సాక్షి, సిటీబ్యూరో: వినాయకచవితి పండగ సమీపిస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఎక్కడి వారు అక్కడే తమకు దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా కొలనులు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్‌ఎంసీ నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనులతోపాటు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనుల్ని నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు.
నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనుల్ని బేబీపాండ్స్‌గా వ్యవహరిస్తున్నారు. నిర్వహణలేక వ్యర్థాలతో నిండిపోయిన బేబిపాండ్స్‌ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి గణేష్ మట్టి విగ్రహాలు మేయర్ పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment