‌కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్‌రెడ్డి -
రీజినల్ రింగ్‌రోడ్డులో వెదురుతో బారియర్.. సౌండ్‌పై వారియర్!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించనున్న హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డులో పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించే దిశగా జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కసరత్తు చేపట్టింది. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాల ధ్వనిని నియంత్రించే నాయిస్ బారియర్లుగా.. వాహనాలు అదుపుతప్పితే పక్కకు దొర్లిపోకుండా ఆపే క్రాష్ బారియర్లుగా వెదురును వినియోగించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. వేగంగా దూసుకెళ్లే వాహనాల ధ్వని నుంచి.. ఎక్స్‌ప్రెస్ వేలలో వాహనాలు వేగంగా దూసుకుపోతుంటాయి. వాటి నుంచి విపరీతంగా ధ్వని వెలువడుతూ ఉంటుంది. దానికితోడు హారన్లు కూడా మోగిస్తుంటారు. నివాస ప్రాంతాలకు దగ్గరగా హైవేలు ఉన్న ప్పుడు ఈ ధ్వనితో జనం ఇబ్బంది పడతారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు బెదిరిపోతుంటాయి. దీనికి పరిష్కారంగా రోడ్డుకు ఇరువైపులా ధ్వనిని అడ్డుకునే నాయిస్ బారియర్లను ఏర్పాటు చేస్తుంటారు. ధ్వనిని నియంత్రించే గుణమున్న పదార్థాలతో తయారైన మందంగా ఉన్న షీట్లను 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేస్తుంటారు. ఇది ఖర్చుతో కూడుకున్నది. పర్యావరణానికీ మంచిదికాదు. దీనికి పరిష్కారంగా రోడ్లకు ఇరువైపులా కొన్ని రకాల గుబురు చెట్లను నాటి ధ్వనిని నియంత్రించే విధానం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చింది. ఇలా ధ్వనిని నిరోధించే ప్రక్రియలో వెదురు బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే రీజనల్ రింగురోడ్డుపై నిర్ధారిత ప్రాంతాల్లో రెండు వైపులా ఫర్గేసియా రూఫా, ఫర్గేసియా స్కోబ్రిడా, ఫర్గేసియా రొబస్టా జాతుల వెదురును పెంచాలని భావిస్తున్నారు. ఐదు మీటర్ల ఎత్తు, కనీసం ఐదారు మీటర్ల వెడల్పుతో ఈ చెట్లను పెంచితే.. మూడు మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే పటిష్ట క్రాష్ బారియర్‌తో సమానమని నిపుణులు చెప్తున్నారు. కొన్ని హైవేల పక్కన వీటిని ప్రయోగాత్మకంగా నాటేందుకు ఎన్హెచ్ఏఐ ఇటీవల ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే ఈ వెదురుకు వేగంగా, మరీ ఎత్తుగా పెరిగే లక్షణంతో ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లోని విద్యుత్ వైర్లకు ఆటంకంగా మారొచ్చన్న సందేహాలు ఉన్నాయి. దీనిపై అధికారులు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. క్రాష్ బారియర్లుగా కూడా.. రోడ్డుపై అదుపు తప్పే వాహనాలు దిగువకు దూసుకుపోకుండా, మరో లేన్‌లోకి వెళ్లకుండా క్రాష్ బారియర్లు అడ్డుకుంటాయి. సాధారణంగా రోడ్లకు రెండు వైపులా స్టీల్ క్రాష్ బారియర్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వాటి స్థానంలో వెదురుతో చేసిన బారియర్ల ఏర్పాటుపై ప్రయోగాలు మొదలయ్యాయి. రీజనల్ రింగురోడ్డులో కూడా వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో పరిశీలన జరుగుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్–యావత్మాల్ జిల్లాలను జోడించే వణి–వరోరా హైవేలో ప్రపంచంలోనే తొలిసారిగా వెదురు క్రాష్ బారియర్లను 200 మీటర్ల మేర ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. బాంబూసా బాల్కోవా జాతి వెదురు దుంగలను క్రమపద్ధతిలో కోసి వాటిని క్రియేసాట్ నూనెతో శుద్ధి చేసి.. రీసైకిల్డ్ హైడెన్సిటీ పాలీ ఇథలీన్ పూతపూసి ఈ బారియర్లను రూపొందించారు. ఇండోర్‌లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షల అనంతరం వీటిని స్టీల్ క్రాష్ బారియర్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించొచ్చని తేల్చారు. రీజినల్ రింగురోడ్డులో వీటి ఏర్పాటుపై త్వరలో స్పష్టత రానుంది. వేగంగా భూసేకరణ.. రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరభాగానికి సంబంధించి 158.6 కిలోమీటర్ల మేర భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పరిహారం జారీ కోసం అవార్డ్ పాస్ చేయటంలో కీలకమైన 3డీ గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదలవుతున్నాయి. సంగారెడ్డి–తూప్రాన్ మధ్య 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున రెండు ప్యాకేజీలకు మరో నెల రోజుల్లో టెండర్లు జారీ కానున్నాయి. ఆ తర్వాత ఆరు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశముంది. దీంతో రోడ్డు డిజైన్లను ఖరారు చేసే పనిని ఎన్హెచ్ఏఐ సమాంతరంగా ప్రారంభించింది. ఇందులోభాగంగా ప్రయోగాత్మకంగా వెదురును వినియోగించాలని భావిస్తోంది. చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు! -
ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే?
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. రూల్స్ అతిక్రమించిన వారు ఎంతవారైనా వదిలిపెట్టే సమస్యే లేదని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గోవా నగరంలో ట్రాఫిక్ పోలీసులు 40 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా రహదారులపై నడిచే ఏ వాహనమైన తప్పకుండా మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలకు లోబడి ఉండాలి. అలా కాదని మోడిఫైడ్ చేసుకుని రోడ్లమీద తిరిగితే మాత్రం జరిమానాలు భారీగా చెల్లించాల్సి వస్తుంది. గోవాలో సీజ్ చేసిన వాహనాల ఎగ్జాస్ట్ మోడిఫై చేయబడ్డాయి. వాహనంలో కంపెనీ అందించే భాగాలు కాదని కొంతమంది తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు. ఇదే వారిని సమస్యల్లోకి నెట్టేస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన బైకులలో ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: Pakistan Crisis: చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో) మోడిఫైడ్ చేసిన ఎగ్జాస్ట్ సాధారణ బైకుల కంటే ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఇది ప్రజా రహదారుల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా అన్ని బైకులను సీజ్ చేసినట్లు మార్గోవ్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకులలో రాయల్ ఎన్ఫీల్డ్, ఇతర స్పోర్ట్స్ బైకులు ఎక్కువ శబ్దం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కొంతమంది బైక్ ప్రేమికులు తమ వాహనాలను మరింత మాడిఫైడ్ చేసుకోవడం వల్ల ఆ శబ్దం మరింత ఎక్కువవుతుంది. 80 డెసిబుల్స్ మించిన శబ్దాన్ని ఉత్పత్తి చేసే వాహనాలు చట్ట విరుద్ధం. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. -
Hyderabad Pubs: రాత్రి 10 గం. తర్వాత సౌండ్ ఆపాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పబ్‌ల్లో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఉదయం 6 గంటల వరకు వర్తిస్తుందని ఆదేశించింది. నేటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనలను పాటించకుండా పబ్‌లు నిర్వహిస్తున్నారని, నగరవాసులను రాత్రి ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ సహా మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము అధికారులకు విజ్ఞప్తి చేసినా ఆ పబ్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. విద్యా సంస్థలున్న చోట అనుమతి ఎలా ఇచ్చారు?.. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున హైకోర్టు న్యాయవాది కైలాష్‌నాథ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎలాంటి సౌండ్ పెట్టరాదని తేల్చిచెప్పింది. నగర పోలీస్ చట్టం, సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం.. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత సమయం వరకే అనుమతి ఉందని పేర్కొంది. ఇళ్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించిన న్యాయమూర్తి.. ఏ అంశాల ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించింది. పబ్‌లో రాత్రిపూట లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని సూచించింది. హైదరాబాద్ పరిధిలోని పబ్‌లపై ఇప్పటివరకు దాఖలైన కేసుల వివరాలను అందజేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేసేందుకు ఎన్నిటికి అనుమతి ఉంది.. తదితర వివరాలను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. -
Vizag: మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్.. నేరమని తెలియదా?
ఈ మధ్య రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లుపడే శబ్దంతో వెళుతున్న ద్విచక్రవాహనాలు ఎక్కువయ్యాయి. కంపెనీ నుంచి కొనేప్పుడు వాహనాలకు ఉన్న సైలెన్సర్లు (పొగ గొట్టాలు) తొలగించి వాటిని ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి దడపుట్టిస్తున్నారు. 90 శాతం వాహనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మనిషి సాధారణంగా 60 డెసిబుల్స్ శబ్దం వరకు వినగలదు. 120 డెసిబుల్స్ కన్నా ఎక్కువగా వినడం చెవుడుకు దారితీస్తుంది. ఆకతాయిలు చేస్తున్న ఇలాంటి న్యూసెన్స్‌పై పోలీసులు కేసులు నమోదు చేసి.. తగిన చర్యలు తీసుకుంటున్నారు. – దొండపర్తి(విశాఖ దక్షిణ) విశాఖ జిల్లాలో వాహనాల శబ్ద కాలువ్యం ఎక్కువైంది. రోడ్డుపైకి వెళ్లాలంటే వృద్ధులు, మహిళలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనం వేగం పెరిగితే అది వెలువరించే శబ్దం బాగా పెరుగుతుంది. శబ్దాన్ని డెసిబుల్స్‌లో కొలుస్తారు. మోటారు వాహనాల చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రతి వాహనం నిర్ణీత శబ్దాన్ని వెలువరించేలా, దాని సైలెన్సర్‌ను తీర్చిదిద్దుతారు. అలాంటి డిజైన్లకే రవాణా శాఖ అనుమతి ఇస్తుంది. కంపెనీ సైలెన్సర్లకు ఒక సీరియల్ నంబర్ కూడా ఉంటుంది. దాని ద్వారా కంపెనీ సైలెన్సర్‌ను గుర్తించవచ్చు. ఇలా కాకుండా వాటిలో ఏమైనా మార్పులు చేసినా, రవాణా శాఖ అనుమతి లేని వాటిని వాడినా శబ్ద తీవ్రత మారిపోతుంది. ఉలిక్కి పడాల్సిందే.. బుల్లెట్ వాహనాలు దర్జాకు ప్రతీకగా నిలుస్తున్నాయి. కేటీఎం కుర్రకారుకు క్రేజ్‌గా మారుతున్నాయి. అలాగే పాతబడ్డ యమహా ఆర్ఎక్స్ –100 వాహనాలకు రంగులద్ది రోడ్లపై తిప్పుతున్నారు. ఈ వాహనాల సైలెన్సర్లలో కొద్దిపాటి మార్పు చేస్తే అది వెలువరించే శబ్దం ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తూ.. ఎదుటివారి ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోకుండా రోడ్లపై వాహనాలను నడుపుతుండడం దడ పుట్టిస్తోంది. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లలో కొంత మంది మార్పులు చేస్తుంటే.. మరికొంత మంది దానిని పూర్తిగా మార్చేసి అధిక శబ్దం వచ్చే వాటిని బిగించుకుంటున్నారు. ఇది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరమని గుర్తించలేకపోతున్నారు. బుల్లెట్, ఆర్ఎక్స్–100 లాంటి వాహనాల నుంచి ఒక్కోసారి బాంబు పేలిన శబ్దం వస్తుంటుంది. యువత దీన్ని క్రేజ్‌గా భావిస్తున్నారు. వాహనం రన్నింగ్‌లో ఉన్నప్పుడు దానిలో కొన్ని మార్పులు చేస్తే బుల్లెట్ సైలెన్సర్ నుంచి బాంబు పేలిన శబ్దం వస్తుంది. పక్క నుంచి వెళ్తూ ఒక్కసారిగా ఇలాంటి శబ్దం వస్తే ఎంతటి వారైనా ఉలిక్కిపడాల్సిందే. గుండె జబ్బులున్న వారిపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కో సైలెన్సర్ ఒక్కో శబ్దం ద్విచక్రవాహనాలకు రకరకాల సైలెన్సర్లు బిగిస్తున్నారు. ఒక్కో మోడల్ సైలెన్సర్ ఒక్కో రకమైన శబ్దం విడుదల చేస్తుంది. దాన్ని బట్టి వాటికి ప్రత్యేకమైన పేర్లు పెట్టారు. అడవి పంది అరుపులా ఉంటే దానికి వైల్డ్బోర్ ఎగ్జాస్ట్ అన్ని పేరు పెట్టారు. మరొకటి మర తుపాకీలా గిర్రున తిరుగుతూ శబ్దం వెలువరిస్తే దానిని ‘టెయిల్ గన్నర్’ అంటారు. వీటితో పాటు బ్యారెల్, గ్రీసెస్, మెగా ఫోన్, కాక్టైల్ షార్మర్, ఇండోరి, పంజాబీ, డాల్ఫిన్, ఆర్ఆర్ఓ పేరిట స్పేర్‌పార్ట్ దుకాణాల్లో సైలెన్సర్లు లభిస్తున్నాయి. సైలెన్సర్ మార్చినా.. మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు నమోదు చేస్తారు. కొంత మంది నిబంధనలను ఉల్లంఘించి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు తీసేసి వేరే వాటిని బిగిస్తున్నారు. మరికొందరు కంపెనీ సైలెన్సర్లు ఉంచినా దానిలో ఉండే పలు ఫిల్టర్లు తీసేస్తున్నారు. దీని వల్ల శబ్ద తీవ్రత పెరుగుతుంది. ఇది కూడా నేరమే అంటున్నారు పోలీసు అధికారులు. ఇలాంటి ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. చట్టం ఏ చెబుతుందంటే.. ► ఒక వాహనం నిర్ణీత డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం సృష్టిస్తే అది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం. ► నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనంపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయవచ్చు. ► సంబంధిత వాహన చోదకుడికి రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేయవచ్చు. ► రెండోసారి శబ్ద కాలుష్యానికి కారణమైతే రూ.2 వేల వరకు జరిమానా విధిస్తారు. తీవ్రత పెరిగిందా జబ్బులు ఖాయం మనం వింటున్న శబ్ద తీవ్రత పెరిగే కొద్దీ జబ్బులు ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. 100 డెసిబుల్స్ దాటిన ఏ శబ్దమైనా గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ► 110 డెసిబుల్స్ దాటితే.. చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది. ► 120 డెసిబుల్స్ దాటితే.. చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది. ► 160 డెసిబుల్స్ దాటితే.. చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతిని కొంతస్థాయిలో శాశ్వతంగా వైకల్యం ఏర్పడుతుంది. ► 190 డెసిబుల్స్ దాటితే.. కర్ణ భేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపుస్థితి తీసుకురావడం చాలా కష్టం. అవగాహన కల్పిస్తున్నాం.. వినకపోతే కేసులు పెడతాం వాహనాలకు సైలెన్సర్లు మార్చడం చట్టరీత్యా నేరం. దీనికి తోడు రోడ్లపై ఇష్టం వచ్చిన రీతిలో వాహనాల ద్వారా సౌండ్ చేస్తూ వెళ్లడం న్యూసెన్స్ అవుతుంది. వీటిపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. ఇప్పటికే ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవలే ఇటువంటి వాహనాల సైలెన్సర్లను తొలగించడం జరిగింది. వాహనదారులు కంపెనీ సైలెన్సర్లు మాత్రమే ఉంచుకోవాలి. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. - సి.హెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ సాధారణ ధ్వని స్థాయి 60 నుంచి 70 డెసిబుల్స్. నమోదవుతున్న ధ్వని స్థాయి 80 నుంచి 120. ఫలితంగా జాతీయ రహదారులు, నగరంలోని ప్రధాన రహదారుల పక్కన నివసిస్తున్న వారి చెవులు చిల్లులు పడుతున్నాయి. ఉదయం 8 గంటల మొదలు రాత్రి 10 వరకు వాహనాల శబ్దాలు హడలెత్తిస్తున్నాయి. (క్లిక్: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు) -
నేను..సీవీ ఆనంద్‌ను మాట్లాడుతున్న..
