నేకరికల్లు(గుంటూరు): గణేష్ విగ్రహం నిమజ్జనానికి వెళ్లిన ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. గుంటూరు జిల్లా నేకరికల్లు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని గుండ్లపల్లిలో గురువారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. నిమజ్జనం చేయటానికి సమీపంలోని చెరువు వద్దకు శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్తులంతా వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తుడు కె.సాంబిరెడ్డి(50) విగ్రహ నిమజ్జనం అనంతరం చెరువులో ఈతకొట్టి, ఒడ్డున కూర్చున్నాడు. కొద్దిసేపటికే అక్కడికక్కడే పడిపోయి మృతి చెందాడు. తీవ్ర గుండెపోటుతోనే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.