బంజారాహిల్స్: తన నివాసిత ప్రాంతం చుట్టుపక్కల రాత్రిపూట శబ్ద కాలుష్యం నెలకొందని చర్యలు, తగిన తీసుకోవాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు కొద్దిసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న ప్లజెంట్ వ్యాలీలో నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం పెరగడంతో ఆయన వెంటనే 100కు డయల్ చేశారు. నైట్‌డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడికి వెళ్లి పరిశీలించగా సమీపంలోని ఓం నగర్ బస్తీలో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తూ డప్పులు వాయిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే నిర్వాహకులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని 70బి కింద పెట్టీ కేసు నమోదు చేశారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. స్వయంగా సీపీ 100కు డయల్ చేయడం అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. (చదవండి: పెట్స్.. అదో స్టేటస్! ) -
హైదరాబాద్: సైలెంట్ జోన్స్.. నో హారన్ ప్లీజ్
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాల నేపథ్యంలో నగరంలో వాహనాల ద్వారా ఏర్పడుతున్న శబ్ధ కాలుష్యాన్ని నిరోధించడంపై సిటీ ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటించనుంది. వీటిలో నో హాకింగ్ విధానాన్ని అమలు చేస్తూ హారన్లు మోగించడం నిషేధించడానికి కసరత్తు చేస్తోంది. వీటిని అతిక్రమించే ఉల్లంఘనులకు గుర్తించి, చర్యలు తీసుకోవడానికి అకోస్టిక్ కెమెరాలు వినియోగించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎకోమ్ సంస్థకు చెందిన వీటి పనితీరును బుధవారం ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ పరిజ్ఞానం దేశంలోనే తొలిసారిగా నగరంలో వాడనున్నారు. -సాక్షి, హైదరాబాద్ మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాల హారన్, సైలెన్సర్లు 80 డెసిబుల్స్ వరకు శబ్ధం చేయవచ్చు. ఈ పరిమితిని దాటి శబ్ధం చేసే ఫ్యాన్సీ హారన్లు, వాహనాల సైలెన్సర్లపై ఇప్పటికే ఆడియో మీటర్లను వినియోగించి ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కొందరు వాహన చోదకులు వినియోగిస్తున్న హారన్లు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ ఇతరులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రధానంగా జంక్షన్ల వద్ద ఆగి ఉన్నప్పుడు, సిగ్నల్ రెడ్ లైన్ నుంచి గ్రీన్ లైట్లోకి మారిన వెంటనే హారన్లు మోగిస్తుండటంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని గమనించిన మంత్రి కేటీఆర్ నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల ట్రాఫిక్ వింగ్‌కు ఆదేశాలు ఇచ్చారు. జర్మనీ పరిజ్ఞానంతో తయారైన కెమెరాలు... హారన్లు, సైలెన్సర్ల ద్వారా శబ్ధకాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను గుర్తించే అకోస్టిక్ కెమెరాలను ప్రస్తుతం దేశంలోని ఏ పోలీసు విభాగమూ వాడట్లేదు. ఫ్రాన్స్‌కు చెందిన ఎకోమ్ కంపెనీ జర్మనీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది. ప్రస్తుతం ఇజ్రాయిల్, చైనా, మలేషియా సహా కొన్ని మూడో ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉంది. వీటి పరితీరును సంస్థ ప్రతినిధి ప్రతీక్ ట్రాఫిక్ విభాగం అధికారులతో పాటు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణులకు వివరించారు. చతురస్రాకారంలో ఉండి రెండు చేతులతోనూ పట్టుకుని వినియోగించే ఈ కెమెరా ముందు వైపు మానిటర్, వెనుక వైపు 72 మైక్రోఫోన్లు ఉంటాయి. వీటి సహాయంతో సదరు కెమెరా గరిష్టంగా 20 మీటర్ల దూరంలో ఉన్న వాహనాల నుంచి వెలువడే శబ్ధ కాలుష్యాన్ని గుర్తిస్తుంది. కనిష్టంగా 20 డెసిబుల్స్ నుంచి గరిష్టంగా 20 వేల డెసిబుల్స్ వరకు వెలువడే శబ్ధాలను గుర్తించి ఈ వాహనం వీడియో, ఫొటో తీస్తుంది. మానిటర్లో శబ్ధం వెలువరిస్తున్న వాహనం చుట్టూ ఎర్ర రంగులో వలయం కనిపిస్తుంటుంది. ఏఎన్పీఆర్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం... ఎకోమ్ సంస్థ బుధవారం డెమో ఇచ్చిన కెమెరా ద్వారా శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న వాహనాన్ని గుర్తించడంతో పాటు అది ఏ స్థాయిలో శబ్ధాన్ని చేస్తోందో తెలుసుకోవచ్చు. ఆపై దీన్ని వాడే ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనం దగ్గరకు వెళ్లి మాన్యువల్‌గా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది కష్టసాధ్యం, ఇబ్బందికరమని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకోస్టిక్ కెమెరాలను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టంతో (ఏఎన్పీఆర్) అనుసంధానించాలని నిర్ణయించారు. ఇలా చేస్తే జంక్షన్లలో ట్రాఫిక్ కెమెరాలతో కలిసి ఉండే అకోస్టిక్ కెమెరాలు శబ్ధ కాలుష్యానికి కారణమైన వాహనంతో పాటు దాని నంబర్‌ను గుర్తిస్తుంది. ఆ వాహనచోదకుడికి ఈ–చలాన్ పంపడంతో పాటు న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి అవసరమైన ఆధారాలను అందిస్తుంది. ఈ విధానం ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో ఉందని, నగరంలో వాడుతున్న ఏఎన్పీఆర్ వ్యవస్థతో అనుసంధానంపై శుక్రవారం జరగబోయే రెండో దశ సమావేశంలో పూర్తి స్పష్టత ఇస్తామని ఎకోమ్ సంస్థ ప్రతినిధి ట్రాఫిక్ చీఫ్‌కు తెలిపారు. కాగా ఈ కెమెరా ఖరీదు రూ.13 లక్షలని అధికారులు తెలిపారు. -
వాహనాల ధ్వని కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాహనాల కారణంగా నానాటికీ పెరిగిపోతున్న ధ్వని కాలుష్యం తగ్గింపుపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. దీని నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీటిని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు సిటీ ట్రాఫిక్ అదనపు సీపీ సభ్యులుగా ఉన్నారు. మార్గదర్శకాలు రూపొందించడంపై ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న, భయంకరమైన శబ్ధాలు చేసే సైలెన్సర్లు, హారన్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధి విధానాల కోసం కసరత్తు చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ట్రాఫిక్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఆర్టీఏ, కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ విభాగాల అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. రాజధానిలో సంచరిస్తున్న వాహనాల హారన్లతో పాటు సైలెన్సర్ల మార్పు చేర్పుల ద్వారా తీవ్రమైన ధ్వని కాలుష్యం ఏర్పడుతోందని పోలీసులు గుర్తించారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ఓ వాహనం హారన్ గరిష్టంగా 93 నుంచి 100 డెసిబుల్స్ మధ్య మాత్రమే శబ్ధం చేయాలి. అలాగే ఆయా వాహనాల ఇంజిన్లు, సైలెన్సర్లు సైతం ఎంత శబ్ధం చేయవచ్చనేది స్పష్టంగా నిర్ధేశించి ఉంది. (క్లిక్: కేబీఆర్ పార్కు: చీకటి పడితే భద్రత దైవాధీనం) అయితే ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న వాహనచోదకులు పరిమితికి మించి శబ్దాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, బుల్లెట్ వంటి వాహనాలు మాత్రమే కాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు, కాలేజీలు, స్కూళ్ళకు విద్యార్థుల్ని తరలించే వాహనాలు సైతం కర్ణకఠోరమైన శబ్ధాన్ని విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్ హారన్స్, మల్టీ టోన్ హారన్స్, మోడిఫైడ్ సైలెన్సర్ల కారణంగా, అనవసరంగానూ మోగిస్తున్న హారన్ల వల్లే ఇలా జరుగుతోందని అధికారులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం రంగనాథ్ నేతృత్వంలో రోడ్లపైకి వచ్చిన అధికారులు వివిధ వాహనాలతో పాటు ప్రధానంగా బస్సులపై దృష్టి పెట్టారు. సౌండ్ లెవల్ మీటర్ల సాయంతో ఏఏ వాహనాలు, ఏ స్థాయిలో ధ్వనికి కారణమవుతున్నాయో గుర్తిస్తున్నారు. (క్లిక్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?) సమగ్ర నివేదికలు సమర్పిస్తాం: హాకింగ్ ఫ్రీ సిటీ అమలే మా లక్ష్యం. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న వాహనాలకు కంపెనీలు అందిస్తున్న హారన్లు, సైలెన్సర్ల వద్ద వెలువడుతున్న శబ్ధంతో పాటు పాటు మార్పుచేర్పుల ద్వారా వస్తున్నదీ అధ్యయనం చేస్తున్నాం. కార్ డెకార్స్ సంస్థల యజమానులు, మార్పులు చేసే మెకానిక్స్, వివిధ కార్లు, బైకులు విక్రయించే డిస్ట్రిబ్యూటర్లు, ట్రావెల్ ఏజెన్సీలతో సోమవారం సమావేశమయ్యాం. జాతీయ రహదారులపై ఎయిర్ హారన్లు తప్పనిసరని కొందరు చెబుతున్నారు. వారు సిటీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ధ్వని కాలుష్య అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించి కమిటీకి సమర్పిస్తాం. దాని నిర్ణయం మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఖరారు చేస్తాం. ప్రస్తుతం సిటీ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఐదు సౌండ్ లెవల్ మీటర్లు ఉన్నాయి. త్వరలో మరిన్ని ఖరీదు చేయనున్నాం. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ చీఫ్ -
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనే ఎక్కువ!
మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం... హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాల డ్రైవింగ్... రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాలకు గురికావటం... సిగ్నల్ జంపింగ్... సీటు బెల్టు ధరించకపోవడం... వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించకపోవడం ఇలాంటివన్నీ ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకం. ప్రాణాంతం కూడా. పోలీసులు ఎంత చెప్పినా.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఉల్లంఘనులు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భారీగా ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన’ల కేసులు నమోదు చేశారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రాత్రి 9 నుంచి 11 గంటల వరకు 3 గంటల పాటు ఈ డ్రైవ్ చేపట్టారు. ఇందులో అధికంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపైనే దృష్టిసారించారు. మద్యం సేవించి వాహనాలపై వెళ్లే ప్రాంతాలను గుర్తించి అక్కడే రోజూ ఈ తనిఖీలు నిర్వహించారు. (చదవండి: హైదరాబాద్ పోలీస్.. టార్గెట్ న్యూ ఇయర్ పార్టీస్!) బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 7024 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న 14 మందితో పాటు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 1794 మందిపై కేసులు నమోదు చేశారు. (చదవండి: రోడ్డు ప్రమాదం.. నిందితుడిని అరెస్టు చేయరా?) ► సక్రమంగా నంబర్ ప్లేట్ లేని 81 మంది, ట్రిబుల్ రైడింగ్ చేస్తున్న 50 మందిపై కేసులు నమోదు చేశారు. ► నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 33 మందిపై కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 54 కేసులు నమోదయ్యాయి. ► రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తూ 105 మంది పట్టుబడ్డారు. ► ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించిన ఇంకో 1640 మందిపై కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 589 కేసులు నమోదయ్యాయి. ► డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 70 నమోదు కాగా మైనర్లు వాహనాలు నడుపుతూ ఒకరు పట్టుబడ్డారు. ► నంబర్ ప్లేట్సరిగా లేని 35 మందిపై హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న 71 మందిపై కేసులు నమోదు చేశారు. ► సంబంధం లేని ఇతరులకు వాహనాలు ఇచ్చి నడిపిస్తుండగా అలా 57 మందిపై కేసులు నమోదు చేశారు. ► సైలెన్సర్లు మార్చి అధిక శబ్ధంతో వాహనాలు నడుపుతున్న ఏడు మందిపై కేసులు నమోదు చేశారు. ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఒకరిపై కేసు నమోదైంది. -
పగలు, రాత్రి తేడా లేదు.. మోత మోగిపోతోంది
సాక్షి, హైదరాబాద్: నగరంలో ధ్వని కాలుష్యం పెరుగుతోంది. పగలు, రాత్రి తేడా లేదు. మోత మోగిపోతోంది. నివాస, వాణిజ్య ప్రాంతాలు, ఆసుపత్రులు, పార్కులు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో సైతం శబ్దాలు పెరుగుతున్నాయి. ఇది వాహనాలకే పరిమితం కాలేదు. హైదరాబాద్ విస్తరిస్తున్నది. నిర్మాణ రంగం పెరిగింది. వాహనాలు, నిర్మాణ కార్యకలాపాలు, ఇతరత్రా రూపాల్లో వెలువడుతున్న ధ్వనులతో వివిధ వర్గాల వారికి రోజువారీ సమస్యలు తప్పడం లేదు. ఇక పండుగలు, ఇతర వేడుకల సమయాల్లో ఇది శృతి మించుతోంది. ఈ శబ్దాలతో వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా శబ్దాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగి, ఒకేస్థాయిలో కొనసాగుతుండడంతో గుండె కొట్టుకునే వేగం పెరగడం, అధిక రక్తపోటు సమస్యలకు దారితీస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. 65 డెసిబుల్స్‌కు పైబడి ధ్వనులు పెరిగితే గుండెజబ్బులు, వినికిడి కోల్పోవడం, నిస్సత్తువ ఆవరించడం, నిద్రలేమి, తలనొప్పి, మానసికంగా, శారీరంగా కుంగుబాటు వంటి వాటికి దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాదిగా ఇదే పరిస్థితి... దాదాపు ఏడాది కాలంగా కొంచెం హెచ్చుతగ్గుదలలతో ధ్వని కాలుష్యం, శబ్దాలు ఒకేవిధమైన స్థాయిలో కొనసాగుతున్నట్టుగా తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలి (టీపీసీబీ) అధికారిక గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమౌతోంది. హైదరాబాద్ మహానగరంలోని నివాస, వాణిజ్య, సున్నిత–నిశ్శబ్ద (ఆసుపత్రులు, పార్కులు, ఇతర ప్రదేశాలు) ప్రాంతాలలో ఉదయం, రాత్రి రెండు సమయాల్లోనూ నిర్ణీత పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరీకరణ ఉచ్ఛస్థాయికి చేరుకోవడం, వివిధ రకాల వాహనాల రద్దీ బాగా పెరగడం, నిర్మాణరంగ కార్యకలాపాలు క్రమంగా పెరుగుదల, తదితరాల కారణంగా ఈ ధ్వనులు పెరుగుతున్నట్టు, శాస్త్రీయ పద్ధతుల్లో వీటి నివారణ, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పగటి పూటతో పాటు రాత్రి సమయాల్లోనూ పరిమితులకు మించి అధిక శబ్దాలతో నిద్రకు అంతరాయం ఏర్పడి పరోక్షంగా ఇతర సమస్యలకు దారితీస్తుంది. అయోమయం, మానసిక ఒత్తిళ్లు, ఆదుర్ధా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి వచ్చే అవకాశాలుంటాయి. శబ్దకాలుష్యానికి ఎక్కువ కాలం పాటు గురైతే చాలామందిలో యాంగ్జయిటీ, నిద్రలేమి కారణంగా పొద్దునే లేవలేకపోవడం, రోజంతా చేసే పనులపై సరిగా దృష్టి సారించక పోవడం వంటివి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపి పనితీరుకు నష్టం కలిగి వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురౌతాయి. నిద్రలేమి, ఆదుర్దా, ఒత్తిళ్లు, ఆయాసం, ఇతర సమస్యలు జతకూడి కుటుంబసంబంధాలపైనా దీని పరోక్ష ప్రభావం పడుతుంది. – డా.వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆసుపత్రి -
ట్రాఫిక్ చలాన్ వేశారని బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులు తనపై.. అకారణంగా చలాన్ వేశారని, కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీరట్ జిల్లాలో జరిగింది. యూపీ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం గంగానగర్-మవాన్‌రోడ్‌లో సాకేత్ క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో రోహిత్ అనే యువకుడు గత మంగళవారం తన తల్లికి మందులను కొనుగోలు చేయడానికి బుల్లెట్ వాహనంపై బయలుదేరాడు. బుల్లెట్ వాహనం నుంచి పెద్దగా శబ్దం వస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపివేశారు. శబ్ధం ఎక్కువగా వస్తుండడంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ మిశ్రా రూ.16 వేల చలాన్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ విషయంపై కొద్దిసేపు తర్వాత రోహిత్ తన తల్లిదండ్రులతో కలిసి మీరట్‌లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ఎస్పీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు బుధవారం తల్లిదండ్రులతో రోహిత్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అనిల్‌కుమార్ తమను మానసికంగా వేధిస్తున్నాడని, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే కమిషనర్ కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేయడంతో రోహిత్, అతడి తల్లిదండ్రులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి అనేసరికి.. -
చప్పుళ్లతో...ఒళ్లు మండిపోతోందా? అదీ ఓ జబ్బే!!
కొన్ని శబ్దాలు ఒళ్లుమండిపోయేలా చేస్తాయి. సర్రున చిర్రెత్తిస్తాయి. మనకు తరచూ అనుభవంలోకి వచ్చే ఓ ఉదాహరణ చెప్పుకుందాం... దగ్గర్లో రంపం గరగరలాడుతున్న శబ్దమేదో వినగానే... అదేదో మన పళ్ల మీద గీరుతున్నట్లుగానే అనిపిస్తుంటుంది. కొందరు గుటాగుటా చప్పుళ్లొచ్చేలా తింటుంటే... పక్కనున్నవారికి ఒళ్లుమండిపోతుంటుంది. టూత్‌బ్రష్ నోట్లో వేసుకుని దాన్ని పరపరలాడిస్తున్న శబ్దం వింటే ఇంకొందరికి సర్రున ఒళ్లు మండిపోతుంది. ఇలాంటి శబ్దాల వల్ల ఒళ్లు మండిపోతుంటుంది. అయితే కొందరిలో ఈ జబ్బు స్థాయికి చేరుకుంటుంది. ఆ జబ్బు గురించి, దానికి చికిత్సల గురించి తెలుసుకుందాం. కేవలం అలాంటి శబ్దాలే కాదు... చప్పుడొచ్చేలా పెద్దగా గొంతు సవరించుకోవడం, చప్పరిస్తూ తింటుండటం, పెదవులు నాక్కోవడం, పెద్దగా విజిల్ వేయడం వంటి శబ్దాలు అదేపనిగా చాలాసేపు వినబడుతుంటే చాలామందికి కోపం తారస్థాయికి చేరుకుంటుంది. ఇక మరికొందరికైతే... ఒళ్లువిరుచుకుంటూ నోటితో గట్టిగా శబ్దం చేయడం, భారీగా ఆవలించడం, టైప్రైటర్ల టకటకలూ, నవ్వుల ఇకఇకలతో నిగ్రహం కోల్పోతారు. ఇక స్లిప్పర్స్ తో మెట్లమీదో లేక గచ్చుమీదో టపటపలాడిస్తున్న చప్పుడు వింటే చాలు ఆగ్రహం మిన్నంటుతుంది. ఇలా చప్పుళ్లను తట్టుకోలేని కండిషన్ ను ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’ అంటారు. వైద్యపరిభాషలో ‘మిసోఫోనియా’ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జబ్బు ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ (ఓసీడీ)కి దూరపు బంధువు వరసవుతుందని చెప్పవచ్చు!! మనందరిలో ఇలాంటి శబ్దాలకు కొంత ఇరిటేషన్ వంటి ఫీలింగ్ కలగడం చాలావరకు సహజమే. అయితే తీవ్రమైన కోపానికి గురయ్యేవారిలో... కొందరికి చెమటలు పట్టడం, కండరాలు టెన్షన్‌కు గురికావడం, గుండెదడ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఆ విముఖత సాధారణ స్థాయి నుంచి రుగ్మత స్థాయికి చేరుకుందని అర్థం. దీనికి చికిత్స కూడా ఉంది... ఇలాంటి సమస్యతో బాధపడేవారికి బిహేవియరల్ థెరపీతో చికిత్స అందిస్తారు. వారికి కొద్దిపాటి శబ్దం వచ్చే ఫ్యాన్ సౌండ్‌ను అలవాటు చేయడం దగ్గర్నుంచి క్రమంగా శబ్దాలను అలవరుస్తారు. అలా శబ్దాల తీవ్రతను పెంచుకుంటూ పోతారు. ‘సెలక్టివ్ సౌండ్ సెన్సిటివిటీ సిండ్రోమ్’కు ఇలాంటి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందన్నది నిపుణుల మాట చదవండి: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని.. -
శబ్ద కాలుష్యానికి పాల్పడితే తప్పదు భారీమూల్యం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా శబ్ద కాలుష్యం బారిన పడేవారికే గుండెపోటు వచ్చే అవకాశాలున్నట్లు పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. నగరాల్లో జీవించేవారు శబ్దకాలుష్యం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఢిల్లీ వంటి నగరాల్లో శబ్ద కాలుష్యం మరీ అధికంగా ఉంటుంది. కాగా, ఢిల్లీలో శబ్ద కాలుష్య నియంత్రణకు.. కాలుష్య నియంత్రణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శబ్ధ కాలుష్యానికి పాల్పడితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే. శబ్ధ కాలుష్యాని పాల్పడే వారిపై సుమారు రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ సూచించింది. వేడుకలు, ర్యాలీల్లో బాణాసంచా కాలిస్తే రూ.10వేలు జరిమానా విధించనున్నారు. సైలెంట్ జోన్లలో బాణాసంచా పేలిస్తే రూ.20వేల జరిమానా విధించాలని కమిటీ సూచించింది. నిబంధనలను మళ్లీ మళ్లీ ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. Delhi Pollution Control Committee revises penalty for violation of noise rules: Rs 10,000 for noise through loudspeakers/public address systems, Rs 1 Lakh for Diesel Generator sets of over 1000 KVA; Rs 50,000 for sound-emitting construction equipment. The equipment will be seized pic.twitter.com/YvY2PxK3jT — ANI (@ANI) July 10, 2021 -
ఇకపై అతిగా హారన్ కొడితే.. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ధ్వని కాలుష్యం నివారణ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట అతిగా హారన్ మోగించే వాహనదారులపై భారీగా జరిమానాలను విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేఫథ్యంలో మతపరమైన ప్రదేశాల్లో, పెళ్లి వేడుకల్లో, వాహనాల వల్ల శబ్ధ కాలుష్యం వెలువడితే భారీ జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ శబ్ధ కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నామని, నిర్దేశిత డెసిబుల్ దాటి శబ్ధం వస్తే ఫైన్ కట్టాల్సిందేనని ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియల్ తెలిపారు. కొత్తగా సూచించిన ఉత్తరాఖండ్ శబ్థ కాలుష్య నిబంధనల ప్రకారం కొన్ని ప్రాంతాలను గుర్తించారు. మతపరమైన ప్రదేశాలలో, అతిగా ధ్వని మొదటిసారిగా పేర్కొన్న డెసిబెల్ను మించితే.. జరిమానా 5000 రూపాయలు, రెండవసారి-10,000 రూపాయలు, మూడోసారి 15,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా హోటళ్ళు, రెస్టారెంట్ల ప్రాంతాలలో మొదటిసారి రూ.10,000, రెండవసారి రూ.15,000, మూడవసారి రూ. 20,000 ఉంటుంది. పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాలలో జరిమానా రూ. 20,000, రెండవ సారి రూ. 30,000, మూడవ సారి రూ. 40,000 వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో శబ్థ కాలుష్య నియమాలను ఉల్లంఘించివారిపై ప్రభుత్వం ఇకపై వెయ్యి రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు జరిమానాలు వసూలు చేయనుంది. ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియల్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ పర్యావరణం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోనుందని తెలిపారు. అదే క్రమంలో శబ్ధ కాలుష్యానికి కారణమైన పరికరాలను కూడా సీజ్ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: వైరల్: ఏం ఫిలాసఫీ బాబు.. మద్యం తాగితే కరోనా సోకదా? -
సౌండ్స్ ఆపండ్రా బాబు!
పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వాహనాలు తయారు చేసుకుంటూ పోతూ.. భూమిని కాలుష్యం చేస్తున్నాం. అధిక మొత్తంలో కార్బన ఉద్గారాలు విడుదలవ్వడం వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడమేకాకుండా వాతావరణాన్ని సమస్థితిలో ఉంచే సముద్రాలను ప్రభావితం చేస్తున్నాము. మనుషులు చేసే వివిధ రకాల పనుల వల్ల విడుదలయ్యే శబ్దాలతో సముద్రపు గర్భంలోనే గాక ఉపరితలంలో సహజసిద్ధంగా వినిపించే ధ్వనులు కూడా మార్పులకు లోనవుతున్నాయి. దీనివల్ల సముద్ర జీవుల మనుగడ ప్రమాదం లో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమాణంలో చిన్నగా ఉండే రొయ్యల నుంచి భారీ శరీరం కలిగిన తిమింగలాలపైన కూడా వీటి ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శబ్దాలు నీటి అడుగుభాగంలో చాలా దూరం వరకు ప్రయాణిస్తాయి. చేపలకు తాము నివసించే వాతావరణాన్ని కనుగొనడానికి కాంతి కంటే ధ్వని బాగా ఉపయోగపడుతుందని కెనడాలోని విక్టోరియా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ చెప్పారు. నీటిలో కాంతి చెల్లాచెదురుగా ప్రయాణిస్తుంది. కానీ ధ్వని గాలిలోకంటే నీటిలో వేగంగా ప్రయాణిస్తుంది. అందువల్ల.. నీటిలో జీవించే జలచరాలు శబ్దాల ద్వారానే ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. చాలా రకాల చేపలు ఆహారం దొరికే మంచి ప్రదేశాలను గుర్తించడానికి, వేటాడే జంతువులను గుర్తించడానికి సంతానోత్పత్తివంటి అనేక విషయాలకు ధ్వని మీద ఆధారపడతాయి. సముద్రాల్లో ఏర్పడే షిప్పుల ట్రాíఫిక్ జామ్, చేపలు పట్టేందుకు వాడే మోటార్ వలలు, సముద్ర గర్భంలో ఉన్న ముడి చమురును, గ్యాస్‌ను వెలికితీసేందుకు చేసే డ్రిల్లింగ్ సౌండ్స్, సముద్రంలో చేపట్టే నిర్మాణ పనుల్లో పాల్గొనే మనుషులు చేసే శబ్దాల వల్ల చేపలు ఒకదానికి ఒకటి మాట్లాడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నీటి అడుగుభాగంలో మైక్రోఫోన్స్‌ను ఉపయోగించి షిప్పుల నుంచి వెలువడే శబ్దాల వల్ల చేపలు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాయో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలో ఉన్న కీలక షిప్పింగ్ కారిడార్స్‌లో ఎర్రసముద్రం ఒకటి. ఈ సముద్రం మీదుగా∙అనేక షిప్పులు ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాలకు ప్రయాణిస్తుంటాయి. వీటినుంచి వెలువడే శబ్దాలను తట్టుకోలేక అక్కడ నివసించే చేపలు, కొన్ని అకశేరుకాలు ప్రశాంతమైన వాతావర ణాన్ని వెతుక్కుని తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. దీంతో 1970 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ జీవించే జలచరాల సంఖ్య సగానికి పైగా తగ్గింది. కొన్ని జీవులు అయితే తమ సొంతస్వరాలను మర్చిపోయాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సముద్ర శబ్దాల్లో ఏర్పడే మార్పులు.. వాతావరణ మార్పులు, గాలుల దిశలు మారడం, తరంగాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడడం, మంచు ద్రవీభవన వంటి భౌతిక ప్రక్రియలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. భూమిమీద ఉన్న ప్రతిజీవి మనుగడ సక్రమం గా ఉన్నప్పుడే మనవుని మనుగడ సాధ్యమవుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. -
హారన్.. సైరన్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో మళ్లీ వాహన విస్ఫోటనం సంభవిస్తోంది. మహానగరం పరిధిలో రోడ్డెక్కుతున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలో మహానగర పరిధిలోని సుమారు 50 లక్షల వాహనాల్లో సింహభాగం ఇళ్లకే పరిమితం కాగా.. మే రెండోవారం నాటికి ఇందులో నాలుగింతల వాహనాలు ప్రస్తుతం రోడ్డెక్కుతున్నాయి. దీంతో నగరంలో శబ్ద కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాజధాని నగరంలో లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 90 శాతం వాహనాలు ఇళ్లకే పరిమితం కాగా.. మే రెండో వారంలో సుమారు 60 శాతం వాహనాలు రోడ్డెక్కుతుండడంతో శబ్ద కాలుష్యం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలను అతి ధ్వనులుగా పరిగణిస్తారు. ఏప్రిల్ చివరి వారంలో నగరంలో 60 డెసిబుల్స్ మేర శబ్ద కాలుష్యం నమోదు కాగా.. మే రెండో వారం నాటికి శబ్ద కాలుష్యం 95–100 డెసిబుల్స్ నమోదవడం గమనార్హం. ఏప్రిల్ మాసంలో ఇలా.. మార్చి మూడో వారంలో లాక్డౌన్ విధించడంతో మహానగరం పరిధిలో నిత్యం రోడ్డెక్కే 50 లక్షల వాహనాల్లో 90 శాతం ఇళ్లకే పరిమితమయ్యాయి. దీంతో నగరంలో శబ్ద కాలుష్యం 60 డెసిబుల్స్ లోపే నమోదైంది. ప్రధానంగా అత్యధిక వాహన సంచారం ఉండే అబిడ్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, ప్యారడైజ్, చాదర్‌ఘాట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. దీంతో సిటీజన్లు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతంసీన్ క్రమంగా మారింది. ఇప్పుడు క్రమంగా సిటీలో వాహన సంచారం పెరుగుతూనే ఉంది. ఈ నెల రెండోవారంలో ఇలా.. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తుండడంతో నగరంలో వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రధానంగా అత్యంత రద్దీగా ఉండే అబిడ్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వాహన సంచారం లాక్డౌన్ రోజుల కంటే నాలుగింతలు.. అంటే సుమారు 25 లక్షల వరకు ఉంది. దీంతో శబ్ద కాలుష్యం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అబిడ్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, గచ్చిబౌలి, తార్నాక తదితర ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం 95 డెసిబుల్స్ మేర నమోదవుతుండడంతో సిటీజన్ల గూబ గుయ్‌మంటోంది. అధిక శబ్ద కాలుష్యం కారణంగా నగరవాసులకు చిరాకు, అసహనం, గుండె దడ పెరగడం, నిద్రలేమి తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెలాఖరులో లాక్డౌన్ ఎత్తివేస్తే నగరంలో శబ్ద కాలుష్యం మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రణగొణ ధ్వనుల నుంచి విముక్తి
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ పద్మవ్యూహం లేదు. వాహనాల రణగొణ లేదు. అంతటా నిశ్శబ్దమే. ‘చెవు’లూరించే వాతావరణమే. కర్ణభేరి దద్దరిల్లే ధ్వనులకు విరామం. నగరవాసులకు శబ్ద విముక్తి. ఇదీ ఇటీవల సిటీలో నెలకొన్న పరిస్థితి. లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్య కూడళ్లు, ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం సగానికి పైగా తగ్గింది. నగరంలో లక్షలాది వాహనాలు ఇళ్లకే పరిమితం కావడంతో వాయు నాణ్యతలోనూ మెరుగుదల కనిపిస్తోంది. నిత్యం 90– 100 డెసిబుల్స్‌కు పైగా శబ్ద కాలుష్యం నమోదయ్యే అబిడ్స్, పంజాగుట్ట, ప్యారడైజ్, బాలానగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రస్తుతం 40– 50 డెసిబుల్స్ మాత్రమే శబ్ద కాలుష్యం నమోదవుతుండడం విశేషం. దీంతో ప్రస్తుతం ఇళ్లకే పరిమితమైన నగరవాసులు కంటి నిండా నిద్రకు నోచుకుంటున్నారు. పీసీబీ ప్రమాణాల ప్రకారం పారిశ్రామిక వాడల్లో పగలు 75 డెసిబుల్స్.. రాత్రి 70 డెసిబుల్స్, వాణిజ్య ప్రాంతంలో పగలు 65.. రాత్రి 55 డెసిబుల్స్, నివాస ప్రాంతాల్లో పగలు 55.. రాత్రి 45 డెసిబుల్స్, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, జూపార్క్ తదితర సున్నిత ప్రాంతాల్లో పగలు 50.. రాత్రి 40 డెసిబుల్స్‌కు మించి శబ్ద కాలుష్యం మించరాదు. కానీ నగరంలో ఏడాదికి సుమారు 300 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం 90– 100 డెసిబుల్స్ నమోదయ్యేది. ఇటీవల పలు పారిశ్రామిక వాడలు, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో ఈ నెల 15న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శబ్ద కాలుష్యాన్ని నమోదు చేసింది. కారణాలివీ.. ♦ లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో నిత్యం రాకపోకలు సాగించే 50 లక్షల వాహనాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ♦ మూడు కిలోమీటర్ల నిబంధన, ట్రాఫిక్ పోలీసులు పలు వాహనాలను సీజ్ చేస్తుండటంతో సిటీజన్లు ఎక్కువ దూరం ప్రయాణించడంలేదు. ♦ ఆర్టీసీ బస్సులు, ఆటోలు సైతం రోడ్డెక్కకపోవడం. ♦ నిర్మాణ రంగ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డంపర్లు, లోడర్లు, ఆర్ఎంసీ కాంక్రీట్ వాహనాలు సైతం నగరంలో రాకపోకలు సాగించడంలేదు. ♦ నగరంలో సుమారు 15లక్షల మేర ఉన్న 15ఏళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు గడప దాటకపోవడంతో రణగొణ ధ్వనుల నుంచి విముక్తి లభించింది. మెరుగుపడిన వాయు నాణ్యత.. ♦ నగరంలో వాయు నాణ్యతా సూచి సైతం 50 పాయింట్ల లోపుగా నమోదవడంతో వాయు నాణ్యత పరంగా అత్యంత సంతృప్త నగరంగా గ్రేటర్ హైదరాబాద్ నిలిచింది. ప్రధానంగా లక్షలాది వాహనాలు రోడ్డెక్కకపోవడంతో ఇంధన వినియోగం తగ్గి వాహన కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లతో పాటు సూక్ష్మ, స్థూల ధూళి కణాల కాలుష్యం తగ్గడంతో సిటీజన్లు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. -
గూబ గుయ్!
సాక్షి, సిటీబ్యూరో: పరిమితికి మించిన ధ్వని కాలుష్యంతో గ్రేటర్‌వాసుల గూబ గుయ్‌మంటోంది. మహానగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలున్న సున్నిత ప్రాంతాల్లోనూ శబ్ద కాలుష్యం మోతమోగుతోంది. నగరంలోని పలు సున్నిత ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో నిర్దేశిత ప్రమాణాలకంటే అధిక ధ్వని కాలుష్యం వెలువడుతోందని పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది. నగరంలోని అబిడ్స్, పంజగుట్ట, జీడిమెట్ల, జూపార్క్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, మైండ్‌స్పేస్, ఎంజే మార్కెట్, అమీర్‌పేట్, కేబీఆర్పార్క్, బహదూర్‌పురా తదితర ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం 90 నుంచి 110 డెసిబుల్స్‌గా నమోదవుతోందని పీసీబీ తాజా నివేదిక స్పష్టంచేసింది. పీసీబీ ప్రమాణాల మేరకు ఆయా ప్రాంతాల్లో శబ్దాలు 50 నుంచి 60 డెసిబుల్స్‌కు మించరాదు. కానీ పరిమితికి మించి శబ్దాలు వెలువడుతుండడంతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కారణాలివే.. ♦ నగరంలో శబ్ద కాలుష్యానికి ప్రధానంగా రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్ క్రాకర్స్ కాల్చడం, లౌడ్ స్పీకర్లు, డీజే హోరు తదితర కారణాలు. ♦ ప్రధానంగా భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా రేయింబవళ్లు హారన్ల మోత మోగిస్తుండడంతో సిటీజన్లు శబ్ద కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ♦ గ్రేటర్లో మొత్తం వాహనాల సంఖ్య 50 లక్షలు. వీటిలో 15 ఏళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు 15 లక్షలకు పైమాటే. వీటి ఇంజిన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతున్నాయి. ♦ గ్రేటర్లో యూత్ ప్రత్యేక గుర్తింపు కోసం అధిక శబ్దాలు వెలువడే మోడిఫైడ్ హారన్లను వినియోగించడం కూడా శ్రుతి మించుతుండడంతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ♦ గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారులపై సుమారు 100 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లున్నాయి. వీటి వద్ద అధిక సమయం వాహనాలు నిలపాల్సి రావడంతో హారన్ల మోత మోగుతోంది. ♦ నివాస ప్రాంతాలకు ఆనుకొని ఫంక్షన్ హాళ్లు, క్లబ్బులు, పబ్బులు నెలకొనడంతో వీటి వద్ద డీజేల హోరు.. బ్యాండ్ బాజాల మోతతో గూబ గుయ్‌మంటోంది. ♦ గ్రేటర్లో నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో బోరు బావుల తవ్వకం.. లోడర్లు.. డంపర్లు వంటి కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం పెరిగింది. వీటి నుంచి అధిక శబ్దాలు వెలువడుతున్నాయి. శబ్ద గ్రాహకాల ఏర్పాటులో నిర్లక్ష్యం.. గ్రేటర్ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారులు.. ముఖ్యమైన కాలనీల్లోనే ఉన్నాయి. వీటిలో సగం ఆస్పత్రులకు శబ్ద గ్రాహకాలు లేకపోవడంతో రోగులు అధిక ధ్వనులు విని గగుర్పాటుకు గురవుతున్నారు. మహానగరం పరిధిలోని సుమారు ఐదువేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇవి కూడా దాదాపు ప్రధాన రహదారులు, ముఖ్య వీధులు, కాలనీల్లోనే ఉన్నవే. వీటిల్లోనూ శబ్ద గ్రాహకాలున్న పాఠశాలలు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉండడం గమనార్హం. కాలుష్యంతో నష్టాలు ఇలా.. ♦ వినికిడి అవధిని దాటి అధికంగా వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. శబ్ద కాలుష్యం అవధిని మించి నమోదయితే అక్కడి నివాసితులకు చెవిలో రింగు రింగుమంటూ శబ్దాలు వినిపిస్తాయి. ♦ దీర్ఘకాలం ఈ శబ్దాలను విన్నవారికి శాశ్వత వినికిడి లోపం సంభవిస్తుంది. నిద్రలేమి, అలసట, హృదయ రక్తనాళాల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. రక్తపోటు పెరుగుదల అధికంగా ఉంటుంది. చేసే పని మీద ఆసక్తిని కోల్పోతారు. ♦ నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వారిలో వినికిడి శక్తి కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦ పెంపుడు శునకాలు, పిల్లులు లాంటివి 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరి బద్దలయ్యే ప్రమాదం ఉంటుంది. ♦ 90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల కర్ణభేరిలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వృద్ధులకూ శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ♦ అత్యధిక ధ్వనులు విన్నపుడు చిన్నపిల్లల మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. ఇలా కాపాడుకోవాలి.. ♦ ప్రధానంగా పాఠశాలలు, ఆస్పత్రులను అధిక శబ్దాలను నిరోధించే జిప్సం బోర్డులు, ఫైబర్‌గ్లాస్ ఇన్సులేషన్స్తో గోడలను కప్పివేస్తే అధిక శబ్దాలు లోనికి చేరకుండా ఉంటాయి. ♦ అధిక శబ్దాలు వెలువడే ప్రాంతాల్లోని భవనాలకు విధిగా శబ్ద గ్రాహకాలు ఏర్పాటు చేయాలి. ♦ ప్రతి ఆస్పత్రి,పాఠశాల ఆవరణలో గ్రీన్‌బెల్ట్‌ను అధికంగా ఏర్పాటుచేయాలి. అధిక శబ్దాలను గ్రహించేందుకు హరిత వాతావరణం దోహదం చేస్తుందని గుర్తించాలి. గ్రీన్బిల్డింగ్ల నిర్మాణాలను ప్రోత్సహించాలి. ♦ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేధిక ప్రకారం ఏ వ్యక్తి అయిన ఎనిమిది గంటల పాటు 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు పాటించాలి. ♦ అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి. ♦ ట్రాఫిక్ రద్దీలో బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి. -
శబ్ద, వాయు కాలుష్యాలతో మహిళల్లో గర్భస్రావం
సాక్షి, హైదరాబాద్: నగరంలో నానాటికి పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యాలతో ప్రజలు అనారోగ్యాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని తెలంగాణ హైకోర్టులో ఎమ్. ఆదిత్య అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ అంశంపై సోమవారం వాదనలు విన్న న్యాయస్థానం.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ), మున్సిపల్ కమిషన్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో సహా రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. దేశంలో ఢిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, జంట నగరాల్లో పెరుగుతున్న వాహనాల కారణంగా శబ్ద, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది రాపోలు భాస్కర్ వాదించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో మహిళలు గర్భస్రావంతో సహా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ హైకోర్టుకు విన్నవించారు. అలానే రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పాటు పలు ద్విచక్ర వాహనాల కారణంగా విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని పిటిషనర్ తన నివేదికలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా అదేవిధంగా సోమవారం మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 30న వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని జబ్బిర్ అహ్మద్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. -
వెలుగు నింపాలి.. కాలుష్యం కాదు
పండుగలు ఏవైనా అందరం సంతోషంగా జరుపుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాలి . ప్రకృతితో మమేకమైన మన జీవన సౌందర్యాన్ని సంతోషంగా ఆస్వాదించాలి. కానీ రోజు రోజుకీ మనం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాం. పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. ఆనందం కోసం పటాసులు పేలుస్తూ.. పర్యావరణానికి హాని చేస్తున్నాం. దీపావళి పండగ అంటే వెలుగు నింపాలి కానీ కాలుష్యాన్ని కాదు. దీపావళి పండుగ రోజున పెల్చే బాణాసంచాల వలన పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ స్థాయిలో ఉండాల్సిన కాలుష్య తీవ్రత పండుగ సమయంలో తీవ్రంగా పెరుగుతుంది. .ఒక్క టపాసు పేలితే వచ్చే పొగ అయిదువందల సిగరెట్లకు సమానం అన్నది పుణె పరిశోధకుల మాట. పటాకుల వలన వచ్చే శబ్దం వలన ధ్వని కాలుష్యం, పోగ వలన వాతవరణం కలుషితమవుతుంది. టపాసుల నుంచి వెలువడే పొగ పండగ తరవాత కూడా కొన్ని రోజుల పాటు మన పరిసర వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది చాలా మందిలో శ్వాస సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. పెద్ద శబ్దాలతో వినికిడి లోపం బాణాసంచా కాల్చడం వలన వాతవరణ కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం కూడా ఏర్పడుతుంది. పండుగ రోజున విరజిమ్మె క్రాకర్స్ పెద్ద పెద్దగా శబ్దాలు చేయడం వలన చిన్నపిల్లలో వినికిడి లోహం ఏర్పడుతుంది. గుండె సంబంధ వ్యాధులకు లోనయ్యె అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని టాక్సిక్ పదార్ధాల వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటితో పాటు పక్షులు జంతువులకు కూడా ముప్పు వాటిలే ప్రమాదముంది. 125డెసిబుల్స్ దాటకూడదని నియమం ఉన్న అంత కు మించిన శబ్దాలు రావడంతో నిద్ర సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద శబ్ధాల వల్ల రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వినడంతో తాత్కాలికంగానే కాదు పూర్తిగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరితిత్తులు విషపూరితం ఇంట్లో ఎవరికైనా ఆస్త్మా, సీఓపీడీ ఉంటే టపాసుల నుంచి వచ్చే పొగవల్ల అది మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. కొన్ని రకాల టపాసుల్లో రకరకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి. ఉదాహరణకు కాపర్, కాడ్మియం మొదలైనవి. ఇవి గాలిలో దుమ్ము రూపంలో పేరుకుపోతాయి. ఈ దుమ్ము ఆస్త్మా ఉన్నవారికి ఎంతో ప్రమాదకారి. దీనివల్ల పైత్యం, తుమ్ములు, జలుబు, తలనొప్పి వంటి రుగ్మతలు కలుగుతాయి. ఈ పండుగ కూడా చలికాలంలో వస్తుంది కాబట్టి పొగ మంచు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషపూరితమైన రసాయనాలు ఈ పొగలో కలిసిపోయి మరింత ఇబ్బంది పెడతాయి. ఈ హానికరమైన పొగ వల్ల ఊపిరితిత్తులు కూడా విషపూరితమవుతాయి. కర్ణభేరికి ప్రమాదం అధిక శబ్దంతో పేలే బాంబుల వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదముంది. సాధారణంగా యువత శబ్దం ఎక్కువగా వచ్చే టపాసులను పేల్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే వీటి ప్రభావం అప్పటికప్పుడు తెలియకపోయినప్పటికీ నెమ్మదిగా చెవి సంబంధిత రుగ్మతలతో బాధపడక తప్పదు. వీటి వల్ల పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదమైతే లేదు కానీ.. పండగ తరవాత కొన్ని రోజులపాటు వినికిడి లోపంతో ఇబ్బంది మాత్రం తప్పదు. పటాసుల ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు దీపావళికి, ఇతర సందర్భాల్లో కాల్చే క్రాకర్స్ తయారీలో అనేక రకాల విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని కాల్చిన తర్వాత రసాయనాలన్నీ పీల్చే గాలిలో కలిసి, మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మెగ్నీషియం అనే రసాయనం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. జ్వరం, తలనొప్పి, జలుబు, వాంతులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జింక్ వల్ల తలనొప్పి, వాంతులు వస్తాయి.- గాలిలో కలసిన సోడియం వల్ల శరీరంపై దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇది తీవ్రంగా ఉంటే చర్మక్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాడ్మియం అనే రసాయనాన్ని పీల్చడం అనీమియాకు దారితీస్తుంది. ఎక్కువగా పీలిస్తే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. రక్తహీనత తలెత్తుతుంది. లెడ్ శరీరంలోకి ప్రవేశిస్తే నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గాలిలో కలిసిన కాపర్‌ను పీల్చడం వల్ల విపరీతమైన తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాస ఆడకపోవడం, విపరీతమైన దగ్గు వస్తుంది. నైట్రేట్ అనే రసాయనం మోతాదు మించితే చాలా ప్రమాదం. ఇది మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చిన్నారులపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కావాల్సింది గ్రీన్ దీపావళి.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ వేడుకలైనా పటాకులు లేకుండా జరుగదు. అయినా అక్కడ కాలుష్యం పెరుగకపోవటానికి కారణం జీరో పొల్యూషన్ పటాకుల వినియోగించడమే. అన్నింటికీ మించి సామూహికంగా క్రాకర్ షో ఏర్పాటు చేసుకుని, అందులో సమిష్టిగా పాలుపంచుకొంటారు. మనదగ్గర సాధారణంగా కర్బన పదార్థాలతో పటాకులు తయారుచేస్తారు. విదేశాల్లో మాత్రం నైట్రోజన్ సంబంధిత పదార్థాలతో తయారుచేస్తారు. అమెరికాకు చెందిన కొన్ని కెమికల్, ఇంజినీరింగ్ కంపెనీలు జీరో పొల్యూషన్ క్రాకర్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటివల్ల తక్కువ పొగ రావడంతోపాటు పర్యావరణహితంగా పటాకులు కాల్చుకొనే అవకాశం కలుగుతున్నది. ఇక క్రాకర్ షో వంటి కార్యక్రమాల వల్ల కాలుష్యం ఒక్క చోటికే పరిమితం అవుతుంది. మనదేశంలో కూడా ఎకోఫ్రెండ్లీ పటాసులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో ఈ దీపావళి వేడుకలు జరుపుకుంటే కాలుష్యాన్ని కొంతమేర తగ్గించినవాళ్లం అవుతాం. ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్ కొంత మేలు దీపావళికి క్రాకర్స్ కాల్చడం తప్పనిసరి అని భావిస్తున్న వారంతా ఈ ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్‌ని వినియోగించుకోవడం మంచింది. పటాసులు పేలిస్తేనే పండుగా అని భావించేవారి కోసమే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కాన్ఫెట్టి, ఫ్లవర్ పవర్, ఫేక్నోట్, బర్ట్స్, స్నేక్‌మిక్స్‌లాంటి పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మామూలు బాణాసంచాలా కాకుండా, వాతావరణానికి అతి తక్కువ హాని కలిగించే అవకాశం ఉంది. వీటి ధ్వని పరిమిత దూరం వరకే వినిపించడంతోపాటు కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను వెదజల్లుతాయి. కేవలం గన్‌పౌడర్, ఫాస్పేట్ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వెరైటీ బాణాసంచాను తయారు చేస్తున్నారు. అయితే వీటి లభ్యత చాలా స్వల్పంగానే ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ► అధిక శబ్దం, విపరీతమైన పొగ వెలువడే టపాసులు కాకుండా చిన్న చిన్న టపాసులను కాల్చండి. ►టపాసులను ఆరుబయట మాత్రమే కాల్చండి. వీటిని పేల్చేటప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయండి. ►ఎవరైతే ఆస్త్మాతో బాధపడుతున్నారో వారు ఈ సమయంలో తప్పకుండా మందులు వేసుకోవాలి. ►శ్వాసకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వీరు టపాసులకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ►టపాసులు కాల్చడం వల్ల వెలువడే రసాయనాల కారణంగా కళ్లు ఎర్రబడకుండా, కంటి నుంచి నీరు కారకుండా ఉండటానికి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది. ►అలాగే చేతులతో పట్టుకుని కాల్చే టపాసులతో కొంచెం జాగ్రత్త వహించాలి. వీటి వల్ల చేతులు కాలే ప్రమాదముంటుంది కాబట్టి ముందుగానే మాస్కులు లేదా గ్లౌజులు వేసుకోవడం మంచిది. -
శబ్ద కాలుష్యం వల్ల గుండెపోట్లు ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : పచ్చని చెట్లుగల ప్రశాంత వాతావరణంలో జీవించే వారికన్నా ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రణగొణ ధ్వనుల మధ్య జీవించే వారికి రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువని బార్సిలోనాలోని ‘హాస్పిటల్ డెల్మార్ మెడికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన పరిశోధక బందం 2,761 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితిని దాదాపు 9 ఏళ్ల పాటు అధ్యయనం చేయడం ద్వారా తేల్చింది. ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న వారికన్నా ఈ రణగొణ ధ్వనుల మధ్య జీవిస్తున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువని కనుగొన్నది. కేవలం శబ్ద కాలుష్యం వల్లనే వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందా? సహజంగా పట్టణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నుంచి వాహనాల నుంచి వెలువడే కాలుష్య ప్రభావం తోడవడం వల్ల కూడా ప్రజలకు గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందా ? అన్నది స్పష్టంగా ఈ అధ్యయనం తేల్చలేదు. పైగా పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వ్యాయామం అలవాటు కూడా తక్కువ, అందువల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. శబ్ద కాలుష్యం గురించి తప్పా మరో కాలుష్యం గురించి పేర్కొనక పోయినప్పటికీ ఈ అన్ని కాలుష్యాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లో ఏడాదికి దాదాపు లక్ష మంది గుండెపోటులకు గురవుతున్నారని, వారిలో ఎక్కువ మంది శబ్ద కాలుష్యం వల్లనే మరణిస్తున్నారని పరిశోధకులు తేల్చారు. గుండెపోటు వచ్చి ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న వారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారని, వారిలో కూడా ఎక్కువ మంది శబ్ద కాలుష్యం వల్ల గుండెపోటుకు గురయిన వారేనని తెలిపారు. గుండెపోటులో రెండు రకాలు ఉంటాయని, గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డడం వల్ల 80 శాతం గుండెపోట్లు వస్తాయని, రక్త నాళాలు చిట్లడం ద్వారా కూడా గుండెపోట్లు వస్తాయని, అలాంటి గుండెపోట్లు మొత్తంలో 20 శాతం ఉంటాయని పరిశోధకులు తెలిపారు. -
సౌండ్ పెరిగితే చలాన్ మోతే!
సాక్షి, సిటీబ్యూరో: రహదారిలో నిదానంగా వెళ్తున్న వాహనచోదకుడికి వెనుక నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు హారన్ మోగిస్తే అతడి గండె ఆగినంత పనవుతుంది... రోడ్డుపై నడుస్తున్న పెడస్ట్రియన్ పక్క నుంచి బుల్లెట్ తరహా వాహనం దూసుకుపోతే దాని సౌండ్ దడపుడుతుంది... నగరవాసుల్లో అనేక మందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి వాటి ఫలితంగానూ రాజధానిలో శబ్ధ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరి అనేక మంది చెవి రుగ్మతలకు గురవుతున్నారు. దీనిని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి వాహనచోదలకు చెక్ చెప్పడానికి ఈ నెల 14 నుంచి స్పెషల్ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. ఫలితంగా వారం రోజుల్లో 654 కేసులు నమోదు చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ఓ వాహనం హారన్ గరిష్టంగా 93 నుంచి 100 డెసిబుల్స్ మధ్య మాత్రమే శబ్ధం చేయాలి. అలాగే ఆయా వాహనాల ఇంజిన్లు, సైలెన్సర్లు సైతం ఎంత శబ్ధం చేయవచ్చనేది స్పష్టంగా నిర్ధేశించి ఉంది. అయితే ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న వాహనచోదకులు పరిమితికి మించి శబ్ధాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, బుల్లెట్ తదితర వాహనాలు మాత్రమే కాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు, కాలేజీలు, స్కూళ్ళకు విద్యార్థులను తరలించే వాహనాలు సైతం కర్ణకఠోరమైన శబ్ధాలను విడుదల చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్ హారన్స్, మల్టీ టోన్ హారన్స్, మాడిఫైడ్ సైలెన్సరే ఇందుకు కారణమని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు కేటాయించిన సౌండ్ లెవల్ మీటర్ల సాయంతో నిర్ణీత వేళల్లో డ్రైవ్స్ చేస్తున్నారు. ఆయా హారన్లు వెంటనే తొలగించాల్సింగా వాహనాల డ్రైవర్లు, ఆయా సంస్థల నిర్వాహకులకు సైతం స్పష్టం చేశారు. 14–20 తేదీల మధ్య కేసులు ఇలా ఉల్లంఘన కేసులు ఎయిర్ హారన్ 125 మల్టీ టోన్డ్ హారన్ 424 ఇంజిన్/సైలెన్సర్ శబ్ధాలు 105 మొత్తం 654 -
శబ్దాన్ని ఆపండి..
కాజీపేట: పరీక్షల కోసం విద్యార్థులు ఎంతో ఏకాగ్రతతో చదువుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఇబ్బందికలిగితే వారి ఏకాగ్రత దెబ్బతిని చదువుకోవాలనే ఆసక్తిని కోల్పోతారు. ప్రధానంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల బంగారు భవితవ్యానికి మార్గం చూపే వార్షిక పరీక్షల సమయంలో ఈ పరిస్థితులు ఎక్కువగా కన్పిస్తుంటాయి. అయితే మారుతున్న కాలాన్నిబట్టి వాహనాల రణగొనధ్వనులు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రభావం పరీక్షల సమయంలో విద్యార్థులపై ఎక్కువగా ఉంటోంది. కాలనీల్లో ఆగని మైక్‌ల గోల... ఉదయం 6గంటలకే ఉల్లిపాయలోయ్.. ఉల్లిపాయలంటూ ఆటోలో మైక్ సెట్‌తో ఒకరు రెఢీ. గ్యాస్ స్టవ్‌లు బాగు చేస్తామంటూ ఇంకొక్కరు సిద్దం. ఇవన్నీ వెరసి ప్రశాంత వాతావరణంలో చదువుకునే విద్యార్థుల ఏకాగ్రతను భగ్నం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న మైకులతో వచ్చే శబ్దంతో అటు విద్యార్థులు, ఇటు వృద్ధులతోపాటు సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులు మానసిక ఆందోళనతో పాటు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కల్యాణ మండపాల్లో హోరు.. పెళ్లిళ్లు, చిన్న చిన్న వినోద కార్యక్రమాలు నిర్వహించే కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ఊరికి దూరంగా విశాలమైన ప్రాంతాల్లో ఉండేవి. కాలక్రమేణా ఇవి నివాసాల మధ్యలోకి వచ్చేశాయి. పెళ్లంటే ఒకప్పుడు సన్నాయి, మేళతాళాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సంగీత్ పేరుతో రెండు రోజుల ముందు నుంచే ఆర్కెస్ట్రా, మ్యూజిక్, తీన్మార్లతో హోరెత్తించేస్తున్నారు. రకరకాల బ్యాండ్లతో కిలో మీటర్ల మేర వినిపించే మోతకు తోడు, బాణాసంచా పేలుళ్లతో బెంబేలెత్తిస్తూ సరికొత్త సమస్యలకు కేంద్రాలుగా మారుస్తున్నారు. దీనికితోడు ఆటోలు, మోటారు సైకిళ్లు, లారీలు, బస్సుల హారన్ల మోత భరించలేనిదిగా మారింది. చిన్నచిన్న వ్యాపారులు తోపుడు బండ్లు, ఆటోల్లో మైకుల ద్వారా చేస్తున్న ప్రచారం చికాకు తెప్పించేదే. 40 డెసిబుల్స్ దాటకూడదు.. శబ్ధ తీవ్రతను డెసిబల్స్‌లో కొలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్వని తీవ్రత 40 డెసిబుల్స్ లోపు ఉండాలి. అయితే వరంగల్ నగరంలోనే గాక రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో ధ్వని తీవ్రత 55 డెసిబుల్స్ వరకూ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఎలా.. డెసిబల్స్‌లో గ్రంథాలయాలు 45 దుకాణాలు, రెస్టారెంట్లు 65 పారిశ్రామిక ప్రాంతం 70 ఆసుపత్రులు 40 కార్యాలయాలు 50 నివాసప్రాంతాలు 55 నిశబ్ద జోన్ 10 నిబంధనలు ఏం చెబుతున్నాయి..? శబ్ద కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలి?, నివాసప్రాంతాలు, వ్యాపారకూడళ్లు, పారిశ్రామిక వాడల్లో ధ్వనితీవ్రత ఎలా ఉండాలి?, పరిమితికి మించి శబ్దంతో ఏమవుతుంది?, చదువు, ప్రశాంతతకు భంగం కలిగించే రణగొణ ధ్వనులు వేధిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి లాంటి ప్రశ్నలకు సమాధానాలివే... అనుమతి తప్పనిసరి..! మన ఇంట్లో అయినా సరే పరిమితికి మించి శబ్దం బయటకు రాకూడదు. ఉదాహరణకు టీవీ, టేప్రికార్డు సౌండు, చుట్టుపక్కల వారి ప్రశాంతతకు భంగం కలిగించకూడదు. భజనల పేరిట నిర్వహించే పూజల్లో మైకులు వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. రాత్రి 9గంటల తర్వాత మైకులు వినియోగిస్తే చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో పగలు, రాత్రి వేళల్లో మైకుల మోతలపై నిషేదం విధిస్తున్నారు. మైకులు వినిఝెగించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఎక్కడ, ఏ రోజు ఎప్పటినుంచి ఎప్పటి వరకు మైకు వినియోగిస్తారో తదితర వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఇక్కడ.. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా అనుమతి కోసం దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. వాటిని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తారు. అక్కడి సీఐ దాన్ని పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఏసీపీ స్థాయి అధికారికి పంపిస్తారు. ఆయన క్షుణ్నంగా పరిశీలించి అనుమతిస్తారు. ఒక్కోసారి కొంతమంది ప్రార్ధనా మందిరాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు సమీపంలో మైకు పెట్టేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తారు. వీటిని ఆయా అధికారులు పరిశీలించి అనుమతిని తిరస్కరించేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతారు. ఇలా చేస్తే మేలు... నివాస ప్రాంతాల్లో మైకుల ప్రచారాన్ని కట్టడి చేయాలి. పగటి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాటిని నియంత్రించాలి. పాఠశాలకు సమీపంలో ఎలాంటి ధ్వనులు, గోల లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. -
హారన్.. టెర్రర్
సాక్షి,సిటీబ్యూరో: శరత్ దంపతులు తమ చిన్నారితో కలిసి వాహనంపై వెళ్తున్నారు. పాప తల్లి ఒడిలో నిద్రపోతోంది. ఇంతలో పక్కనే ఓ పెద్ద శబ్దం.. పాప ఉలిక్కిపడి లేచింది. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. రఘువీర్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఆయనకు అసలే గుండె జబ్బు. తన పక్కనే టప్, టప్మని పెద్ద శబ్దాలు వినిపించాయి.. గుండె ఆగినంత పనైంది. ఏమైందోనని ఆందోళనగా చుట్టూ చూస్తే.. భారీ శబ్దాలు బుల్లెట్ వాహనాలవని తేలింది. ఈ రెండు సంఘటనలు నగరంలో ట్రాఫిక్ రద్దీలో ద్విచక్ర వాహనాలు, కార్ల హారన్ల మోతతో జనం పడుతున్న ఇబ్బందులకు ఉదాహరణలు. ప్రశాంతంగా వెళ్తున్న రహదారుల మీద తమ ద్విచక్రవాహనాలకు అమర్చిన మోడిఫైడ్ హారన్లతో ఒక్కసారిగా కుర్రకారుపెద్దపెద్ద శబ్దాలు చేస్తూ శబ్దకాలుష్యం సృష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో బుల్లెట్ సహా 200 సీసీ ఆపై ఇంజిన్ సామర్థ్యం గల భారీ బైక్‌లకు మోడిఫైడ్ హారన్లను, సైలెన్సర్లను అమర్చుకోవడం కుర్రకారుకు ఫ్యాషనైపోయింది. మరికొందరు పూర్తిగా సైలెన్సర్లనే తీసేసి రద్దీ రోడ్లపై వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆయా వాహనాల నుంచి వచ్చే ఈ శబ్దాలకు చిన్నారులు, మహిళలు, వృద్ధులతో పాటు రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు సైతం బెంబేలెత్తుతున్నారు. ఒక్కసారిగా ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. యువత సరదా కోసం చేస్తున్న ఈ పని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ రవాణాశాఖ, ట్రాఫిక్ విభాగాలు అలాంటి వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు. ముఖ్య కూడళ్ల మీద నుంచి ఇలాంటి శబ్దాలు చేస్తూ దూసుకుపోతున్న వాహనాల నుంచి వెలువడుతున్న శబ్దాలను కొలిచేందుకు చేతిలో ఇమిడే సౌండ్ రీడర్లు కూడా ఆయా విభాగాల సిబ్బంద్ది వద్ద అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఎటు చూసినా విపరీత శబ్దాలే.. ప్రస్తుతం యువత ఎక్కువగా బుల్లెట్, అపాచీ, కేటీఎం వంటి బైక్స్‌ను అధికంగా ఇష్టపడుతున్నారు. ఆ వాహనాలు కొన్నాక వాటికి అదనపు హంగులు అమరస్తున్నారు. రంగు, హ్యాండిల్, హారన్ వంటి వాటి ఏర్పాట్ల కోసం కనీసం రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారు. వాహనాలకు కొత్త రకం శబ్దాలను వెలువరించే హారన్లను పెట్టిస్తున్నారు. ఇంకొందరు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను కూడా బిగిస్తున్నారు. పీసీబీ నిబంధనల ప్రకారం 55 డెసిబుల్స్‌ను మించి వెలువడే శబ్దాలు మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. కానీ మోడిఫైడ్ హారన్లతో 90 డెసిబుల్స్ కంటే అధికంగా విపరీత శబ్దాలు నగరంపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ఇతర వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులు, చిన్నారులు, వృద్దులు, రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాహనాలను వేగంగా నడుపుతూ ఒక్కసారిగా ఆన్ఆఫ్ స్విచ్‌ను ఆఫ్ చేసి ఆన్ చేస్తే అతి పెద్ద శబ్దం వెలువడుతుంది. ఇలా ఎన్నిసార్లు ఆన్ఆఫ్ చేస్తే అన్నిసార్లు చప్పుళ్లు వస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. చోద్యం చూస్తున్న యంత్రాంగం.. నగరంలోని ప్రతి రహదారిపైనా ఇలాంటి విపరీత శబ్దాలు నిత్యకృత్యయ్యాయి. ఈ శబ్దాలు విన్న సమయంలో ఏమరుపాటుగా ఉన్నవారు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఇలాంటి విపరీత పోకడలకు కారణమవుతున్న వాహన చోదకులను నియంత్రించే విషయంలో ఇటు ఆర్టీఏ, అటు ట్రాఫిక్ విభాగాలు చోద్యం చూస్తున్నాయని నగరవాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విపరీత శబ్దాలతో ఇతర వాహనదారుల ఏకాగ్రత చెదిరి ఏం జరిగిందో అనే కంగారులో వాహనాన్ని ఆపినా, ఒక్కసారిగా వేగం తగ్గించినా, వెనుక పెద్ద వాహనం వస్తుందని ఒకేసారి పక్కకు జరిగినా ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రేటర్ గూబ గుయ్‌మంటోంది.. పరిమితికి మించి వెలువడుతోన్న ధ్వనులతో గ్రేటర్ గూబ గుయ్‌మంటోంది. మహానగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలున్న సున్నిత ప్రాంతాల్లోనూ శబ్దకాలుష్యం మోతమోగుతోంది. నగరంలోని పలు సున్నిత ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో పీసీబీ నిర్దేశించిన ప్రమాణాలకంటే అధిక ధ్వని కాలుష్యం వెలువడుతోంది. నగరంలో అబిడ్స్, పంజగుట్ట(వాణిజ్య ప్రాంతాలు), జీడిమెట్ల(పారిశ్రామిక ప్రాంతం), జూపార్కు(నిశ్శబ్ద జోన్), గచ్చిబౌలి, జూబ్లీహిల్స్(నివాస ప్రాంతం)లో మాత్రమే పీసీబీ ధ్వని కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు.. మరో వంద ముఖ్య కూడళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు అధికంగా ఉన్న మార్గాల్లో శబ్దకాలుష్య అవధిని నిర్ణయించడంలో పీసీబీ, మున్సిపల్, రవాణా, ట్రాఫిక్ విభాగాలు విఫలమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రణగొణ ధ్వనులతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రేటర్లో శబ్ద కాలుష్యానికి కారణాలివే.. ♦ అధిక ఇంజిన్ సామర్థ్యం గల వాహనాలకు విపరీత శబ్దాలు వెలువడే మోడిఫైడ్ హారన్లు, సైలెన్సర్ల వినియోగం ♦ రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్‌క్రాకర్స్ కాల్చడం, లౌడ్ స్పీకర్లు, డీజే హోరు తదితర కారణాలతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది ♦ ప్రధానంగా భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా రేయింబవళ్లు హారన్ల మోత మోగిస్తుండడంతో సిటీజన్లు ఆందోళనకు గురవుతున్నారు. ♦ గ్రేటర్లో మొత్తం వాహనాల సంఖ్య 50 లక్షలు.. వీటిలో 15 ఏళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు 15 లక్షలకు పైమాటే. వీటి ఇంజిన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతున్నాయి. ♦ గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారులపై సుమారు 100 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి. వీటి వద్ద అధిక సమయం వాహనాలు నిలపాల్సి రావడంతో హారన్ల మోత మానసిక ఆందోళనకు కారణమవుతోంది. ♦ నివాస ప్రాంతాలను ఆనుకొని ఫంక్షన్ హాళ్లు, క్లబ్బులు, పబ్బుల ఏర్పాటుతో వీటి వద్ద డీజేల హోరు చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా మారింది శబ్ద గ్రాహకాల ఏర్పాటులో నిర్లక్ష్యం గ్రేటర్ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ, ప్రైవే టు ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారులు, ముఖ్యమైన కాలనీల్లోనే ఉన్నాయి. వీటిలో సగం ఆస్పత్రులకు శబ్ద గ్రాహకాలు లేవు. దీంతో రోగులు అధిక ధ్వనులు విని గగుర్పాటుకు గురవుతున్నారు. మహానగరం పరిధిలోని సుమారు ఐదువేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ శబ్ద గ్రాహకాలున్నవి అతితక్కువగా ఉన్నాయి. శబ్ద కాలుష్యంతో నష్టాలివే.. ♦ వినికిడి అవధిని దాటి వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. శబ్దం అవధి మించి నమోదయితే అక్కడి నివాసితులకు వినికిడి శక్తి దెబ్బతింటుంది. నిద్రలేమి, అలసట, హృæదయ రక్తనాళాల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ♦ రక్తపోటు పెరుగుదల అధికంగా ఉంటుంది. చేసే పనిపై ఆసక్తి కోల్పోతారు. ♦ నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦ 90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదముంది. చిన్నపిల్లల కర్ణభేరిలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. ♦ పెంపుడు జంతువులు 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయి. నగరంలో నమోదవుతోన్న శబ్ద కాలుష్యం (పగలు/రాత్రి) ఇలా ఉంది.. నివాసప్రాంతం 55 డెసిబుల్స్ దాటరాదు.. ప్రాంతం శబ్ద కాలుష్యం జూబ్లీహిల్స్ 61/57 తార్నాక 55/45 వాణిజ్యప్రాంతంలో పగలు 65, రాత్రి 55 డెసిబుల్స్ మించరాదు. జేఎన్టీయూ 70/67 ప్యారడైజ్ 68/68 సున్నితప్రాంతాల్లో పగలు 50, రాత్రి 45 డెసిబుల్స్ మించరాదు జూపార్కు 60/50 గచ్చిబౌలి 61/55 -
ప్రచారంలో సౌండ్ పెంచితే కేసులే...
సాక్షి, బయ్యారం(ఇల్లందు): ఎన్నికలు వచ్చాయంటే చాలు బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారంతో మైకులు హోరెత్తుతుంటాయి. తమకే ఓటు వేయాలని పల్లెల నుంచి పట్టణాల వరకు మైకులతో ప్రచారం కొనసాగిస్తుంటారు. విపరీతమైన శబ్దాలను పెట్టడం ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండటంతో ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా శబ్దాలను పెట్టినట్లయితే సంబంధిత అభ్యర్థిపై కేసులు నమోదు చేయటంతో పాటు జరిమాన విధిస్తారు. నివాసప్రాంతాల్లో 45–55 డెసిబుల్స్, వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాల ప్రాంతాల్లో 40–50 డెసిబుల్స్, వ్యాపారప్రాంతాల్లో 55–65 డెసిబుల్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో 70–75 డెసిబుల్స్ శబ్దం మాత్రమే వినియోగించాలి. ఇందుకు విరుద్ధంగా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తారు. -
ఉక్కిరిబిక్కిరి
సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా నగరంలో శబ్దకాలుష్యం స్వల్పంగా తగ్గింది. కానీ వాయు కాలుష్యం సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. పీసీబీ జారీ చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యనే టపాసులు కాల్చాలంటూ జారీచేసిన మార్గదర్శకాలు నగరవ్యాప్తంగా అమలుకు నోచుకోలేదు. నగరంలోని సెంట్రల్ జోన్ పరిధిలో ఉల్లంఘనులపై పోలీసులు 71 కేసులు నమోదుచేసినా మిగతా జోన్లలో ఈ నిబంధనలు అమలు చేయకపోవడం గమనార్హం. ఇక టపాసులుకాలుస్తూ కళ్లకు గాయాలైన 14 మందిని సరోజినిదేవీ కంటి ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని, నలుగురి కళ్లకు శస్త్రచికిత్సలు చేశామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో ఇద్దరి కార్నియా పూర్తిగా దెబ్బతినడంతో శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మరో 8 మందికి చికిత్స చేసి ఇంటికి పంపినట్లు చెప్పారు. కాలిన గాయాలతో మరో 11 మంది ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా.. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్వల్పంగా తగ్గిన శబ్ద కాలుష్యం దీపావళి సందర్భంగా నగరంలో కాలుష్య నియంత్రణ మండలి పారిశ్రామిక, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో శబ్ద కాలుష్యాన్ని వేర్వేరుగా నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఢాం.. ఢాం శబ్దాలు స్వల్పంగా తగ్గాయి. ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఉన్న సున్నిత ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది. పెరిగిన వాయు కాలుష్యం తక్కువ శబ్దం వెలువడే క్రాకర్స్ స్థానంలో అధిక పొగ వెదజల్లే బాణసంచా కాల్చేందుకు సిటీజన్లు ప్రాధాన్యం ఇనివ్వడంతో ఈసారి వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికతో స్పష్టమైంది. అయితే, గాలిలో సూక్ష్మ, స్థూల ధూళికణాల మోతాదు గతేడాది కంటే స్వల్పంగా తగ్గినట్లు తేలింది. కానీ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా మోతాదు ఘనపు మీటరు గాలిలో గణనీయంగా పెరిగింది. సాధారణం కంటే అధికమే.. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి రోజు నగర వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాల మోతాదు రెట్టింపయినట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. సూక్ష్మ ధూళికణాల కాలుష్యం సాధారణ రోజుల్లో 34 శాతం మేర నమోదవుతుండగా.. దీపావళి రోజున 61 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. 14వ తేదీ దాకా కాలుష్యం పరిశీలన సుప్రీంకోర్టు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు నగరంలో శబ్ద, వాయు కాలుష్యంపై అక్టోబరు 31 నుంచి ప్రత్యేకంగా నమోదు చేస్తున్నామని పీసీబీ తెలిపింది. ఈనెల 14 వరకు నగరంలో వాయు నాణ్యత, శబ్ద, వాయు కాలుష్యాన్ని శాస్త్రీయంగా లెక్కించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నివేదిస్తామని ప్రకటించింది. -
ఢాం.. ఢాం..
ఆ పల్లె చుట్టూ ఎతైన గుట్టలు, పచ్చదనంతో ఉండే అడవి. ఓ పక్క నుంచి పొలాలకు సాగు నీటిని అందించేందుకు నిర్మించిన మహబూబ్ నహార్ కాల్వ. ఇవి కొల్చారం మండలం రాంనగర్ ప్రత్యేకతలు. ప్రశాంతంగా ఉన్న ఈ ఊరు శివారులోకి 2006లో ‘భూతంలా స్టోన్ క్రషర్ మిల్’ ప్రవేశించింది. సాయంత్రం అయిందంటే భారీ స్థాయిలో బండరాళ్లను పగలగొట్టేందుకు పెద్ద శబ్దాలతో బ్లాస్టింగులు చేస్తుండడం పరిపాటిగా మారింది. ఈ శబ్దాలకు చిన్నపిల్లలు, ముసలి వాళ్లు ఉలిక్కి పడుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడు లేడు. వివరాలతో పరిశోధనాత్మక కథనం కొల్చారం(నర్సాపూర్) : గ్రామానికి అరకిలో మీటరు దూరంలో బోలుగు బండ(గుట్ట). ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 12 ఏళ్ల క్రితం రెండున్నర ఎకరాలకు స్టోన్‌క్రషర్ ఏర్పాటుకు లీజుకు తీసుకోని క్రషర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి క్రషర్‌ను విస్తరించే దిశగా లీజుకు తీసుకున్న వ్యక్తులు నింబంధనలను తుంగలో తొక్కుతూ వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. మైనింగ్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా పేలుడు పదార్థాలను ఇష్టారీతిగా వాడుతుండటంతో ఆ శబ్ధాలకు చుట్టు పక్కల ఉన్న పొల్లాలోని బోర్లు కూలుతుండటంతో పాటు పొలాలోకి వచ్చి పడుతున్న రాళ్లు, దుమ్ముతో ఇక్కడ వ్యవసాయం సాగక బీడుగా ఉంచవల్సిన దుస్థితి. అది కాక పక్కనే ఉన్న ఇందిరానగర్ కాలనీలోని ఇళ్ల గోడలు కూడా బీటలు పారుతున్నాయి. స్టోన్ క్రషర్ యజమానులకు నాయకులతో పాటు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు చర్చిం చుకుంటున్నారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి మైనింగ్ ద్వారా లీజుకు అనుమతి పొందిన సదరు యాజమానులు చుట్టు పక్కల ఉన్న రైతులను నయానో, భయానో బెదిరించి.., నాయకులను మచ్చిక చేసుకోని నాలుగు ఎకరాలకు విస్తరించారు. అధికారులకు లక్షల్లో సొమ్ము ముట్టజెప్పడంతో వీరి వ్యాపారానికి అడ్డు అదుపు లేకుం డా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నా యి. ప్రభుత్వ ఆదాయానికి గండి ఈ కంకర వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులు మైనింగ్ నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. నిర్ధేశించిన లోతు కన్నా ఎక్కువ మేర తవ్వ కం చేపడుతున్నారు. కంకర రవాణలోనూ ఇదే పరిస్థితి. తెల్ల కాగితాలపై బిల్లులు ఇస్తూ ఇష్టారీతిగా రవాణా సాగిస్తున్నారు. వేబిల్ ఎక్కడా కానరాని దుస్థితి. బీడుగా ఉంచుతున్నాం.. రాత్రి పూట పెద్ద ఎత్తున బ్లాస్టింగులు చేస్తున్నారు. దీంతో నీళ్లు పోసే బోర్లు కూలి నీరు అందడం లేదు. అలాగే పొలంలో రాళ్లు పడటంతో వ్యవసాయం చేయలేక భుమిని బీడుగా ఉంచుతున్నాం. ఇదేమిటని ప్రశ్నిస్తే డబ్బులు తీసుకోమని బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. –రాము, రైతు రాంపూర్ చర్యలు తప్పవు.. నిబంధనలకు విరుద్ధంగా నడిచే స్టోన్ క్రషర్‌పై చర్యలు తీసుకుంటాం. వారికి ఇచ్చిన పరిధిలో, నిబంధనలను తప్పని సరి పాటించాలి. అతిక్రమిస్తే ఎవరిపైన అయినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. – జయరాజ్, జిల్లా మైనింగ్ ఏడీ -
గ్రేటర్లో విపరీతమైన శబ్ద కాలుష్యం
సాక్షి, సిటీబ్యూరో: రణగొణ ధ్వనులతో మహానగరంలో మోత మోగుతోంది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాసాలు తదితర సున్నిత ప్రాంతాల్లోనూ విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో శబ్ద కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని కోరుతూ... మున్సిపల్, రవాణా, ట్రాఫిక్ విభాగాలకు హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ విపిన్ శ్రీవాత్సవ రాసిన లేఖను ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ నేతృత్వం లోని ధర్మాసనం ఇటీవల సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధానంగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాలను(శబ్దకాలుష్య రహిత ప్రాంతాలు– నో హాంకింగ్ జోన్స్)గా ప్రకటించాలని ఆయన తన లేఖలో కోరారు. ట్రాఫిక్, రవాణా, పోలీస్ శాఖలు ఆయా ప్రాంతాల వారీగా శబ్ద కాలుష్య అవధిని నిర్ణయించాలని... అంతకుమించి ధ్వనిని వెలువరించే సంస్థలు, వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విన్నవించారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, పెరుగుతోన్న వ్యక్తిగత వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు, చోదక సామర్థ్యం లేని వారికి డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నివారణ చర్యలను వివరించాలని అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో శబ్ద కాలుష్యానికి కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై ‘సాక్షి’ కథనం. పరిమితికి మించిన ధ్వనులతో గ్రేటర్ గూబ గుయ్‌మంటోంది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాసాలున్న సున్నిత ప్రాంతాల్లోనూ మోత మోగుతోంది. నగరంలోని కొన్ని సున్నిత, వాణిజ్య ప్రాంతాల్లో పీసీబీ నిర్దేశించిన ప్రమాణాల కంటే అధికంగా ధ్వని కాలుష్యమవుతోంది. అబిడ్స్, పంజగుట్ట (వాణిజ్య ప్రాంతాలు), జీడిమెట్ల (పారిశ్రామిక ప్రాంతం), జూపార్క్ (నిశ్శబ్ద జోన్), గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ (నివాస ప్రాంతం)లో మాత్రమే పీసీబీ ధ్వని కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు, మరో 100 ముఖ్య కూడళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు అధికంగా ఉన్న మార్గాల్లో శబ్ద కాలుష్య అవధిని నిర్ణయించడంలో పీసీబీ, మున్సిపల్, రవాణా, ట్రాఫిక్ విభాగాలు విఫలమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రణగొణ ధ్వనులతో సిటీజనులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవీ కారణాలు... ⇒ నగరంలో శబ్ద కాలుష్యానికి రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్‌క్రాకర్స్ కాల్చడం, లౌడ్ స్పీకర్లు, డీజే హోరు తదితర ప్రధాన కారణాలు. ⇒ భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా హారన్ల మోత మోగిస్తుండడం. ⇒ గ్రేటర్లో మొత్తం వాహనాల సంఖ్య 50 లక్షలు. వీటిలో 15ఏళ్లకు మించి కాలం చెల్లిన వాహనాలు 15లక్షలకు పైమాటే. వీటి ఇంజిన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతున్నాయి. ⇒ ఇక యూత్ ప్రత్యేక గుర్తింపు కోసం అధిక శబ్దాలు వెలువడే మోడిఫైడ్ హారన్లను వినియోగిస్తుండడంతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ⇒ గ్రేటర్లో సుమారు 100 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లున్నాయి. వీటి దగ్గర అధిక సమయం వాహనాలు నిలపాల్సి రావడంతో హారన్ల మోత మోగుతోంది. ⇒ నివాస ప్రాంతాలకు ఆనుకొని ఫంక్షన్ హాళ్లు, క్లబ్బులు, పబ్బులు ఏర్పాటు చేస్తుండడంతో... అక్కడి డీజేల హోరు స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ⇒ గ్రేటర్లో నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో బోరుబావుల తవ్వకం, లోడర్లు, డంపర్లు లాంటి కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం పెరిగింది. వీటి నుంచి అధిక శబ్దాలు వెలువడుతున్నాయి. శబ్ద గ్రాహకాల ఏర్పాటులో నిర్లక్ష్యం... ⇒ గ్రేటర్ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారులు, ముఖ్యమైన కాలనీల్లోనే ఉన్నాయి. వీటిలో సగం ఆస్పత్రులకు శబ్ద గ్రాహకాలు లేకపోవడంతో రోగులు అధిక ధ్వనులు విని ఆందోళనకు గురవుతున్నారు. ⇒ నగరంలో సుమారు 5వేల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇవి కూడా దాదాపు ప్రధాన రహదారులు, ముఖ్య వీధులు, కాలనీల్లోనే ఉన్నాయి. వీటిల్లోనూ శబ్ద గ్రాహకాలున్న పాఠశాలలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. నష్టాలివీ... ⇔నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబా ్దలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ⇔పెంపుడు జంతువులు 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరీ బద్దలయ్యే ప్రమాదం ఉంటుంది. ⇔అతిధ్వనులు విన్న జంతువులు ఇంటి నుంచి పరుగెత్తి రోడ్డు ప్రమాదాల బారిన పడడం, కరవడం లాంటివి చేస్తాయి. ⇔90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ⇔చిన్నపిల్లల కర్ణభేరీలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వద్ధులకూ శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ⇔అత్యధిక ధ్వనులు విన్నపుడు చిన్నపిల్లల మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. నివారణ చర్యలివీ... ♦ ప్రధానంగా పాఠశాలలు, ఆస్పత్రుల గోడలను అధిక శబ్దాలను నిరోధించే జిప్సం బోర్డులు, ఫైబర్ గ్లాస్ ఇన్సులేషన్స్తో కప్పి వేస్తే ధ్వని లోపలికి చేరకుండా ఉంటుంది. ♦ అధిక శబ్దాలు వెలువడే ప్రాంతాల్లోని భవనాలకు విధిగా శబ్దగ్రాహకాలు ఏర్పాటు చేయాలి. ♦ ప్రతి ఆస్పత్రి, పాఠశాల ఆవరణలో గ్రీన్‌బెల్ట్‌ను అధికంగా ఏర్పాటు చేయాలి. అధిక శబ్దాలను గ్రహించేందుకు హరిత వాతావరణం దోహదం చేస్తుందని గుర్తించాలి. గ్రీన్బిల్డింగ్ల నిర్మాణాలను ప్రోత్సహించాలి. ♦ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయినా 8గంటల పాటు 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు పాటించాలి. ♦ అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి. ♦ ట్రాఫిక్ రద్దీలో బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి. దీర్ఘకాలంలో వినికిడి లోపం... వినికిడి అవధిని దాటి అధికంగా వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. శబ్ద కాలుష్యం అవధిని మించి నమోదయితే అక్కడి నివాసితులకు చెవిలో రింగురింగుమంటూ శబ్దాలు వినిపిస్తాయి. దీర్ఘకాలం ఈ శబ్దాలను వినే వారికి శాశ్వత వినికిడి లోపం వస్తుంది. నిద్రలేమి, అలసట, హృæదయ రక్తనాళాల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. రక్తపోటు పెరుగుదల అధికంగా ఉంటుంది. చేసే పని మీద ఆసక్తిని కోల్పోతారు. – డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ వైద్యనిపుణులు, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి -
విశాఖ ఎయిర్‌పోర్టులో అనౌన్స్మెంట్ బంద్
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం నుంచి ప్రయాణికులకు అనౌన్స్మెంట్ సిస్టంను బంద్ చేశారు. దిస్ ఈజ్ ఏ సైలెంట్ ఎయిర్పోర్ట్ అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ దేశీ య, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి అనూహ్యంగా పెరగడం, వరుసగా విమానాల రాకపోకలు సాగిస్తుండడంతో అనౌన్స్మెంట్ల ప్రక్రియను గతంలో పెంచారు. విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్‌లోనే కాదు. ఎదురుగా ఉన్న గార్డెన్‌లోనూ సౌండ్ హారన్లు ఏర్పాటు చేశారు. విమానాల రాకపోకల అనౌన్స్మెంట్ బస్‌స్టాండ్‌లో మాదిరిగా ఇక్కడా వినిపించేది. అయితే తాజాగా విమానాశ్రయ అధికారులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. విమానాల తాకిడి పెరగడంతో శబ్దకాలుష్యం పెరిగిందని చెబుతున్నారు. ఇలా మంగళవారం నుంచి అనౌన్స్మెంట్ ప్రక్రియను నిలుపుదల చేశారు. ఇక్కడ డిస్ప్లే బోర్డులను గమనించి విమాన సర్వీసులు ఉపయోగించుకోవాలని డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి సూచించారు. ప్రయాణికులకు డిస్‌ప్లేబోర్డులతో పాటు వారి ఫోన్లకు ముందస్తు సమాచారాలను అనుసరించి విమాన సర్వీసులు వాడుకోవాలని కోరారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇలాంటి చర్యలు ఉన్నాయని చెప్పారు. అత్యవసరాల్లో మాత్రమే అనౌన్స్మెంట్లు జరుగుతాయని వివరించారు. -
దడ పుట్టిస్తున్న సైలెన్సర్లు!
మామూలు శబ్దం కాదు.. తుపాకీ నుంచి తూటా దూసుకొచ్చినంత సౌండ్. రాకెట్లాగా నిప్పులు చిమ్ముకుంటూ ప్రయాణం.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగం.. అంతా కుర్రకారే.. రేసుల కోసం.. ప్రత్యేక ఆకర్షణ కోసం.. ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు వింతైన సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. తెనాలిలోని ఓ వ్యాపారి తన కుమారుడు బీటెక్ పూర్తి చేసిన ఆనందంలో అతని కోరిక మేరకు బుల్లెట్ కొనిచ్చాడు. అప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఓ మెకానిక్ అధిక శబ్దంతో పాటు నిప్పులు చెరిగే సైలెన్సర్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న యువకుడు నేరుగా అక్కడకు వెళ్లి మెకానిక్ కోరినంత డబ్బు ఇచ్చి నిప్పులు చెరిగే సైలెన్సర్‌ను వాహనానికి బిగించుకున్నాడు. దీంతో రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపై హల్చల్ చేస్తున్నాడు. నిప్పులు చెరుగుతూ బుల్లెట్ వెళుతుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ.. రోడ్డు పక్కకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు బైక్ రేసులకు రహస్యంగా వెళ్లడం ప్రారంభించాడు. గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు జిల్లాలో గడచిన నాలుగేళ్లలో యువతలో బుల్లెట్ల క్రేజ్ పెరిగింది. అధునాతనంగా తీర్చిదిద్దిన వాహనానికి అదనపు హంగులు కోసం ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కొందరు మెకానిక్‌లు వారిదైన శైలిలో యువత మోజును క్యాష్ చేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే మరి కొందరు జిల్లాలోనే నకిలీ సైలెన్సర్లను తయారు చేసి గుట్టుగా విక్రయాలు చేస్తున్నారు. మార్పులు ఇలా... జిల్లా వ్యాప్తంగా గడచిన నాలుగేళ్లలో ప్రతిఏటా సగటున 700 బుల్లెట్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. అధికంగా యువత వాటినే కొనుగోలు చేసేందుకు ఆసకి చూపుతున్నారు. వాహన కొనుగోలు చేసిన అనంతరం బుల్లెట్‌కు నిబంధనల ప్రకారం 70 నుంచి 80 డెసిబుల్స్ లోపు శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని తొలగించి వాటి స్థానంలో 90 నుంచి 160 డెసిబుల్స్ సౌండ్ వచ్చే వాటిని బిగించుకుని హంగామా సృష్టిస్తున్నారు. అయితే వీటితో పాటు పటాకా పేరుతో నూతనంగా మార్కెట్లోకి మంటలు వచ్చే సైలెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. రకాలను బట్టి రూ.2 వేల నుంచి రూ.28 వేల వరకు మెకానిక్‌లు వసూలు చేస్తున్నారు. వాటితో పాటు అధిక శబ్దం వచ్చే విధంగా హారన్లను బిగిస్తున్నారు. ఇలా అదనపు హంగులను ఏర్పాటు చేసుకుంటున్న యువత రహస్యంగా బైక్ రేస్‌లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గత నెలలో విజయవాడలో బైక్ రేస్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కొందరు మెకానిక్‌లు తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి ఆర్డర్లపై సైలెన్సర్లను తెప్పించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో నకిలీ సైలెన్సర్ల తయారీ.. ఇదిలా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మండలాలను బైక్ రేసులకు అనువైన ప్రాంతంగా యువత ఎన్నుకొంటోంది. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఏకంగా విజయవాడ, తాడేపల్లి, మంగళగిరితో పాటు తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నకిలీ సైలెన్సర్లను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న సైలెన్సర్లు అధిక రేటు కావడంతో యువత తక్కవ ధరకు వచ్చే వాటిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి నకిలీలను తనకు నమ్మకమైన మెకానిక్‌లకు మాత్రమే అమ్ముతున్నట్టు సమాచారం. తెనాలిలో ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కానిస్టేబుల్ చెందిన దుకాణంలో మెకానిక్ విజయవాడ నుంచి సైలెన్సర్లను తెప్పించి మరీ విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. భారీ శబ్దం వచ్చే హారన్లు, సైలెన్సర్లను బిగించి వాహనాలతో రోడ్లపై యువత హల్చల్ చేస్తున్నారు. ఫలితంగా తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక గుండెపోటు వున్న వారి సంగతి అంతే. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రవాణా, పోలీస్, శబ్ద కాలుష్యం శాఖల మధ్య సమన్వయం లోపంతో యువత ఇష్టాను సారంగా రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. -
‘విమానం’ మోత!
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతతకు మారుపేరు విశాఖ నగరం. హాయిగొలిపే వాతావరణం, ప్రకృతి సౌందర్యం, సాగరతీరం ఈ మహానగరం సొంతం. అందుకే ఎక్కడెక్కడో పదవీ విరమణ చేసిన వారు కూడా ఇక్కడే శేష జీవితం గడపాలని కోరుకుంటారు. వందల సంఖ్యలో ఉన్న ఆస్పత్రుల్లో వేలాది మంది రోగుల నిత్యం వైద్యం పొందుతుంటారు. అలాంటి విశాఖలో పౌర, యుద్ధ విమానాలు రకరకాల శబ్దాలతో జనానికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా యుద్ధ విమానాలు చెవులు చిల్లులుపడేలా రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతూ కంటిమీద కునుకులేకుండాచేస్తున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు విమానాల తాకిడి రోజు రోజుకు అధికమవుతోంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసులూ పెరుగుతున్నాయి. ప్రస్తు తం రోజుకు నగరం మీదుగా 70కి పైగా పౌర విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శిక్షణలో భాగంగా 130కి పైగా వివిధ రకాల యుద్ధ విమానాలు భారీ శబ్దాలు, విన్యాసాలతో హోరెత్తిస్తున్నా యి. వెరసి విశాఖ విమానాశ్రయం, నేవీ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగాకు రోజుకు 200 వరకు విమానాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సమీప భవిష్యత్‌లో ఈ సంఖ్య 300కు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ఇటు పౌర విమానయాన సంస్థలు, అటు నావికాదళం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వాస్తవానికి పౌర విమానాలకంటే రక్షణశాఖ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల నుంచి వచ్చే శబ్ద కాలుష్యమే ఎక్కువగా ఉంటుంది. ఇది మనిషి భరించే స్థాయికంటే రెట్టింపు ఉండడమే ఇప్పుడు విశాఖ వాసుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఒక మనిషి 80 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని భరించగలుగుతాడు. పౌర విమానాల వచ్చే శబ్ద కాలుష్యం 120 డెసిబుల్స్, అదే యుద్ధ విమానాలైతే మరింత ఎక్కువగాను ఉంటుంది. రోజులో 45 నిమిషాల పాటు 120 డెసిబుల్స్‌కు మించి శబ్దం వెలువడితే బధిరత్వం సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతుల కంటే రోగులకు శబ్ద కాలుష్యం మరింతగా ప్రభావం చూపుతుంద ని వీరు పేర్కొంటున్నారు. విశాఖలో పలు ప్రభు త్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో వేల సంఖ్యలో రోగులు చికిత్స పొందుతుం టారు. వీరు కాకుండా అనారోగ్యంతో ఇళ్లలో ఉం టున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారంతా శబ్ద కాలుష్యం బారిన పడక తప్పదని చెబుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులోవాయిస్ కంప్లైంట్ సెల్‌తో.. విమానాల నుంచి వెలువడే అధిక శబ్దాల వల్ల స్థానికులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు తలెత్తే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ తాజాగా వాయిస్ కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేసింది. అలాంటి సెల్‌ను విశాఖలోనూ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంటోంది. -
కాటేస్తున్న శబ్ద కాలుష్యం...!
శబ్దకాలుష్యాన్ని ఒక పెనుప్రమాదంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. ఇప్పటివరకు దీని వల్ల ఎదురయ్యే సమస్యలను పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంటూ దీని వల్ల కుంగుబాటు, మానసిక ఒత్తిడి మొదలుకుని షుగర్వ్యాధికి, అంతిమంగా గుండెపోటుకు దారితీయవచ్చునని పేర్కొంది. శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ద్వారా ఈ శబ్దాలు ‘సైలెంట్ కిల్లర్’గా మారినట్టు ఐరోపా కమిషన్ సైతం అభిప్రాయపడింది. ఈ శబ్దాలు హైపర్‌టెన్షన్, ఒబెసిటీ, డయాబెటీస్, గుండెపోటు వంటి వాటికి కారణమవుతాయని కమ్యూనిటీ ఆఫ్ హెల్త్, లీగల్ ప్రొఫెషనల్స్ ‘ ది క్వయిట్ కోయలుషన్’ చైర్మన్ డా. డేనియల్ ఫింక్ చెబుతున్నారు.. ఢిల్లీలో అత్యధిక సగటు వినికిడి శక్తి లోపం.... మొత్తంలో ప్రపంచనగరాల్లో చూస్తే మన దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక సగటు వినికిడి (సామర్థ్యం)లోపం రికార్డయింది. ఇది మిగతా నగరాలతో పోల్చితే అత్యంత అధికం. శబ్దకాలుష్యం వల్ల సాథారణ ఢిల్లీ వాసి తనకన్నా 19.34 ఏళ్ల పెద్దవాళ్లు సహజంగా కోల్పోయో వినికిడి ఇప్పుడే కోల్పోతున్నాడు. నగరాల్లో విస్తరిస్తున్న వినికిడి కోల్పోయే ప్రమాదాలపై గతేడాది మిమి హియరింగ్ టెక్నాలజీస్ ‘ప్రపంచ వినికిడి సూచిక’ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా రెండులక్షలకు పైగా వినికిడి పరీక్షలను నిర్వహించింది. ఈ ఫలితాలతో పాటు డబ్ల్యూహేచ్‌ఓ శబ్దకాలుష్యం డేటా, నార్వే పరిశోధన సంస్థ సింటెఫ్ సమాచారాన్ని బట్టి 50 దేశాల్లో శబ్దకాలుష్యం, వినికిడి లోపాల సమస్యలపై ఈ సూచిక తయారు చేసింది. దీనిలో భాగంగానే ఢిల్లీలో అత్యంత సగటు వినికిడి సామర్థ్యలోపాలున్నట్లు కనుగొనింది. మొత్తంగా శబ్దకాలుష్యపరంగా చూస్తే చైనాకు చెందిన గ్యాంజావో నగరం ప్రధమస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఈజిప్ట్ రాజధాని కైరో, ఫ్రాన్స్ రాజధాని పారిస్, చైనా రాజధాని బీజింగ్,, అయిదోస్థానంలో భారత రాజధాని ఢిల్లీ ఉన్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. పరిష్కారాలు... రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న ఈ సమస్యను పూర్తిగా అరికట్టలేకపోయినా పరిమితులలో ఉంచేందుకు ట్రాఫిక్ నియంత్రణ వ్యూహాలు, లైట్‌రైల్ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర వాహనాల ప్రోత్సాహం, వాహనాలకు వేగ నియంత్రణ ఏర్పాట్లు, శబ్దాల నియంత్రణ పద్ధతుల ఏర్పాటు వంటి చర్యలను ప్రారంభించాలని శబ్దకాలుష్యంపై పరిశోధకుడు డా. జాన్ కింగ్ సూచించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నో హారన్ ప్లీజ్...
ఈ నినాదం ఎన్నో వాహనాల వెనుక రాసి ఉంటుంది.. కానీ పాటించేదెవ్వరు? ఈయన పాటిస్తున్నాడు.. 18 ఏళ్లుగా! నోరెళ్లబెట్టారా? రోజూ హారన్ కొట్టికొట్టి వాహనాలు నడిపే.. మనలాంటి వాళ్లకు ఇలాంటోళ్లను చూస్తే.. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది మరి.. అందుకే ఈయనకు ఆ మధ్య ‘మానుష్ సన్మాన్’ అనే పురస్కారాన్ని కూడా ఇచ్చారు. ఇంతకీ ఈయనెవరో చెప్పలేదు కదూ.. పేరు.. దీపక్ దాస్.. కోల్‌కతాలో ఉంటారు. శబ్ధ కాలుష్యంలో ఈ హారన్లదీ కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసినా.. మరో వాహనం మనకు దగ్గరగా వచ్చినా.. హారన్‌తో ఓసారి హెచ్చరిస్తాం. ‘హారన్ల వల్ల శబ్ద కాలుష్యం మరింత పెరుగుతుంది. నో హారన్ పాలసీని అనుసరించడం ద్వారా డ్రైవర్ మరింత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతాడు. టైమింగ్, వేగం, ఎంత స్పేస్ ఉందన్న విషయంపై తగిన అవగాహన ఉంటే చాలు.. హారన్‌తో పనే లేదు’ అని దీపక్ దాస్ చెబుతారు. కారు డ్రైవర్‌గా పనిచేసే దీపక్.. ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు తన కస్టమర్లు హారన్ ఉపయోగించాలని కోరుతుంటారని.. తాను సున్నితంగా తిరస్కరిస్తుంటానని తెలిపారు. దూర ప్రయాణాల విషయంలోనూ తనది ఇదే పాలసీ అని చెప్పారు. తన స్ఫూర్తితో కొంతమందైనా డ్రైవర్లు మారితే చాలన్నారు. తమ వినూత్న ప్రతిభ ద్వారా సమాజానికి మంచి చేసే వ్యక్తులను ‘మానుష్ మేలా’ అనే సంస్థ ఏటా మానుష్ సన్మాన్ అవార్డుతో సన్మానిస్తుంది. దీపక్ గతంలో పలువురు ప్రముఖులతోపాటు పలు సంస్థల్లో డ్రైవర్‌గా పనిచేశారని.. అందరినీ కనుక్కున్నాకే.. పూర్తిస్థాయి పరిశీలన అనంతరమే.. దీపక్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సదరు సంస్థ ప్రతినిధులు చెప్పారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
‘బుల్లెట్’ సౌండ్‌పై ఫైన్
కరీంనగర్: అతివేగంతో పాటు, కర్ణకఠోర శబ్ధాలతో దూసుకెళ్తున్న ద్విచక్రవాహనాలకు పోలీసులు కళ్లెం వేశారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు విపరీతమైన శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న 16 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహనదారులకు జరిమానాలు విధించారు. జిల్లా కేంద్రంలో గత కొంత కాలంగా ద్విచక్రవాహనాల శబ్ధ హోరు ఎక్కువవడంతో బుధవారం రంగంలోకి దిగిన పోలీసులు 16 మందికి జరిమాన విధించారు. పట్టుబడిన వాహనాలన్ని బుల్లెట్ బైక్‌లే కావడం విశేషం. -
చెవికి చిల్లులే...
- ధ్వని కాలుష్యంలో గ్రేటర్ నాలుగో స్థానం - యువతలో వినికిడి శక్తి తగ్గుతోందంటున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: లక్షల్లో దూసుకుపోతున్న వాహనాలు... కుర్రకారు వాడే ఆధునిక హారన్లు... రణగొణలతో సిటిజనుడి గూబ గుయ్యిమంటోంది. కాలం చెల్లిన డొక్కు బస్సులు, కార్లు... ఎక్కడ చూసినా ట్రాఫిక్ పద్మవ్యూహాలు... ధ్వని కాలుష్యంతో భాగ్యనగరి దద్దరిల్లుతోంది. దేశంలో అత్యధికంగా శబ్ద కాలుష్యం బారినపడే ఆరు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ది నాలుగో స్థానం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో సగటున 85 డెసిబుల్స్ శబ్ద కాలుష్యంతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో 80 డెసిబుల్స్‌తో ఢిల్లీ, 75 డెసిబుల్స్‌తో చెన్నై ఉన్నాయి. 73 డెసిబుల్స్ కాలుష్యంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధార ణంగా మనిషి వినే శబ్ద అవధి 55 డెసిబుల్స్ ను మించరాదు. ధ్వని కాలుష్యంవల్ల యువతలో వినికిడి శక్తి 15 శాతం మేర తగ్గుతున్నట్లు ఈఎన్టీ వైద్య నిపుణులు చెబుతున్నారు. నగరంలో శబ్ద కాలుష్యానికి కారణాలివే ► కుర్రకారు వినియోగించే మోడిఫైడ్ హారన్ల వల్ల శబ్ద అవధి 75 డెసిబుల్స్ కంటే అధికంగా ఉంటోంది. ► గ్రేటర్ లో వాహనాల సంఖ్య 46 లక్షలు. బయటి నుంచి నిత్యం 10 లక్షల వరకు వస్తాయి. ఇవన్నీ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవడంతో ఏర్పడే రణగొణలతో ధ్వని రెట్టింపవుతోంది. ► మెట్రో రైలు పనుల నేపథ్యంలో భారీ నిర్మాణ యంత్ర సామగ్రి వినియోగం, స్టీలు, ఇనుప బారికేడ్లు తదితరాల వల్ల కూడా అధిక ధ్వనులు వెలువడుతున్నాయి. వివిధ నిర్మాణాల్లో జేసీబీలతో తవ్వకాలు, బోర్లు, జనరేటర్ల వినియోగం వల్లా ధ్వనులు పెరుగుతున్నాయి. ► నగరంలో కాలం చెల్లిన వాహనాలు 20 లక్షలు. ఇవన్నీ రోడ్డెక్కుతుండడంతో రణగొణలు అధికమవుతున్నాయి. ► గ్రేటర్ లో మొత్తం వాహనాలు 46 లక్షలు. అందుబాటులో ఉన్న రహదారులు 6,500కి.మీ. మాత్రమే. దీంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడి హారన్లు మోతమోగుతున్నాయి. ► డీజే సంగీత హోరుకు కూడా యువత వినికిడి శక్తి కోల్పోతోంది. అత్యధికంగా నమోదయ్యే ప్రాంతాలు ► నగరంలో అత్యధికంగా 70 నుంచి 80 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం వెలువడుతున్న జాబితాల్లో అబిడ్స్, పంజగుట్ట, జూబ్లీహి ల్స్, ప్యారడైజ్,చార్మినార్, జేబీఎస్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కూకట్పల్లి, జేఎన్టీయూ తదితర ప్రాంతాలున్నాయి. సెలైంట్ జోన్స్‌గా పరిగణించే కోర్టులు, ఆస్పత్రు లు, ప్రార్థనా స్థలాలు, జూపార్క్ వంటి ప్రాంతాల్లోనూ శబ్ద కాలుష్యం 70 డెసిబుల్స్‌ను దాటుతుండడంతో రోగులు, వణ్యప్రాణులు అవస్థలు పడుతున్నాయి. కలిగే నష్టాలివే... ► పగటి వేళల్లో 55, రాత్రి వేళల్లో 45 డెసిబుల్స్ శబ్ద అవధిని దాటి వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. దీర్ఘకాలం ఈ శబ్దాలను విన్నవారికి శాశ్వత వినికిడి లోపం వస్తుంది. నిద్రలేమి, అలసట, రక్తపోటు పెరుగుతాయి. ► నగరంలో ఈఎన్టీ వైద్యులను సంప్రదిస్తున్న ప్రతి వెయ్యి మందిలో 20 శాతం మందికి వినికిడి శక్తి తగ్గినట్టు గుర్తించారు. ► నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారు. వారి గుండె వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► అత్యధిక ధ్వనులు విన్నపుడు పిల్లల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. ఇలా కాపాడుకోవాలి ► కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయిన 8 గంటల పాటు నిరంతరాయంగా 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు పాటించాలి. ► అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి. ► sాఫిక్ రద్దీలో బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి. -
హారన్ కొడితే.. ఇక భారీ ఫైన్!
రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది.. ముందు కనీసం పాతిక నుంచి యాభై వరకు వాహనాలు ఉంటాయి. ఆ వెనకాల నుంచి ఒకటే హారన్ మోతలు. ముందు వాహనాలు కదిలే పరిస్థితి లేదని తెలిసినా, తమకు దారి ఇవ్వాలంటూ హారన్ కొట్టేవాళ్లను చూస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. ఇలాంటి పరిస్థితి మన దేశంలో సర్వసాధారణం. దీనివల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ఇలా అవసరం లేకపోయినా హారన్ కొట్టేవారికి రూ. 500 నుంచి రూ. 5వేల వరకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మల్టీ టోన్ ఎయిర్ హారన్లు బిగించే డీలర్లు, గ్యారేజి యజమానులకు లక్ష రూపాయలు కూడా వడ్డన పడే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి, మోటారు వాహన చట్టానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేయాలని కేంద్రం తలపెడుతోంది. హారన్లు కొట్టేవాళ్లకు జరిమానాలు వడ్డించాలన్న ప్రతిపాదనలకు వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు కూడా ఆమోదం తెలిపారు. నిబంధనలను మొదటిసారి ఉల్లంఘిస్తే రూ. 500, రెండోసారి అయితే వెయ్యి రూపాయల చొప్పున ఫైన్ వేస్తారట. ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే హెడ్‌లైట్ ఫ్లాష్ చేయడంతో పాటు చిన్నగా ఒకసారి హారన్ కొడితే తప్పులేదు గానీ, అనవసరంగా పదే పదే మోగించేవాళ్లకు మాత్రం జరిమానాలు తప్పవట. నివాస ప్రాంతాలతో పాటు సైలెంట్ జోన్లుగా పేర్కొనే ప్రాంతాలలో కూడా హారన్లు మోగించకూడదు. ప్రధానంగా స్కూళ్లు, ఆస్పత్రులు ఉన్నచోట హారన్ కొట్టకూడదన్న బోర్డులు ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోరు. ఇలాంటివాళ్లను అదుపుచేయడానికే జరిమానాలు వేయబోతున్నారు. -
ఇక పెళ్లిళ్లపై నిఘా నేత్రం
దేశ రాజధాని నగరంలో ప్రాణాంతకంగా పరిణమించిన కాలుష్యాన్ని నివారించేందుకు ఇటీవల 'సరి-బేసి' కార్ల విధానాన్ని తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు అట్టహాసంగా జరుపుకొనే పెళ్లిళ్లపై కన్నేసింది. ఢమాల్, ఢమాల్ అనే టపాసుల పేలుళ్లను, ఢమ ఢమ డప్పు శబ్దాలను, కర్ణభేరి పగిలిపోయేలా వినిపించే మైక్ శబ్దాలను నియంత్రించాలని, అలాగే ఆహార పదార్థాల వృధాను అరికట్టాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. దీనికోసం శబ్దాలను కొలిచే యంత్రాలను సొంత డబ్బులతో కొనుగోలు చేసి అన్ని కళ్యాణ మండపాలలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. పశ్చిమబెంగాల్లో లాగా టపాసులు కాల్చడాన్ని 90 శాతం నియంత్రించాలని, కేవలం లాంఛనంగా కాల్చేందుకే అనుమతించాలని నిశ్చయించింది. పెళ్లిళ్ల సీజన్లో టపాసుల కారణంగా వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. కమిటీ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసేందుకు, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రతి పెళ్లి మండపం వద్ద ఇద్దరు, ముగ్గురు పౌర అధికారులతో నిఘాను ఏర్పాటు చేయాలని పీసీబీ నిర్ణయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయాలను అమలు చేసేందుకు వీలుగా ప్రతి జిల్లా స్థాయిలో నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కమిటీ తీర్మానించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనల మేరకే కాలుష్య నియంత్రణ మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ఢిల్లీ వాసులకు పీడకలే. కంటి మీదకు కునుకు రాదు. టపాసుల పేలుళ్లతో పాటు వాయిద్యాల మోత, హోరెత్తే సంగీతంతో తల వాచిపోతుంది. సీజన్లో రోజుకు దాదాపు 20 వేల చొప్పున పెళ్లిళ్లు జరుగుతాయి. దక్షిణ ఢిల్లీలోని ఛాతర్పూర్, మెహరౌలి, ఎన్‌హెచ్ వన్ వెంటనున్న అలీపూర్ ఎన్‌హెచ్ 24 వెంటనున్న వైశాలి, కౌశాంబి ప్రాంతాలు పెళ్లిళ్లకు పేరెన్నికగన్న ప్రాంతాలు. -
గణేశ్ మండపాలపై కఠిన ఆంక్షలు
వినాయక చవితి సందర్భంగా అనుమతి లేకుండా మండపాలు పెట్టినా, నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించినా కోర్టు ధిక్కార నోటీసులు జారీచస్తామని బాంబే హైకోర్టు హెచ్చరించింది. ఈ ఉత్సవాల్లో పెద్ద తలకాయలు ఉంటాయి కాబట్టి, మునిసిపల్ కార్పొరేషన్ వాళ్లను ఏమీ అనలేని పరిస్థితి ఉంటుందని, నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. మండపాలు ఏర్పాటుచేసే ముందే అనుమతులు కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. రోడ్ల మీద అక్రమంగా మండపాలు ఏర్పాటు చేయడం, విపరీతంగా శబ్దకాలుష్యం సృష్టించడంపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ వీఎల్ అచ్లియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వినాయకచవితితో పాటు దహీ హండీ ఉత్సవం సందర్భంగా ఎక్కడపడితే అక్కడే మండపాలు పెడుతున్నారని, నిబంధనలను అతిక్రమిస్తున్నారని, అయినా కార్పొరేషన్ మాత్రం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది సంజీవ్ గోర్వాడ్కర్ కోర్టుకు తెలిపారు. మామూలు మండపాల కంటే, శివసేన, కాంగ్రెస్, ఎంఎన్ఎస్ లాంటి పార్టీలు పెడుతున్న మండపాల్లో శబ్దాలు నిర్ధారిత స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని కోర్టు తెలిపింది. -
ధ్వని కాలుష్య నియంత్రణకు బీఎంసీ చర్యలు
సాక్షి, ముంబై: నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ధ్వని కాలుష్య పరిమాణాన్ని అంచనా వేయాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. ఇందుకు గాను నగరంలో 1,200 చోట్ల ధ్వని కాలుష్య స్థాయిని నిర్ధారించే యంత్రాలను అమర్చనుంది. యంత్రాల ద్వారా లభించే గణాంకాలను బట్టి ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని బీఎంసీ భావిస్తోంది. దీనికోసం బీఎంసీ పరిపాలన విభాగం దాదాపు రూ.77 లక్షలు ఖర్చు చేయనుంది. నగరంలో ధ్వని కాలుష్యం అంశం ఇటీవల బీఎంసీ స్థాయి సమితిలో చర్చకు వచ్చింది. అయితే నగరంలో ధ్వని కాలుష్యం ఏయే ప్రాంతాల్లో, ఏ మేరకు దాని తీవ్రత ఉందన్న విషయమై బీఎంసీ వద్ద వివరాలు లేవు. దీంతో ముందుగా ధ్వని కాలుష్య స్థాయిని అంచనా వేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. -
లైట్ అండ్ స్మైల్
నగరంలో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న వాహనాలు, సాంకేతిక పరికరాల వాడకం, పచ్చదనం తగ్గిపోతుండటం.. ఇలాంటి కారణాలతో పొల్యూషన్ ఒక సొల్యూషన్ లేని సమస్యగా మారిపోతోంది. అయినా పండుగ సంబరాల పేరిట రూ. వేలల్లో ఖర్చుపెట్టి మరి కాలుష్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాలుష్యం లేని క్రాకర్స్‌తో, మరిన్ని దీపాల వెలుగులతో పండుగను జరుపుకోలేమా? టపాసులతో పాటు ఈ దీపావళిని పచ్చని పండుగగా మలుచుకుందాం. - ఎస్.సత్యబాబు సుప్రీంకోర్టు విధించిన పరిమితి ప్రకారం.. క్రాకర్స్ చేసే శబ్ద పరిమాణం 125 డెసిబుల్స్ మించకూడదు. అది దాటితే వ్యక్తుల్లో వినికిడి లోపం కలిగే ప్రమాదం ఉంది. అయితే నగరంలో అత్యధికులకు ఎకో ఫ్రెండ్లీ, స్మోక్ లెస్ ఫైర్ క్రాకర్స్ గురించి అవగాహన లేదు. దేశంలోని ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన సిటీలోనే వినియోగం తక్కువ. ఈ ఉత్పత్తులపై అవగాహన పెరిగితే మాత్రమే మనం కాలుష్య రహిత దీపావ ళిని భావితరాలకు పండుగ లాంటి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వగలం. ఎకో ఫ్రెండ్లీ.. సంప్రదాయ క్రాకర్స్‌కు భిన్నంగా ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ వాక్యూమ్ కంబషన్ మెథడ్‌లో రూపొందుతున్నాయి. వీటిని రిసైకిల్డ్ పేపర్‌తో తయారు చేస్తారు. తయారీలో ఎటువంటి కెమికల్స్ వినియోగించరు. తద్వారా శబ్దం, పొగ రెండూ తక్కువగానే వస్తాయి. వీటిని వీధిలోనే అక్కర్లేదని ఇంట్లో సైతం కాల్చుకోవచ్చని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు ఈ క్రాకర్స్ విభిన్న రకాల సైజ్లు, షేప్స్‌లో, పోకీమాన్, మ్యాంగో మ్యాజిక్, రెయిన్బో స్మోక్, స్వీట్.. వంటి పేర్లతో లభిస్తున్నాయి. ఇవి కూడా తమిళనాడులోని శివకాశిలోనే తయారవుతున్నాయి. మామూలు క్రాకర్స్ రూ.100 నుంచి రూ.10,000 దాకా ఖరీదులో ఉంటే, ఇవి రూ.40 నుంచి రూ.1,500 వరకూ మాత్రమే ఉన్నాయి. జర దీరే జలావో.. రెగ్యులర్ క్రాకర్స్‌లో కాపర్, పొటాషియం నైట్రేట్, కార్బన్, లెడ్, కాడ్మియమ్, జింక్, సల్ఫర్.. వంటి రసాయనాలుంటాయి. ఇవి కాల్చినప్పుడు విషతుల్యమైన వాయువులు వాతావరణంలోకి కలసిపోతున్నాయి. వీటి ద్వారా వినికిడిలోపం, అధిక రక్తపోటు, శ్వాసకోస ఇబ్బందులు, స్కిన్ అలర్జీస్ వంటి రకరకాల సమస్యలు కలుగుతున్నాయి. చప్పుడు లేకుండా వెలుగులు చిమ్మే అవకాశం వున్న మతాబులు, ఆకాశ దీపాలు వంటి ఆప్షన్లతో.. లెటజ్ గో ఫర్ ఎకో అండ్ ప్యాకెట్ ఫ్రెండ్లీ ఫెస్టివల్. ‘గ్రీన్’ టిప్స్.. - దీపాలను అమర్చే రంగోలీని ఆర్గానిక్ రంగులతో నింపండి. తాజా పువ్వులు, మట్టి ప్రమిదలతో చూడచక్కని రంగోలీ చేసుకోవచ్చు. - ఫుడ్ కార్నర్, రీడింగ్ కార్నర్ లాగా ఈ దివాలీకి ఇంట్లో గ్రీన్ కార్నర్‌ని ఏర్పాటు చేయండి. - బాల్కనీ లేదా టైపై గ్రీన్ కార్నర్‌ను ఏర్పాటు చేసుకోగలిగితే.. గ్రీన్ దివాలీ సూపర్బ్‌గా చేసుకోవచ్చు. - విద్యుత్ ఆదా చేసే ఎనర్జీ సేవింగ్ ఎల్ఈడి లైట్స్‌తో ఇంటిని వెలిగించండి. - పచ్చని మొక్కలు, ఎల్ఈడీ లైట్లు, హ్యాండ్ మేడ్ దీపాలు, జ్యూట్‌తో చేసిన కళాత్మక వస్తువులు... వీటిని బహుమతులుగా అందించవచ్చు. - వీటితో పాటు వర్చువల్ టపాసులు, లైట్లు, సౌండ్స్‌తో పండుగ సంబరాల అనుభూతిని కాలుష్యరహితంగా కలిగిస్తాయి. -
హైదరాబాదలో పెరుగుతున్న శబ్ద కాలుష్యం